story_id
int64 2.44M
2.54M
| headline
stringlengths 1
363
| article
stringlengths 35
14.6k
|
---|---|---|
2,536,607 | మెగా హెల్త్ క్యాంప్నకు ఆహ్వానం | చార్మినార్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతిని పురస్కరించుకొని ఈనెల 25న దారుల్ షిఫా ప్లే గ్రౌండ్లో బీజేపీ మెడికల్ సెల్, బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్న ట్టు బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు మీర్ ఫిరసత్ అలీ బాకరి తెలిపారు. ఈమేరకు సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని బీజేపీ కార్యాలయంలో కలిసి హెల్త్ క్యాంప్నకు హాజరు కావాలని కోరారు. |
2,536,608 | 26న కేవల్ కిషన్ ముదిరాజ్ వర్ధంతి | అఫ్జల్గంజ్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రైతు కూలీల కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప పోరాటయోధుడు దివంగత కేవల్ కిషన్ ముదిరాజ్ అని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ హైదరాబాద్ సిటీ అధ్యక్షురాలు రాధిక ముదిరాజ్, శీలం సరస్వతి ముదిరాజ్, నాగశ్రీ ముదిరాజ్, శారదా ముదిరాజ్ల నేతృత్వంలో ఈనెల 26న మెదక్లో జరిగే కేవల్ కిషన్ ముదిరాజ్ వర్ధంతి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. |
2,536,609 | మతమార్పిడిలను అరికట్టాలి | గోషామహల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల కేంద్రంగా నడుస్తున్న మతమార్పిడిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ సోమవారం రెసిడెన్షియల్ కళాశాలల సెక్రెటరీ సీహెచ్ రమణకుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. హసన్పర్తి కళాశాలలో ప్రిన్సిపాల్ ఇందుమతి మతమార్పిడి మాఫి యా కొనసాగిస్తున్నారని, విద్యార్థినులను ప్రలోభాలకు గురిచేసి మతం మార్పిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. |
2,536,610 | విద్యార్థులకు క్విజ్ పోటీలు | రాజేంద్రనగర్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా సోమవారం శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.సుగుణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ గణిత ఉపాధ్యాయులు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, ఉపాధ్యాయులు లత, అశాజ్యోతి, షేక్ అల్లావలి, ముస్తాఫ, విద్యార్థులు పాల్గొన్నారు. |
2,536,611 | ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి | మదీన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): చాంద్రాయణగుట్ట నర్కిపూల్బాగ్లోని జోనల్ కార్యాలయంలో ఆనవాయితీ ప్రకారం ఈ సోమవారం కూడా ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. తమకు అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు రిఫర్ చేసి పరిష్కరించేలా చూస్తామని జోనల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. ప్రజావాణిలో అలీజాకోట్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణంపై ఒక ఫిర్యాదు అందినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ జాయింట్ కమిషనర్ శైలజ, ఎస్ఈ మహేశ్వర్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ (యూబీడీ) అమీన బీ, టౌన్ప్లానింగ్ సీపీ ఎం.ఎ మాజిద్, ఏంఎసీ రాజారావు, సీనియర్ అసిస్టెంట్ హమీద్, బిల్ కలెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. |
2,536,616 | నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు | చాంద్రాయణగుట్ట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫలక్నుమా సబ్స్టేషన్ నిర్వహణ, వివిధ పనుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఫలక్నుమా ఏడీఈ (సీబీడీ) రాజేందర్ సింగ్, ఏడీఈ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఫలక్నుమా మదీన కాలనీ, బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయం, రైతుబజార్, ఫలక్నుమా బస్డిపో, ఇంజన్బౌలి, జహనుమా, చార్ చమన్, ఛస్మా, వట్టేపల్లి, మిస్కీన్ హోటల్, ఆల్ మదీన హోటల్, ఫలక్నుమా ప్యాలెస్, ముస్తఫా నగర్, నైస్ హోటల్, గుంటల్షా బాబా దర్గా, మహ్మదియ కాలనీ, హబీబ్నగర్, రోషన్ కాలనీ, వికలాంగుల కాలనీ, ఫారూక్నగర్, ఫాతిమా నగర్, గఫూరియా మసీదు, నాగులబండ, రవీంద్రనాయక్ నగర్,గాంధీనగర్, ఫలక్నుమా స్టేషన్ రోడ్డు, జంగమ్మెట్, ఛాద్రిచమన్, శివాజీనగర్, రాజన్నబావి, ఆలియాబాద్, శంషీర్గంజ్, ఛత్రినాక, బోయిగూడ, శ్రీరాంనగర్ కాలనీ, మక్దూంపురా, గౌలిపురా, మురాద్ మహల్, బాలాగంజ్, లాల్దర్వాజ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్టు అఽధికారులు తెలిపారు. |
2,536,612 | 27, 28న ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్ ఉత్సవ్ | మంగళ్హాట్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఈనెల 27, 28వ తేదీల్లో గచ్చిబౌలిలోని సెంటర్ కన్వెన్షన్లో వార్షిక ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్ ఉత్సవ్ –2024 నిర్వహించనున్నట్టు ఐఎంఎ చైర్మన్ డాక్టర్ ఈ.రవీందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోఠిలోని ఇండియన్ మెడికల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవ్ను ఐఎంఏ సిటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఐఎంఏ నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ సెక్రెటరీ డాక్టర్ దిలీప్ బనుశాలి, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్, ఐఎంఏ సిటీ బ్రాంచ్ డాక్టర్ శ్రీరంగ్ అబ్కారీ, సెక్రెటరీ డాక్టర్ మిన్వాజ్ పాల్గొన్నారు. |
2,536,613 | పీవీ నర్సింహారావుకు నివాళి | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీపీసీసీ కార్యదర్శి మనీలాల్ షా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావు, నాయకులు విజయ్ వర్థన్ నాయుడు, ఎ.భాస్కర్, సాంబశివరావు, నాగేశ్వర్రావు తదితరులు– గోషామహల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) |
2,536,618 | వృద్ధురాలి అదృశ్యం | మదీన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి బయటికి వెళ్లిన వృద్ధురాలు రాలేదు. బహదూర్పురా ఎస్ఐ సందీప్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిషన్బాగ్ అసద్బాబానగర్కు చెందిన చాంద్పాషా భార్య గుడీ బీ(80) మానసిక స్థితి సరిగా లేదు. ఈనెల 20న ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712660325 నంబర్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. |
2,536,620 | ‘మేరు కులస్థులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి’ | అఫ్జల్గంజ్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మేరు కులస్థులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, 40ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సీనియర్ నాయకుడు పోల్కం శ్రీనివాస్ కోరారు. సోమవారం ఆయన మంత్రి శ్రీధర్బాబును కలిసి విన్నవించారు. మంత్రిని కలిసినవారిలో రాష్ట్ర మేరు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శంకర్, వెన్ను శివకుమార్, సున్నాకూల్ ప్రశాంత్కుమార్ ఉన్నారు. |
2,536,646 | జయహో పుస్తకం | పుస్తక నడకహైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సమాజంలో పుస్తక పఠనాసక్తిని పెంపొందించేందుకు హైదరాబాద్ పుస్తక మహోత్సవం సోమవారం ‘పుస్తక నడక’ కార్యక్రమాన్ని నిర్వహించింది. పుస్తకాభిమానులంతా ఒకచోట చేరి లోయర్ట్యాంక్బండ్ నుంచి ‘జయహో పుస్తకం’ అంటూ ఎన్టీఆర్ మైదానంలోని దాశరథి ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ చేతులమీదగా ప్రారంభమైన ఈ బుక్వాక్లో విద్యార్థులు, యువత, ప్రచురణ కర్తలు, పాఠకులు, సామాజికవేత్తలు, కవులు, రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాహిత్యం ఆవశ్యకతను తెలియజేశారు. పుస్తకం అజరామరమన్న సందేశాన్ని చాటారు. |
2,536,647 | ప్రగతిశీల సాహిత్యానికి కేరాఫ్ ‘వీక్షణం’ | ప్రపంచ వ్యాప్తంగా కొన్నికోట్ల మంది హృదయాలను హత్తుకున్న టెట్సుకో కురొయనాగి రచనకు ఎన్. వేణుగోపాల్ తెలుగు అనువాదం ‘రైలుబడి’. జపనీస్ భాషలో 1981లో వెలువడిన ఈ పుస్తకం 30కుపైగా ప్రపంచ భాషల్లో, 11కుపైగా భారతీయ భాషల్లోకి అనువాదమైనట్లు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. విద్యాబోధనతో వినోదాన్ని, స్వేచ్ఛను, ప్రేమను కలగలిపిన రెండో ప్రపంచ యుద్ధకాలపు ఆదర్శవంతమైన టోక్యో పాఠశాలను ఈ రచన పరిచయం చేస్తుంది. ఆ అసాధారణమైన పాఠశాలలో పాత రైలుపెట్టెలే తరగతి గదులు. విద్యారంగంతో సంబంధం కలిగిన వారందరితో పాటు పిల్లలు, తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకంగా విమర్శకులు చెబుతారు. చాలాకాలం తర్వాత పాఠకులకు తిరిగి అందుబాటులోకి వచ్చిన ‘రైలుబడి’ పుస్తకం కోసం ‘వీక్షణం’ స్టాల్– 295లో సంప్రదించవచ్చు. ఇతర సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలతోపాటు తెలంగాణ చరిత్ర, తత్వశాస్త్రం, దళిత సాహిత్యం ఈ స్టాల్లో లభ్యమవుతాయి. హైచ్బీటీ, మలుపు, నవచేతన, నవతెలంగాణ తదితర సంస్థల ప్రచురించిన పుస్తకాల్లో ఎంపిక చేసిన 330కుపైగా ఉత్తమ టైటిల్స్ను వీక్షణం స్టాల్ ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచినట్లు వేణుగోపాల్ చెప్పారు. |
2,536,629 | సిటీ.. నేరాల్లో టాప్ | హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గత ఏడాదితో పోల్చితే నేరాల సంఖ్య పెరిగిందని, 2023లో 25,488 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో 35,944 కేసులు నమోదయ్యాయని, కేసుల నమోదులో 40 శాతం వృద్ధి ఉందని వార్షిక నివేదికలో సీసీ సీవీ ఆనంద్ తెలిపారు. 2023లో రూ. 20 కోట్ల రికవరీ చేయగా.. ఈ ఏడాది రూ. 43 కోట్లు బాధితుల ఖాతాలో జమ చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో అనైతిక చర్యలకు పాల్పడిన, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, ఏసీబీకి పట్టుబడిన 30 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ ఏడాదిలో 203 రోడ్డు ప్రమాద కేసుల్లో 215 మంది మరణించారు.డ్రగ్స్పై ఉక్కుపాదం ఈ ఏడాదిలో మొత్తం 322 కేసులు నమోదు చేసి, రూ.13.50 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి 58 మంది పెడ్లర్లు, 57 మంది వినియోగదారులను అరెస్ట్ చేశారు. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆదేశాల మేరకు 2.6 టన్నుల గంజాయితోపాటు రూ.10.50 కోట్ల విలువైన డ్రగ్స్ను ధ్వంసం చేశారు. |
2,536,645 | నేరం..ఘోరం | (5వ పేజీ తరువాయి) చేయగలమని సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాచకొండ కమిషనరేట్లో వక్త్ (వి.క్యూ.టీ.– విజుబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్, టెక్నాలజీ) అనే వినూత్న కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నేరాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఏదైనా నేరం జరిగినప్పుడు తక్షణమే స్పందించి స్పాట్కు వెళ్లడం, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం, ఆ తర్వాత సాంకేతిక, సైంటిఫిక్ ఆధారాలను సేకరించి బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానానికి సమర్పించి నేరస్థులకు శిక్షలు పడేలా చేయడం.. ఇలా అన్ని కోణాల్లో నేర నియంత్రణ, నేరాల ఛేదనకు ‘వక్త్’ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ వక్త్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని, అందువల్లే నేరాలు గతేడాదితో పోల్చితే కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయన్నారు. గతేడాది 27,586 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 28,626 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. పెరిగిన అత్యాచారాలు.. తగ్గిన దొంగతనాలు..గతేడాదితో పోల్చితే రాచకొండ కమినరేట్ పరిధిలో అత్యాచారాలు 17% పెరిగాయని సీపీ తెలిపారు. వరకట్న హత్యలు 13, హత్యలు 11, కిడ్నాప్లు 10, భౌతిక దాడులు 9% పెరిగాయన్నారు. కాగా.. దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. డెకాయిటీలు 50%, రాబరీ 6, దొంగతనాలు 17, ఆటోమొబైల్ చోరీలు 1, గృహహింస 23, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు 10 శాతం తగ్గాయన్నారు. వార్షిక నేర నివేదికలో ప్రధాన అంశాలు• ఈ ఏడాది మొత్తం రాచకొండ పోలీసులు 25,143 కేసులను కోర్టులో విచారణకు వచ్చేలా చేసి రాష్ట్రంలో టాప్లో నిలిచారు.• 30 మంది నేరస్థులకు జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున నేరస్థులకు శిక్షలు పడిన కమిషనరేట్గా రాచకొండ టాప్లో నిలవగా.. దేశఽంలోనూ మెరుగైన స్థానంలో నిలిచే అవకాశం ఉంది. • డయల్–100కు రాచకొండలో ఈ ఏడాది 2,41,742 కాల్స్ వచ్చాయి. సుమారుగా రెండు నిమిషాలకు ఒక కాల్ చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరాసరి సమయం 8.37 నిమిషాలుగా ఉంది.• సైబర్ నేరాల్లో సత్వరమే స్పందించి ఫిర్యాదు చేసిన బాధితులకు రూ. 22 కోట్లు రిఫండ్ చేయించారు.• సొత్తు కొల్లగొట్టిన నేరాల్లో గతేడాది 21.06కోట్లు ఉండగా.. ఈ ఏడాది ప్రాపర్టీ అఫెన్సెస్లో రూ. 23.59 కోట్లు కొల్లగొట్టారు. గతేడాది రూ. 12.77 కోట్లు రికవరీ చేసిన పోలీసులు.. ఈ ఏడాది రూ. 15.47 కోట్లు రికవరీ చేసి 66 శాతం రికవరీ నమోదు చేశారు. |
2,536,630 | చలపతిరావును జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలి | హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారతీయ పాత్రికేయ రంగానికి తలమానికంగా నిలిచి, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన మానికొండ చలపతిరావును ఈతరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని మిజోరాం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కొట్టు శేఖర్ పిలుపునిచ్చారు. అత్యున్నత వృత్తి ప్రమాణాలకు, నైతిక విలువలకు ఆయన పెట్టింది పేరని కొనియాడారు. అలాంటి గొప్ప పాత్రికేయుడి జీవితంమీద ఆకుల అమరయ్య తెలుగులో వెలువడిన మొట్టమొదటి పుస్తకం ‘భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు’ అని అన్నారు. మిరియాల వెంకటరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం యూసఫ్గూడలోని ఓ ఫంక్షన్హాల్లో ఈ పుస్తకాన్ని ఆచార్య కొట్టు శేఖర్ ఆవిష్కరించారు. తొలి ప్రధాని నెహ్రూతో చలపతిరావుకు ఉన్న ఆత్మీయానుబంధాన్ని, నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎడిటర్గా అందించిన సేవలను వక్తలు గుర్తుచేసుకున్నారు. పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం తిరస్కరించిన నిరాడంబరుడు మానికొండ చలపతిరావు అని పాశం యాదగిరి శ్లాఘించారు. |
2,536,643 | తండ్రీ కొడుకులే సూత్రధారులు | (5వ పేజీ తరువాయి) ఇంటికి తీసుకెళ్లారు. తమ వద్ద పనిచేస్తున్న సమీర్ తన కుమార్తెను వివాహం చేసుకోవడంతో మహ్మద్ షబ్బీర్ అహ్మద్, అతడి కుమారుడు మహ్మద్ ఉమేర్ కక్ష పెంచుకున్నారు. తన కుమార్తెకు విడాకులు ఇవ్వాలని పలుమార్లు సమీర్కు చెప్పగా అతడు అంగీకరించలేదు. సాదాఫ్కు మరో వివాహం చేయాలనుకుంటే సమీర్ అడ్డుపడుతుండడంతో అతడిని అడ్డు తొలగించుకోవడానికి హత్య పథకం రూపొందించారు. ఈ క్రమంలో వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో పది నేరాల్లో నిందితుడు, రౌడీషీటర్ అబ్దుల్ మతిన్(25), బాలాపూర్కు చెందిన మరో రౌడీషీటర్ సయ్యద్ సోహెల్(25), బాలాపూర్కు చెందిన షేక్ అబూబకర్ సిద్దిక్, ఇబ్రహీంతో కలిసి ఈనెల 21వ తేదీ రాత్రి సమీర్ ఇంటి వద్ద స్నేహితులతో మాట్లాడుతుండగా కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో దాడిచేసి చంపేసి పారిపోయారు. మృతుడి తల్లిదండ్రులు, స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు తండ్రీకొడుకులు నిజామాబాద్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులను అరెస్ట్ చేశామని, ఇబ్రహీం పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు మూడు కత్తులు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, డీఐ సర్దార్ నాయక్, ఎస్ఐలు నాగేంద్రబాబు, శివశంకర్, గిరిధర్ పాల్గొన్నారు. |
2,536,631 | అనువాద ‘పల్లవి’ @ 214 | అపరాధ పరిశోధన నవలలు, రష్యన్ క్లాసిక్స్ తదిదర అనువాదాలకు పుస్తక ప్రదర్శనలోని పల్లవి పబ్లికేషన్స్ స్టాల్– 214ను సందర్శించాల్సిందే.! విజయవాడకు చెందిన ఈ ప్రచురణ సంస్థ చాలాకాలంగా అచ్చులోలేని ఆణిముత్యాల్లాంటి అనువాదాలను హైదరాబాద్ పుస్తక ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో మరియో పుజో ‘ఒమెర్టా’, ‘ది గాడ్ పాదర్’, ఇమాన్యూల్ కజికివిచ్ ‘అజేయులు’, వోల్టైర్ ‘ఆశాజీవి’, ఇవాన్ ఓల్బ్రాట్ ‘గజదొంగ నికోలా’, గొగోల్ ‘తారాస్ బుల్బా’, విక్టర్ హ్యూగో ‘బీదలపాట్లు’, అగథా క్రిష్ఠీ ‘నకిలీ మనిషి’ తదితర టైటిల్స్ వందకుపైగా ఉన్నాయి. టెంపోరావ్ డిటెక్టివ్ నవలలు, కాళ్ళకూరి నారాయణరావు ‘చింతామణి’, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ‘సత్యహరిశ్చంద్రీయం’, సురవరం ప్రతాపరెడ్డి ‘రామాయణ విశేషములు’ తదితర అరుదైన పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పల్లవి పబ్లికేషన్స్ స్టాల్లో లభ్యమవుతాయి. |
2,536,632 | సెకనుకు రెండు బిర్యానీల డెలివరీ | ఫుడ్ డెలివరీలో అగ్రస్థానం • వెల్లడించిన ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ అధ్యయనంహైదరాబాద్ సిటీ, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్ఫామ్పై భారతీయులు ఏ విధంగా ఫుడ్ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ చేశారు. నిమిషానికి సుమారు 158 ఆర్డర్లు, సెకనుకు రెండు బిర్యానీలను ఆర్డర్ చేశారట. స్విగ్గీ తొమ్మిదేళ్లుగా విడుదల చేస్తున్న నివేదికలో బిర్యానీ రారాజుగా నిలవడం విశేషం. బిర్యానీ తరువాత అల్పాహార విభాగంలో దోశ నిలిచింది. ఈ ఏడాది 2.3 కోట్ల దోశలను ఆర్డర్ చేశారు. స్నాక్స్ విభాగంలో చికెన్ రోల్ అని చెబుతోందీ అధ్యయనం. దీనిని 24.8 లక్షల మంది ఆర్డర్ చేశారని, పొటాటో ఫ్రైలను 13 లక్షల మందికి పైగా ఆర్డర్ చేశారని వెల్లడించింది. ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబరు 22 వరకు అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా నివేదిక రూపొందించామని స్విగ్గీ వెల్లడించింది. బెంగళూరులో ఓ భోజన ప్రేమికుడు ఒకే ఆర్డర్లో ఏకంగా 49,900 రూపాయల విలువైన పాస్తా కొనుగోలుతో రికార్డు సృష్టించాడు. ముంబైకు చెందిన ఓ ఆహారాభిమాని 3 లక్షల రూపాయలను ఒకే రెస్టారెంట్ నుంచి చేస్తే, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అత్యధికంగా 1.22 లక్షల రూపాయలను సింగిల్ ఆర్డర్లో పొదుపు చేయడం విశేషం. |
2,536,633 | జర్నలిస్టులకు డబ్ల్యూజేఐ అవార్డులు | • ఎంట్రీలకు ఆహ్వానంహైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నవారికి అవార్డులు ఇవ్వనున్నట్లు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూజేఐ) తెలంగాణ శాఖ ప్రకటించింది. నగరంలోని జర్నలిస్టుల కాలనీలో సోమవారం అవార్డుల బ్రోచర్ను రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కృపాకర్, రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, కార్యదర్శి క్రాంతి విడుదల చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు ఈ ఏడాది నుంచి మూడు కేటగిరీల్లో అవార్డులు ఇస్తున్నట్లు వారు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ విజేతలను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. జనవరి 10లోగా ఎంట్రీలు పంపాలని కోరారు. జనవరి మూడో వారంలో పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. డబ్ల్యూజేఐ హైదరాబాద్ కమిటీని ప్రకటించింది. అధ్యక్ష్య కార్యదర్శులుగా బాలకృష్ణ, పవన్, ఉపాధ్యక్షులుగా కోటిరెడ్డి, నవత, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా హర్ష, కోశాధికారిగా సావర్కర్ను ప్రకటించారు. |
2,536,639 | పద్దు.. పాస్..! | (5వ పేజీ తరువాయి) బకాయి చెల్లిస్తాం. సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది’ అని కమిషనర్ ఇలంబరిది సమాధానమిచ్చినట్టు ఓ సభ్యుడు తెలిపారు. రూ.700 కోట్ల అప్పు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,440 కోట్లతో ముసాయిదా పద్దు రూపొందించారు. 2024–25 సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే రూ.503 కోట్లు పెంచారు. మిగులు రూ.445 కోట్లు చూపిన ఆర్థిక విభాగం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3000 కోట్లు, 15వ ఆర్థిక సంవత్సరం నిధులు రూ.279 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రూ.700 కోట్లు అప్పుగా తీసుకోనున్నట్టు చూపారు. ఇప్పటికే సంస్థకు రూ.6వేల కోట్లకుపైగా రుణం ఉంది. వీటి వడ్డీ, వాయిదాలు చెల్లించేందుకు రూ.1252.90 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఈ మొత్తం చెల్లించడమే సంస్థలకు ఇబ్బందికరంగా ఉంది. అయినా పరిమిత స్థాయిలో ఆర్థిక వనరులున్న నేపథ్యంలో అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2654 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. నిధులు కేటాయించాలన్న జీహెచ్ఎంసీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుందని, ఈ క్రమంలోనే సవరణ బడ్జెట్లో మార్పులు చేసినట్టు ఓ అధికారి తెలిపారు. |
2,536,642 | పరిచయస్తులే పగబడుతున్నారు | (5వ పేజీ తరువాయి) సర్వెంట్లు, గార్డియన్స్, డ్రైవర్లు, ఇతరులు ఉంటున్నట్లు తేలిందని సీపీ వెల్లడించారు. ఆటకట్టిస్తున్నా.. ఆగని అరాచకాలుప్రేమించలేదని.. పెళ్లికి ఒప్పుకోలేదని ఒకడు.. లైంగికంగా సహకరించలేదని మరొకడు.. వేరొకరితో చనువుగా మాట్లాడుతోందని ఇంకొకడు.. ఇలా రకరకాల కారణాలతో మహిళలపై కక్ష పెంచుకొని అదును చూసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదురు దాడికి దిగిన మహిళలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న కేసుల్లో నిందితులకు ఇటీవల యావజ్జీవ కారాగారం, 20 ఏళ్లు,. 15 ఏళ్లు కఠిన శిక్షలు అమలు చేశారు. అయినా మృగాళ్లలో మార్పు రావడంలేదు. హెల్ప్లైన్ నంబర్లుడయల్–100, చైల్డ్ హెల్స్లైన్ నంబర్ – 1098, వాట్సాప్ నంబర్– 8712662111. రాచకొండ పోలీస్ ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్), ఇన్స్టా వంటి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. |
2,536,634 | తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు | తెలుగుభాషా చరిత్ర ద్రావిడ భాషలు, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, పత్రికా భాషా నిఘంటువులు, ధ్వన్యనుకరణ పదకోశం, భాషాంతరంగం తదితర అరుదైన పుస్తకాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. వీటితో పాటు కాశీఖండం, కుమార సంభవం, బసవపురాణం, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, మనుచరిత్ర, శ్రీ పాండురంగ మహత్యం, మొల్ల రామాయణం, శివరాత్రి మహత్యం వంటి ప్రబంధాలకు వ్యాఖ్యానాలు, పరిశోధనాత్మకమైన పీఠికలతో సహా అందుబాటులోకి తెచ్చారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు 12సంపుటాలుగా ప్రచురించింది. ఇవిగాక మరెన్నో అనువాద గ్రంథాలు, జీవిత చరిత్రలు, నాటకాలు, సాహిత్య చరిత్ర పుస్తకాల కోసం తెలుగు వర్సిటీ స్టాల్ – 146ను సందర్శించాల్సిందే. మిగతా రోజుల్లో అంత సులువుగా లభ్యంకాని ఆ విశ్వవిద్యాలయ ప్రచురణలను ఒకచోట చూడాలంటే హైదరాబాద్ పుస్తక మహోత్సవంలోనే సాధ్యం. |
2,536,635 | ఆరు నెలల్లో టిమ్స్ నిర్మాణం పూర్తి చేయండి | (5వ పేజీ తరువాయి) ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ఎల్వోసీలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు.గోదావరి నీటితో మూసీఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా నిర్మిస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేసి, గోదావరి నీటితో నింపి బాగుచేస్తామన్నారు. కార్యక్రమంలో రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి, రాంమోహన్గౌడ్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. |
2,536,637 | 153 సెల్ఫోన్ల రికవరీ.. 117 మందికి అందజేత | మారేడుపల్లి/రెజిమెంటల్బజార్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సెల్ఫోన్లు చోరీ అయినా, పోగొట్టుకున్నా సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు. సోమవారం గోపాలపురం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు. నార్త్జోన్లో పలు పోలీస్స్టేషన్ల పరిధిలో బాధితులు పోగొట్టుకున్న 153 ఫోన్లను రికవరీ చేశామని, 117 మందికి అందజేసినట్లు తెలిపారు. గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో సెల్ఫోన్లు ఎక్కువగా చోరీ అవుతున్నాయన్నారు. ఓ మహిళ రెండేళ్ల క్రితం సెల్ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోన్ను రికవరీ చేసి ఆమెకు అందజేశామని చెప్పారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు ఐఎంఈఐ నంబర్తో పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏసీపీలు రమేష్, సుబ్బయ్య, నార్త్జోన్ పరిధిలోని 11 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. |
2,536,638 | మొగల్పురాలో పురాతన నాణేల ప్రదర్శన | చార్మినార్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పురాతన నాణేలు, కరెన్సీ ప్రదర్శన మొఘల్పురా ఉర్దూఘర్లో సోమవారం ప్రారం భం అయింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇరువై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కొంతమంది తమ వద్ద ఉన్న పురాతన నాణేలు తీసుకొచ్చి చూపించారు. ప్రదర్శన మంగళవారం, బుధవారం కూడా ఉంటుందని ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి అబ్దుల్ హై ఖాద్రి తెలిపారు. |
2,536,644 | ప్రొఫెసర్ సాయిబాబ స్మృతిసంచిక ఆవిష్కరణ | ప్రొఫెసర్ సాయిబాబ స్మృతిలో అరుణతార ప్రత్యేక సంచికను వెలువరించింది. దీన్ని సోమవారం తోపుడుబండి సాదిక్ వేదికపై విరసం సీనియర్ నాయకురాలు కృష్ణాబాయి ఆవిష్కరించారు. రాంకీ సభాధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు నందిని సిధారెడ్డి, కొండేపూడి నిర్మల, రచయిత శివరాత్రి సుధాకర్, ప్రజాగాయని మాభూమి సంధ్య తదితరులు సాయిబాబ ఉద్యమ జీవితంమీద ప్రసంగించారు. |
2,536,641 | శిక్షలు పడటంలో ‘రాచకొండ’ టాప్ | (5వ పేజీ తరువాయి) ఒకటిగా పేరు తెచ్చుకుంది. మొత్తం 5568 కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడగా.. కన్విక్షన్ రేటు 64 శాతంగా నమోదైంది. నేరస్థులకు పడిన శిక్షలుజీవిత ఖైదు – 30 మంది20 ఏళ్లు – 8 మంది13 ఏళ్లు – 1, పదేళ్లు – 11ఏడేళ్లు – 7, ఆరేళ్లు – 1ఐదేళ్లు – 15, నాలుగేళ్లు –1, మూడేళ్లు –20, రెండేళ్లు –24, ఏడాది – 22, ఆరు నెలలు పైన–20 |
2,536,652 | మూత్రపిండాలు ఇలా క్షేమం | మధుమేహం, అధిక రక్తపోటు, అస్తవ్యస్థ ఆహార, జీవనశైలులు... ఇవన్నీ మూత్రపిండాలను దెబ్బతీసేవే! అయితే చాప కింద నీరులా నిశ్శబ్దంగా, రహస్యంగా జబ్బుపడే తత్వం మూత్రపిండాలకు ఉంటుంది. కాబట్టి ముందస్తు పరీక్షలతో వాటి పనితీరు మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు వైద్యులు. మూత్రపిండాలు నిరంతరంగా రక్తాన్ని వడగడుతూ, దాన్లోని పోషకాలను శరీరం శోషించుకునేలా చేస్తాయి. అంతటి సమర్థమైన మూత్రపిండాలు పనిచేయడానికి మొండికేస్తే, పోషకాల శోషణ తగ్గడమే కాకుండా, ఒంట్లో విషాలు పేరుకుపోతాయి. అయితే ఈ పరిస్థితిని పసిగట్టగలిగే లక్షణాలు మూత్రపిండాల ప్రారంభ దశలో బయల్పడవు. కానీ మూడో దశ నుంచి కొన్ని లక్షణాలు బయల్పడడం మొదలుపెడతాయి. అవేంటంటే...• మూత్రంలో నురగ• అధిక రక్తపోటు• వాపు మీద వేలితో ఒత్తి చూస్తే, గుంట పడుతుంది. • కాళ్లు, కళ్ల దిగువన వాపు కనిపిస్తుంది. మూత్రపిండాలు పాడైతే...• అధిక రక్తపోటు. మూత్రపిండాలకు రక్తప్రసరణ మందగించి, రక్తంలో వెనక్కి గుండె వైపు ప్రసరిస్తూ, రక్తంలో ఒత్తిడిని పెంచుతుంది. దాంతో రక్తపోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి గుండెకూ, మూత్రపిండాలకు చేటు చేస్తుంది. • అలసట. రోజంతా అలసట ఆవరించి ఉంటుంది. ఇందుకు కారణం అవసరానికి మించి యూరియా రక్తంలో పేరుకుపోవడమే! • మూత్రంలో ప్రొటీన్ నష్టం. మూత్ర పరీక్ష చేయించుకుంటే, ఎక్కువ మోతాదుల్లో ప్రొటీన్ కనిపిస్తుంది. మూత్రపిండాల్లోని ఫిల్టర్ల ద్వారా ఎక్కువ మోతాదుల్లో ప్రొటీన్ నష్టం జరుగుతుంది.• ఆమ్లత్వంతో కూడిన మూత్రం. శరీరంలో ఆమ్లత్వం పెరిగిపోతుంది. శరీరంలోని అమ్మోనియాలో అసమతౌల్యం ఏర్పడడం మూలంగా శరీర పిహెచ్ విలువలు పెరిగిపోతాయి. ఒకవేళ మధుమేహులైతే, చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి. ఈ పరిస్థితిని పసిగట్టడంలో విఫలమైతే, ‘కీటోఅసిడోసిస్’ అనే సమస్య మొదలవుతుంది. మధుమేహులై ఉండి, చక్కెర మందులు వాడకుండా ఉన్నా, చక్కెర మెతాదులను అదుపులో ఉంచుకోకపోయినా, కీటోఅసిడోసిస్ తలెత్తుతుంది. • శరీరంలో విటమిన్ డి మోతాదు తగ్గిపోతుంది. మూత్రపిండాలు డి విటమిన్ను శరీరానికి ఉపయోగపడేలా, యాక్టివ్ డి విటమిన్గా మారుస్తాయి. మూత్రపిండాలు దెబ్బతింటే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దాంతో క్యాల్షియం శోషణ సమస్య ఏర్పడి, గుండె రక్తనాళాల్లో క్యాల్షియం పేరుకోవడం మొదలవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.ముప్పు ఎవరికి?మధుమేహం, మూత్రపిండాల్లో ఇన్ఫ్లమేషన్, అధిక రక్తపోటు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నొప్పి నివారణ మందులు, ఊబకాయులు, కుటుంబ చరిత్రలో తీవ్ర మూత్రపిండాల వ్యాధులున్న వాళ్లకు మూత్రపిండాలు పాడయ్యే, విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందర్లో పుట్టుకతోనే మూత్రపిండాల్లో సిస్టులు ఉంటాయి. ఇవి వయసుతో పాటు పెరుగుతూ మూత్రపిండాలను దెబ్బ తీస్తాయి. అయితే మూత్రపిండాలకు సంబంధించిన ఎలాంటి రుగ్మత అయినా ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను కనబరచకపోవడం వల్ల, మూత్రపిండాల జబ్బు తీవ్రతరమయ్యే పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి దశలో డయాలసిస్, మూత్రపిండాల మార్పిడి అవసరమవుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే మూత్రపిండాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నవాళ్లందరూ ఏడాదికోసారి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ (గ్లోమెర్యులార్ ఫిల్ట్రేషన్ రేట్), మూత్రంలో ప్రొటీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో ప్రారంభ దశలో ఉన్న మూత్రపిండాల వ్యాధులను కనిపెట్టి, వ్యాధి తీవ్రమవకుండా అరికట్టే మందులను మొదలుపెట్టుకోవచ్చు. సమర్థమైన మందులతో...మూత్రపిండాలు జబ్బుపడినప్పుడు మూత్రంలో ప్రొటీన్ నష్టం ప్రధాన సూచన. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఒక రోజులో మూత్రం ద్వారా 100మి.గ్రా ప్రొటీన్ నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ మూత్రపిండాల వ్యాధులున్న వారిలో ప్రొటీన్ నష్టం, 500 నుంచి 1000 మి.గ్రా ఉంటుంది. ఈ నష్టానికి అడ్డుకట్ట వేసే సమర్థమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రారంభంలోనే ప్రొటీన్ నష్టాన్ని కనిపెట్టి, వెంటనే మందులు వాడుకోవడం మొదలుపెడితే, మూత్రంలో ప్రొటీన్ నష్టం తగ్గడంతో పాటు మూత్రపిండాల వ్యాధి ఒక దశ నుంచి తర్వాతి దశకు పెరగకుండా ఉంటుంది.మూత్రపిండాల మార్పిడిజీవితాంతం డయాలసిస్ మీద ఆధారపడడం కంటే మూత్రపిండాల మార్పిడితో శాశ్వత పరిష్కారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. కుటుంబసభ్యుల నుంచి సేకరించిన మూత్రపిండంతో శరీరం ఆ అవయవాన్ని వ్యతిరేకించే తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాధినిరోధకశక్తిను తగ్గించే మందులను కూడా పరిమితంగా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. మూత్రపిండాన్ని దానం చేయడం వల్ల శరీరానికి అదనంగా ఒరిగే నష్టం కూడా ఉండదు. ఒక కన్ను లేకపోతే, రెండో కన్నుతో జీవితాంతం బ్రతకగలిగినట్టే, ఒక మూత్రపిండంతో కూడా నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే బ్లడ్ గ్రూపులు కలవకపోయినా, మూత్రపిండాలను మార్పిడి చేసే వెసులుబాటు కూడా ఉంది. |
2,536,653 | సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం కావాలి! | శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? మానసిక ఆరోగ్యం సంగతేమిటి? ఇవి రెండు సరిగ్గా లేకపోతే సంపూర్ణ ఆరోగ్యం సాధించటం సాధ్యమవుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ‘‘సంపూర్ణ ఆరోగ్యమంటే కేవలం శరీరం మాత్రమే కాదు.. మనస్సు, ఆత్మ– అన్నీ ఆనందంగా ఉండాలి. అప్పుడే నిజమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. వీటిని ఎలా సాధించగలుగుతామనే విషయాన్ని ఆయుర్వేద గ్రంథాల్లో స్పష్టంగా వివరించారు’’ అంటారు శ్రీవర్మ ఆయుర్వేద ఆసుపత్రుల వ్యవస్థాపాకుడు డాక్టర్ శ్రీవర్మ. ఆయుర్వేదాన్ని జీవనంగా మార్చుకొని వైద్యవృత్తిని పరంపరగా సాగిస్తున్న కేరళకు చెందిన తిరువైథన్కోడ్ సంప్రదాయంలో 9వ తరం వాడైన శ్రీవర్మ– ఆ వైద్య విధానానికి సంబంధించిన అనేక అంశాలను ‘డాక్టర్’తో పంచుకున్నారు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావటానికి ‘ప్రసన్న ఆత్మేంద్రియానాం’ అనే సూత్రాన్ని అనుసరించాలని ఆయుర్వేదం చెబుతుంది. శరీరం, మనస్సు, ఆత్మ... ఈ మూడు ఒకదానితో మరొకటి స్నేహంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. ఆనందంగా జీవించగలుగుతాడు. ఈ సూత్రాన్ని మరింతగా విశ్లేషిద్దాం. ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు అతణ్ణి – ‘‘ఆహారం తినగలుగుతున్నారా?’’, ‘‘దినచర్యలు తీర్చుకోలుగుతున్నారా?’’, ‘‘నిద్ర సరిగ్గా పడుతోందా?’’, ‘‘శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పులు ఉన్నాయా?’’ లాంటి ప్రశ్నలు మొదట అడుగుతాను. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. వీటితో పాటు– ‘‘ఏవైనా ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయా’’? ‘‘రాత్రి ఎలాంటి కలలు వస్తున్నాయి’’ లాంటి ప్రశ్నలు కూడా అడుగుతాను. ఇవి మానసిక స్థితికి సంబంధించినవి. ఈ రెండింటితో పాటుగా– ‘‘మీరు ప్రతి రోజూ ధ్యానం చేస్తారా?’’ లాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడతాను. ఇవి మన ఆధ్మాత్మిక స్థితికి సంబంధించినవి. ఈ మూడు సరిగ్గా ఉంటే ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడే! అయితే ఈ మూడు సంపూర్ణంగా ఉండే వారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇలా సంపూర్ణమైన ఆరోగ్యం సాధించటానికి ఆయుర్వేదం మరో రెండు సూత్రాలు చెబుతుంది. మొదటిది ‘దినచర్య’. రెండోది ‘రుతుచర్య’. ఇవి రెండు ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. రెండూ ముఖ్యమే...ఉదయం లేచిన తర్వాత ఎంత సేపు వ్యాయామం చేస్తున్నాం? ఎలాంటి ఆహార పదార్థాలు తింటున్నాం? ఎన్ని నీళ్లు తాగుతున్నాం? ఎంత సేపు నిద్ర పోతున్నాం?– ఇవన్నీ మన దినచర్యలో భాగాలు. మనం ఏ రుతువులో ఉన్నాం? ఆ రుతువులో ఎలాంటి పదార్థాలు తినాలి? లాంటివి రుతుచర్యలోకి వస్తాయి. ఒక వ్యక్తి శరీర లక్షణాలను గుర్తించిన తర్వాత– పైన పేర్కొన్న ‘దినచర్య’, ‘రుతుచర్య’లను సమన్వయం చేసుకొని, అవసరమైతేనే మందులను ఇవ్వాల్సి ఉంటుంది. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం– మన శరీరానికి రుగ్మతలు ఒక రోజులో రావు. దాని వెనుక ఒక దీర్ఘకాలిక కారణం ఉంటుంది. ఒక రుతువులో తినే ఆహారపదార్థాలు, దినచర్య– ఆ తరువాతి రుతువులో కూడా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు శీతాకాలం తీసుకుందాం. శీతాకాలం చల్లగా ఉంటుంది.. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం తేమ. శాస్త్ర ప్రకారం బయట ఉండే తేమ శరీర కణాలలోకి కూడా చేరుతుంది. ఎండకాలం వచ్చినప్పుడు ఈ తేమ శరీరంపై చర్మ వ్యాధుల రూపంలో బయటకు వస్తుంది. చాలామందికి వేసవిలో చర్మవ్యాధులు ఎక్కువగా వస్తాయి. దీనికి కారణం వేసవి కాలంలో ‘దినచర్య’ కాదు, శీతాకాలం నుంచి వెంటాడిన ‘రుతుచర్య’.ఈ కాలంలో పనికొస్తాయా?ఆయుర్వేదం పురాతన శాస్త్రం కదా... ఈ ఆధునిక యుగంలో పనికొస్తుందా? ఆయుర్వేద మందులు పనిచేస్తాయా? అనే ప్రశ్నలు తరచూ ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో ‘ఒకస్మాతియం’ అనే సూత్రం ఉంటుంది. మన శరీరానికి పరిస్థితులకు అనుగుణంగా మారగలిగే తత్వం ఉందని దీని అర్ధం. మన శరీరంలోని కణాలు పరిస్థితులకు తగిన రీతిలో మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 20 ఏళ్ల వరకు కేవలం శాకాహార భోజనమే చేశాడనుకుందాం. శరీరంలోని అవయవాలన్నీ ఆ ఆహారాన్ని జీర్ణం చేయటానికి, దాని నుంచి శక్తిని గ్రహించటానికి అలవాటు పడి ఉంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల అతను మాంసాహారానికి మారాడనుకుందాం. అప్పుడు అతని శరీరంలోని అవయవాలన్నీ మాంసాహారానికి అలవాటు పడతాయి. ఇదే విధంగా ఆయుర్వేద సూత్రాలు అన్ని వాతావరణాలలోను, అన్ని పరిస్థితులలోను పనిచేస్తాయి. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ఆయుర్వేదం ప్రతి వ్యక్తి ఏడాదికి ఒకసారి తన శరీరాన్ని పునరుత్తేజితం చేయాలని సూచిస్తుంది. పునరుత్తేజం అంటే మన శరీరంలోని అన్ని భాగాలను శుద్ధి చేసుకోవటం. శాస్త్ర గ్రంథాల ప్రకారం– మానవ శరీరంలో అన్నమయ్య కోశం (జీర్ణ వ్యవస్థ), ప్రాణమయ కోశం (శ్వాస), మనోమయ కోశం (మానసిక స్థితిగతులు), విజ్ఞానమయ కోశం (మెదడు దాని సంబంధమైన చర్యలు), ఆనందమయ కోశం(ప్రాణశక్తి) ఉంటాయి. వీటిని ఏడాదికి ఒకసారి శుద్ధి చేసుకోవాలి. ఇలా శుద్ధి చేసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ తొలగిపోతాయి. ఏడాదిలో మిగిలిన సమయమంతా సంపూర్ణ ఆరోగ్యంతో గడపవచ్చు. |
2,536,656 | వాపు నొప్పులకు అడ్డు కట్ట | శరీరంలో వాపులు నొప్పులను తగ్గించే పదార్థాలను ఆహారంలో జోడించడం ద్వారా ఇన్ఫ్లమేషన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అవేంటంటే....బ్లూబెర్రీస్వీటిలో సహజసిద్ధ రసాయనాలైన పాలిఫినాల్స్ ఉంటాయి. వీటిలో ఉండే యాంథోసయానిన్ పాలిఫినాల్స్ వల్లే బ్లూబెర్రీస్కు నీలి రంగు సమకూరుతుంది. ఈ పాలీఫినాల్స్ శరీరంలోని వాపు, నొప్పులను తగ్గించి ఇన్ఫ్లమేషన్ను అరికడతాయి.వాల్నట్స్వీటిలోని అత్యధిక ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలిక్ యాసిడ్లు, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. వాల్నట్స్లో ఉండే సి రియాక్టివ్ ప్రొటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ పోషకాలు కీళ్ల సంబంధ వాపులు, నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.డార్క్ చాక్లెట్వీటిలో సమృద్ధిగా ఉండే ఫ్లేవనాయిడ్స్ వాపులను తగ్గిస్తాయి. చాక్లెట్ ఎంత ముదరు రంగులో ఉంటే దాన్లో అంత ఎక్కువ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కాబట్టి 70% కోకో, అతి తక్కువ చక్కెరలను కలిగి ఉండే డార్క్ చాక్లెట్ను ఎంచుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్ సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, కంటి నిండా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. |
2,536,983 | తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు | ‘నాకు ఇప్పుడు 90 ఏళ్లు వచ్చాయి. ఆరోగ్యంగానే ఉన్నా. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నా. శరీరం, మనసు సహకరించినంత కాలం సినిమాలు తీయాలన్నది నా కోరిక’ అని కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా తనని కలసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్యామ్ బెనెగల్ ఇక లేరు. తెలంగాణ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సామాజిక సమస్యలు, ఆర్ధిక అసమానతలను చర్చిస్తూ శ్యామ్ తీసిన చిత్రాలు ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆయన రూపొందించిన ‘అంకుర్’, ‘నిషాంత్’, ‘సుస్మన్, ‘మండి’, ‘వెల్ డన్ అబ్బా’ చిత్రాల నేపథ్యం తెలంగాణ కావడం విశేషం. పేరున్న నటీనటుల జోలికి పోకుండా కొత్త తారలకు అవకాశాలు ఇస్తూ సినిమాలు రూపొందించారు శ్యామ్ బెనగల్. స్మితా పాటిల్, షబానా అజ్మీ, నసీరుద్దిన్ షా, ఓం పురి వంటి తారలు శ్యామ్ బెనగల్ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అవార్డులు పొందారు. పన్నెండేళ్ల వయసులోనే ..శ్యామ్ పూర్తి పేరు బెనగళ్ల శ్యామసుందర్రావు. ఆయన తండ్రి శ్రీధర్ బెనగల్ కర్నాటకకు చెందిన వారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహణ కుటుంబం వారిది. చిన్నతనం నుంచి శ్యామ్కు సినిమాల మీద ఆసక్తి. అది గమనించి ఆయన తండ్రి ఓ కెమెరా కొనిచ్చారు. ఆ కెమెరాతోనే పన్నెండేళ్ల వయసులో ఓ లఘు చిత్రం తీశారు. సికిందరాబాద్ తిరుమలగిరిలో ఒక స్టూడియో కూడా ఉంది. ఓల్డ్ ఆల్వాల్లో ఉన్న ఇంట్లో కొన్ని రోజులు గడిపారు శ్యామ్. ప్రస్తుతం ఆ ఇల్లు శిధిలావస్థలో ఉంది. శ్యామ్ సోదరుడి కుమారుడు శ్రీధర్ ఇప్పుడు ఆల్వాల్లోనే ఉంటున్నారు. శ్యామ్ బెనెగల్ అల్వాల్ నుంచి రోజూ సైకిల్ మీద బషీర్బాగ్లోని నిజాం కళాశాలకు వెళ్లేవారు. అలా సైకిల్ తొక్కడం లో అనుభవాన్ని సంపాదించిన ఆయన సైకిల్ పోటీల్లోనూ ఛాంపియన్గా నిలిచారు.కాపీ రైటర్గా కెరీర్ ప్రారంభించి..ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందిన శ్యామ్ బెనగల్ మొదట ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ హెడ్గా మారారు. 1962లో తొలిసారిగా ఆయన గుజరాతీలో ‘ఘేర్ బేతాగంగ’ పేరుతో డాక్యుమెంటరీ తీశారు. ఇక అక్కడి నుంచి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆయనకు దశాబ్ద కాలం పట్టింది. ఆ సినిమా ‘అంకుర్’. ఈ సినిమాతోనే షబానా అజ్మీ, అనంత్ నాగ్ పరిచయమయ్యారు. తెలంగాణలో ఆర్ధిక అసమానతలు, లైంగిక వేధింపుల గురించి శ్యామ్ తీసిన చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ ఆల్వాల్, మచ్చ బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో జరగడం విశేషం. జాతీయ ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘అంకుర్’ అవార్డ్ పొందింది. ఇందులో నటించిన షబానా అజ్మీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.పారలల్ సినిమాకు ఆద్యుడు‘అంకుర్’ చిత్ర విజయం అందించిన ప్రోత్సాహంతో 1970–80ల దశకంలో పారలల్ సినిమాకు ఊపిరి పోశారు శ్యామ్. ఆ తర్వాత నిషాంత్ (1975), మంథన్ (1976), భూమిక( 1977) వంటి చిత్రాలను రూపొందించారు. వీటిల్లో ‘మంథన్’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గుజరాత్లోని పాడి పరిశ్రమ అభివృద్ది గురించి తీసిన సినిమా ఇది. ఈ చిత్రకథ విన్న ఐదు లక్షల మంది గుజరాత్ రైతులు తలో రెండు రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ చిత్ర నిర్మాతలుగా మారడం విశేషం.శ్యామ్ రూపొందించిన ‘భూమిక’ చిత్రంతో స్మితా పాటిల్ ఉత్తమ నటిగా తొలిసారి జాతీయ అవార్డ్ పొందారు.సుభాష్చంద్రబోస్ పై సినిమాశ్యామ్ బెనగల్ 2004లో భారత స్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ గురించి ‘నేతాజీ సుభాష్చంద్రబోస్.. ద ఫర్గాటెన్ హీరో’ పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు పొందింది. అలాగే బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత కథను కూడా సినిమాగా రూపొందించారు. ఇదే ఆయన చివరి చిత్రం.తీరని లోటు : సీఎం రెవంత్ రెడ్డిచలన చిత్రం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనెగల్ మరణం సినీ ప్రపంచానికి తీరనిలోటు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. భారతీయ వాస్తవిక సినిమా విశ్వరూపాన్ని ప్రదర్శించిన దర్శకుడు, మట్టి మనుషుల జీవితకథలను వెండితెరపై దృశ్యమానం చేసిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ అని తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మరణం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ బెనెగల్ సినిమాలు సామాజిక సమస్యలను, మానవ సంబంధాల లోతును, మట్టిమనుషుల జీవిత కథలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయని ఆయన ప్రశంసించారు. |
2,536,984 | అధికంగా టిక్కెట్లు అమ్ముడైన సినిమాలు | ఈ ఏడాదిలో విడుదలైన చాలా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. కల్కి 2898, పుష్ప–2, దేవర, భూల్ భులయ్య–3 వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. బుక్ మై షోలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప–2 రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 2024లో విడుదల రోజున అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్మిన చిత్రాలేమిటో చూద్దాం...! |
2,536,985 | సరికొత్త బాలకృష్ణను చూస్తారు | బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకూ మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. బాలకృష్ణ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. విజువల్గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. యాక్షన్ సన్నివేశాలు ఊహించిన దాని కంటే గొప్పగా ఉంటాయి. దాదాపు వందకు పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన బాలకృష్ణను ‘డాకూ మహారాజ్’ సరికొత్తగా చూపిస్తుంది’’ అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. గూస్బంప్స్ వచ్చాయి. కచ్చితంగా ప్రేక్షకులంతా గొప్ప సినిమాను చూసిన అనుభూతి పొందుతారు. భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అన్నీ అదిరిపోయే రేంజ్లో ఉన్న సినిమా ఇది. తమన్ నెక్స్ట్ లెవల్ సంగీతం ఇచ్చారు. 30 ఏళ్లుగా బాలకృష్ణను ఎవరూ చూపని విధంగా ఇందులో వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. నిర్మాతగా నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇప్పటికి అది కుదిరింది. జనవరి 2న హైదరాబాద్లో ట్రైలర్ విడుదల చేస్తాం. జనవరి 8న యూఎస్లో ప్రీ రిలీజ్ వేడుక చేసి ఓ సాంగ్ విడుదల చేస్తాం. అలాగే, జనవరి 8న ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. |
2,536,987 | సంక్రాంతి స్పెషల్ | వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ట్రయాంగులర్ క్రైమ్ కామెడీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాలో మూడో పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్లపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సంక్రాంతి స్పెషల్గా.. సినిమాకే హైలైట్గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ పాటకు భానుమాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఒక మాజీ పోలీసు.. మాజీ ప్రేయసి.. అద్భుతమైన భార్య మధ్య జరిగే అందమైన ప్రయాణంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న చిత్రం విడుదల కానుంది. కాగా, వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఇది వరకు వచ్చిన ‘ఎఫ్ 2’.. ‘ఎఫ్ 3’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. |
2,536,988 | యూత్ను ఆకట్టుకుంటుంది | ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్రింకర్ సాయు’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు లహరిధర్, బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత లహరిధర్ మీడియాతో ముచ్చటించారు.‘‘ఈ సినిమా కథను దర్శకుడు కిరణ్ చెప్పగానే చాలా నచ్చేసింది. నాన్న శ్రీనివాస్ ఈ సినిమా కథను చిరంజీవికి చెప్పి ఆయన అభిప్రాయం అడిగారు. ఆయన, ఓకే.. ప్రొసీడ్ అన్నారు. అలా చిరంజీవి ప్రోత్సాహంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. ధర్మ, ఐశ్వర్య అద్భుతంగా నటించారు. సినిమాలో వారు చేసిన ప్రదర్శన అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్, క్లైమాక్స్ ప్రధానాకర్షణ. యూత్ను విపరీతంగా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. |
2,536,989 | ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి | వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో లీగల్ థ్రిల్లర్లు తక్కువగా వస్తుంటాయి. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం’’ అని చెప్పారు. దర్శకుడు రవి మాట్లాడుతూ ‘‘ఇలాంటి సబ్జెక్ట్తో తెరకెక్కిన చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. |
2,536,682 | హోండా, నిస్సాన్ విలీనం | మేమూ మీతోనే:మిత్సుబిషి..చేయి కలిపిన జపాన్ ఆటో దిగ్గజాలుప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరణ టయోటా, ఫోక్స్వేగన్ పోటీని తట్టుకునేందుకే...భారత్లో అవకాశాలు అపారంపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, మౌలిక వసతుల అభివృద్ధితో వర్థమాన దేశాలైన భారత్, బ్రెజిల్ మార్కెట్లు ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయి. సుజుకీ భాగస్వామ్యంలోని మారుతి సుజుకీ ఇప్పటికే భారత్లో మార్కెట్ లీడర్గా ఉంది. అందుబాటు ధరల్లో చక్కని ఇంధన సామర్థ్యం గల కార్లకు జపాన్ పెట్టింది పేరు. ఈ కారణంగానే టయోటా, హోండా, నిస్సాన్ కూడా భారత మార్కెట్లో మంచి వాటా కలిగి ఉన్నాయి. హోండా సిటీ సెడాన్తో 1998లో, నిస్సాన్ మైక్రా హ్యాచ్బాక్తో 2010లో భారత మార్కెట్లో ప్రవేశించాయి. భారత మార్కెట్లో ప్రవేశించి ఇంతకాలం అయినా రెండు కంపెనీలు తక్కువ పరిమిత ఉత్పత్తులతోనే నెట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం హోండా నుంచి సిటీతో పాటు అమేజ్ కాంపాక్ట్ సెడాన్, ఎలివేట్ ఎస్యూవీ మార్కెట్లో ఉండగా నిస్సాన్ నుంచి మాగ్నైట్, ఎక్స్–ట్రయల్ మాత్రమే ఉన్నాయి. ఆటో డీలర్ల సంఘం (ఫాడా) గణాంకాల ప్రకారం నవంబరు నాటికి హోండా మార్కెట్ వాటా 1.39 శాతం ఉండగా నిస్సాన్ 0.73 శాతం ఉంది. ఈ విలీనంతో వారు మరిన్ని కొత్త కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా హోండా, నిస్సాన్ల విలీనం భారత ఆటో కంపెనీలకు సవాలు విసిరే ఆస్కారం సైతం ఉంది. ఆ సవాలును దీటుగా ఎదుర్కొనాలంటే భారత ఆటోమొబైల్ పరిశ్రమ కూడా సరికొత్త టెక్నాలజీలతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇన్నోవేషన్ల దిశగా అడుగేయవలసి రావచ్చు.టోక్యో: జపాన్కు చెందిన ఆటో దిగ్గజాలు హోండా, నిస్సాన్ చేతులు కలిపాయి. మార్కెట్లో పోటీని తట్టుకుని, కార్ల మార్కెట్లో తమ స్థానం పటిష్ఠం చేసుకునేందుకు రెండు కంపెనీలు విలీనం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఉభయ కంపెనీల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. నిస్సాన్తో ఇప్పటికే భాగస్వామ్యం ఉన్న మిత్సుబిషి కంపెనీ కూడా హోండా, నిస్సాన్లతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. మూడు కంపెనీలతో ఒక జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు హోండా సీఈఓ తోషిహిరో మైబ్, నిస్సాన్ సీఈఓ మకోటో ఉచిడా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే విలీన కంపెనీ అమ్మకాల్లో ప్రపంచంలోనే మూడో స్థాయిలో నిలుస్తుంది. మూడు కంపెనీల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే అది 5,500 కోట్ల డాలర్ల (రూ.4.68 లక్షల కోట్లు) విలువ గల కంపెనీగా మారుతుంది. వాస్తవానికి హోండా, నిస్సాన్ కంపెనీల మధ్య ఈ ఏడాది మార్చి నుంచి పరిమిత భాగస్వామ్యం ఉంది. కొత్తతరం వాహన ఇంటెలిజెన్స్, విద్యుదీకరణలో సహకరించుకునేందుకు ఒక భాగస్వామ్యంపై రెండు కంపెనీలు మార్చి 15న ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు అంగీకరిస్తూ ఆగస్టు ఒకటో తేదీన మరో ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇప్పుడు తమ వ్యాపారాలను కూడా సమీకృతం చేసి ప్రపంచంలోనే ఆటో రంగంలో మూడో దిగ్గజంగా మారేందుకు సమాయత్తం అవుతున్నాయి. మరోపక్క నిస్సాన్ కంపెనీకి కూడా ఫ్రాన్స్కు చెందిన రెనోతో భాగస్వామ్యం ఉంది. దీనివల్ల హోండా, నిస్సాన్, రెనో, మిత్సుబిషి నాలుగు కంపెనీ భాగస్వామ్యం జపాన్కు చెందిన ఆటో దిగ్గజం టయోటా, జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్వేగన్కు కూడా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందంటున్నారు. అయితే విలీనం తర్వాత కూడా టయోటానే మార్కెట్ నంబర్ వన్గా నిలుస్తుంది. 2023లో టయోటా 1.15 కోట్ల కార్లు తయారుచేసింది. కొత్తగా చేతులు కలిపిన మూడు కంపెనీలు ఉమ్మడిగా 80 లక్షల కార్లు (హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి 10 లక్షలు) మాత్రమే ఉత్పత్తి చేశాయి. విలీనం ఎవరికి లాభం? ప్రస్తుతం ప్రపంచం యావత్తు పెట్రో ఉత్పత్తులపై నడిచే కార్ల స్థానంలో పర్యావరణ అనుకూలమైన విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈవీల తయారీకి ప్రాధాన్యం ఇచ్చే దిశగా వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ విభాగంలో జపాన్ ఆటో కంపెనీలు ప్రత్యర్థుల కన్నా చాలా వెనుకబడి ఉన్నాయి. చైనాకు చెందిన బీవైడీ, జీపెంగ్, నియో, లీ ఆటో వంటి కంపెనీలు తక్కువ ధరలో హైబ్రిడ్, విద్యుత్ కార్లు అందించడం ద్వారా జపాన్ ఆటో దిగ్గజాల మార్కెట్కు పెను సవాలు విసురుతున్నాయి. ఈవీల ఉత్పత్తిలో హోండా, నిస్సాన్ చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు భారత మార్కెట్లో త్వరలో ఈవీలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నాయి. హోండా ఎలివేట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని, నిస్సాన్ అరియా ఎలక్ట్రిక్ ఎస్యూవీని వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశపెట్టనున్నాయి. ఈ రెండు ఈవీలు ప్రస్తుత భాగస్వామ్యంలో భాగంగా ఉంటాయా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ హోండా, నిస్సాన్ కంపెనీలు తమ వనరులు సమీకృతం చేసుకునేందుకు, పరిశోధన, అభివృద్ధి వ్యయాలను తగ్గించుకునేందుకు, కొత్త టెక్నాలజీ కార్ల తయారీపై దృష్టి కేంద్రీకరించేందుకు ఈ విలీనం దోహదపడుతుందని నిపుణులంటున్నారు. మరోపక్క ఈ భాగస్వామ్యం ద్వారా నిస్సాన్ నుంచి హోండాకు భారీ ఎస్యూవీలకు అవసరమైన బాడీ ఫ్రేమ్ కూడా అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు, బ్యాటరీ–విద్యుత్ వాహనాలు, గ్యాస్–విద్యుత్ హైబ్రిడ్ వాహనాల తయారీలో నిస్సాన్కు అనుభవం ఉంది. కొత్త తరం ఈవీలు, హైబ్రిడ్ వాహనాల తయారీలో ఈ అనుభవం ఉపయోగపడుతుంది. |
2,536,683 | వాడేసిన పిచ్లా? | ప్రాక్టీస్ వికెట్లపై భారత్ అసంతృప్తిఅశ్విన్ స్థానంలో తనుష్ ఎవరితను..?మెల్బోర్న్: నాలుగో టెస్ట్కు ముందు తమకు కల్పించిన ప్రాక్టీస్ పిచ్లపై భారత జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేసింది. ఈ వికెట్పై అనూహ్య బౌన్స్ అయ్యిందని, అందువల్ల సాధన సందర్భంగా కెప్టెన్ రోహిత్కు మోకాలి గాయం అయిందని పేర్కొంది. కానీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) క్యూరేటర్ మ్యాట్ పేజ్ మాత్రం నిబంధనల మేరకే ప్రాక్టీస్ పిచ్లను ఏర్పాటు చేశామని సమర్థించుకున్నాడు. ఆదివారం సాధన సందర్భంగా త్రోడౌన్ను ఎదుర్కొనే క్రమంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తాకిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత జట్టు సోమవారం ప్రాక్టీస్ చేయకూడదని నిర్ణయించుకుంది. నిబంధనలను అనుసరించి టెస్ట్ మ్యాచ్కు మూడు రోజుల ముందు మాత్రమే క్యూరేటర్ కొత్త ప్రాక్టీస్ పిచ్ను భారత్కు కేటాయించాల్సి ఉంది. భారత్–ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ఈనెల 26న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ‘టెస్ట్ మూడు రోజుల్లోకి వచ్చేసింది. దాంతో కొత్త పిచ్లను రూపొందించా. మూడు రోజులకంటే ముందే జట్టు ప్రాక్టీస్కు వస్తే..ఉపయోగించిన పిచ్లనే కేటాయిస్తాం’ అని పేజ్ వివరించాడు. ‘ఎంసీజీ’ పేసర్లకు అనుకూలం: పెర్త్, అడిలైడ్ వికెట్ల మాదిరి ఎంసీజీ పిచ్పై అంత బౌన్స్ ఉండదట. కానీ వికెట్పై ఆరు మి.మీ.మేర పచ్చిక ఉండడంతో పేసర్లకు అనుకూలించనుంది. స్పిన్నర్లకు సహకరించేలా పిచ్పై పగుళ్లు ఉండబోవని పేజ్ స్పష్టంజేశాడు. కొత్త బంతి మెరుపు తగ్గాక బ్యాటర్లకు సహకరిస్తుందని తెలిపాడు. |
2,536,684 | భాకర్కు చోటు లేదా? | ఖేల్రత్న అవార్డు నామినేషన్లపై వివాదం న్యూఢిల్లీ: దేశ క్రీడా రంగ ప్రతిష్ఠాత్మక అవార్డు ధ్యాన్చంద్ ఖేల్రత్న విజేతలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ పురస్కారానికి సిఫారసు చేసిన జాబితాలో పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన స్టార్ షూటర్ మనూ భాకర్ పేరు లేకపోవడం సంచలనం రేపుతోంది. ఈసారి ఖేల్రత్న అవార్డుకు హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, పారిస్ పారా ఒలింపిక్స్ హైజంప్లో స్వర్ణం నెగ్గిన ప్రవీణ్ కుమార్ తదితరుల పేర్లను సిఫారసు చేశారు. కానీ భాకర్ పేరు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే మనూభాకర్ స్వంతంగాకానీ, భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) కానీ ఈ పురస్కారానికి దరఖాస్తు చేయలేదని క్రీడాశాఖ స్పష్టంజేసింది. మరోవైపు ఖేల్రత్న అవార్డుకు దరఖాస్తు చేయాల్సిన బాధ్యత భాకర్దేనని ఎన్ఆర్ఏఐ చీఫ్ నారాయన్ సింగ్ దేవ్ తెలిపారు. ఆమె దరఖాస్తు చేయకపోవడంతో..భాకర్ పేరును జాబితాలో చేర్చాలని క్రీడాశాఖను కోరినట్టు కూడా దేవ్ చెప్పారు. మనూ భాకర్ తండ్రి రామ్కిషన్ భాకర్ మాత్రం తాము దరఖాస్తు చేశామని చెబుతుండడం గమనార్హం. కాగా..దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీకి దరఖాస్తు చేయాలనుకుంటున్నందున, షూటర్ కుటుంబం ఖేల్రత్న దరఖాస్తును పట్టించుకోలేదనే వాదనా వినిపిస్తోంది. మరోవైపు, ఽఖేల్రత్న అవార్డీల పేర్లు ఖరారు కాలేదని, తన వద్దకు వచ్చిన జాబితాలో మనూభాకర్ పేరును మంత్రి మాండవీయ చేరుస్తారని క్రీడాశాఖ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ క్రీడా అవార్డులకు అథ్లెట్లను ఎంపిక చేయనుంది. |
2,536,685 | ఆఖరి వన్డేలోనూ పాక్దే గెలుపు | జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ 3–0తో దక్కించు కుంది. దీంతో సఫారీ గడ్డపై ఆ జట్టును ఓ వన్డే సిరీస్లో అన్ని మ్యాచుల్లోనూ ఓడించిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఆఖరి వన్డేలో పాక్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 36 పరుగుల తేడాతో నెగ్గింది. వర్షం కారణంగా మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించగా.. ముందుగా పాక్ 9 వికెట్లకు 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సయీమ్ అయూబ్ (101) తొలి శతకంతో పాటు కెప్టెన్ రిజ్వాన్ (53), బాబర్ (52) రాణించారు. రబాడకు మూడు.. ఫర్టూన్, జాన్సెన్లకు రెండేసి వికెట్లు లభించాయి. ఆ తర్వాత సౌతాఫ్రికా 42 ఓవర్లలో 271 రన్స్కు ఆలౌటైంది. క్లాసెన్ (81) ఆదుకునే ప్రయత్నం చేయగా, బోష్ (40), వాన్డర్ డుస్సెన్ (35) ఫర్వాలేదనిపించారు. ముఖీమ్కు నాలుగు.. నసీమ్, షహీన్ రెండేసి వికెట్లు తీశారు. |
2,536,686 | సిరీస్పైనే గురి | జోష్లో హర్మన్ సేననేడు విండీస్తో రెండో వన్డేవడోదర: అన్ని విభాగాల్లో రాణిస్తోన్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండో సిరీస్పై దృష్టి సారించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 211 పరుగుల భారీ తేడాతో నెగ్గిన హర్మన్ప్రీత్ బృందం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరుజట్ల మధ్య కీలక రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందులో నెగ్గితే భారత్కు సిరీస్ దక్కుతుంది. ఇప్పటికే 3 టీ20ల సిరీస్ను భారత్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది స్వదేశంలోనే వరల్డ్కప్ ఉండడంతో ప్రతీ మ్యాచ్ భారత్కు సన్నాహకంగా మారనుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకతో పాటు బ్యాటింగ్ విభాగం సత్తా చాటుతోంది. ప్రత్యర్థి బ్యాటర్లను కుదురుకోనీయకుండా పేసర్ రేణుకా సింగ్తో కూడిన భారత బౌలింగ్ దళం చెలరేగుతోంది. ఇక ఆరంభ వన్డేలో చెత్త ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్న విండీస్కు ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్పై ఆశలుంటాయి. |
2,536,666 | ఐదు రోజుల నష్టాలకు తెర | ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల ఐదు రోజుల పతనానికి బ్రేక్ పడింది. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపరులు పెద్దఎత్తున కొనుగోళ్లకు దిగటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించటంతో సోమవారం బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. బ్లూచిప్ షేర్లయిన ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడటం మార్కెట్లకు కలిసి వచ్చిందని ట్రేడర్లు తెలిపారు. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 876.53 పాయిట్లు దూసుకుపోయి 78,918.12 పాయింట్ల స్థాయిని తాకింది. చివరకు498.58 పాయింట్ల లాభంతో 78,540.17 పాయింట్ల వద్ద క్లోజైంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు మంచి రికవరీ సాధించటం మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్ను నింపిందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రోజున 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో మార్కెట్లలో ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెల్లడించాయి. సెన్సెక్స్ 499 పాయింట్లు అప్ |
2,536,667 | ఆసుపత్రిలో వినోద్ కాంబ్లీ | థానె: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్సకు కాంబ్లీ సహకరిస్తున్నాడనీ.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మూత్రంలో ఇన్ఫెక్షన్ సమస్యతో థానెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన కాంబ్లీకి, పలు పరీక్షల అనంతరం మెదడులో సమస్యను గుర్తించినట్టు అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్ త్రివేది పేర్కొన్నాడు. మరోవైపు కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స అందిస్తామని ఆస్పత్రి ఇన్చార్జి ఎస్ సింగ్ తెలిపినట్టు త్రివేది చెప్పాడు. సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడైన 52 ఏళ్ల కాంబ్లీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. |
2,536,668 | 390.. ఊదేశారు | రాజ్కోట్: మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా బెంగాల్ రికార్డు సృష్టించింది. తనుశ్రీ సర్కార్ (113), ప్రియాంక బాల (88 నాటౌట్) అదరగొట్టడంతో.. సీనియర్ మహిళల వన్డే టోర్నీలో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నిర్దేశించిన 390 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 2019లో న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో కాంటర్బరీతో మ్యాచ్లో నార్త్రన్ డిస్ట్రిక్స్ టీమ్ 309 పరుగుల లక్ష్య ఛేదన రికార్డును బెంగాల్ బద్దలుకొట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో శ్రీలంక 305 పరుగుల లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో 389/5 స్కోరు చేసింది. భారత జట్టులో చోటు కోల్పోయిన షఫాలీ వర్మ (197) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకొంది. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన బెంగాల్ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి గెలిచింది. |
2,536,670 | తగ్గిన నాన్–లైఫ్ క్లెయిమ్లు | 2023–24లో రూ.1.72 లక్షల కోట్లుగా నమోదున్యూఢిల్లీ: నాన్–లైఫ్ బీమా రంగంలో క్లెయిమ్స్ తగ్గుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి చెందిన బీమా కంపెనీలు రూ.2.9 లక్షల కోట్ల మొత్తానికి అండర్రైట్ చేస్తే.. రూ.1.72 లక్షల కోట్ల మొత్తాన్ని పాలసీదారులు క్లెయిమ్ చేసుకున్నారు. ఇది మొత్తం అండర్ రైటింగ్లో 82.52 శాతానికి సమానం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 82.95 శాతంతో పోలిస్తే ఇది 0.43 శాతం తక్కువ. నికర క్లెయిమ్ల పరంగా చూస్తే మాత్రం క్లెయిమ్ల మొత్తం 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరినట్టు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) 2023–24 ఆర్థిక సంవత్సర నివేదికలో వెల్లడించింది. |
2,536,671 | ధనుష్కు రజతం | హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో పతకం కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. బధిర పోటీల్లో కాకుండా ఓపెన్ పోటీల్లో అతడు పోటీ పడి పతకం సాధించడం విశేషం. సోమవారం భోపాల్లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో హైదరాబాద్కు చెందిన ధనుష్ 252.1 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి రజతం దక్కించు కున్నాడు. 0.1 పాయింట్ తేడాతో ధనుష్ స్వర్ణం చేజార్చుకున్నాడు. షాహు తుషార్ మనె (రైల్వేస్– 252.2) పసిడి సాధించగా, యశవర్దన్ (రాజస్థాన్) కాంస్యం గెలిచాడు. |
2,536,696 | విచారణకు రండి | (మొదటిపేజీ తరువాయి)పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం.. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పతిక్రా సమావేశం నిర్వహించి, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విషయం విదితమే. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటిదాకా తెలియదని.. ఆరోజు రాత్రి థియేటర్లో పోలీసులు తనవద్దకు రాలేదని బన్నీ చెప్పగా.. థియేటర్ నుంచి ఆరోజు రాత్రి ఆయన్ను తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. అల్లు అర్జున్ను పోలీసులు విచారణకు పిలవడం గమనార్హం. జరిగిన దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం వరకూ తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో.. ఆయన్ను ఎంతసేపు విచారిస్తారు? ఏయేప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ కేసు విషయమై పోలీసులు అల్లు అర్జున్ను మంగళవారం ఒక్కరోజే కాక.. రోజూ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. సినీ వర్గాల సమావేశం..సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిలిం చాంబర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. టికెట్ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సినిమాకు అనుకున్న బడ్జెట్కు మించి ఖర్చు అయినప్పుడు మాత్రమే టికెట్ రేట్లు పెంచాలని అడుగుతాం తప్ప.. ప్రతి సినిమాకూ అడగం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. దీనిపై సీఎంను కలిసే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆయన ఇక్కడికి వచ్చాక ముందు ఆయనతో సమావేశమై తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని నాగవంశీవెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు తరలిపోదని ఆయన పేర్కొన్నారు. కాగా.. టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి ప్రకటించారు. ‘‘సినిమా టికెట్ ధరలను పెంచడం వల్ల ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పెరిగిన టికెట్ రేట్లతో మధ్య తరగతి ప్రేక్షకులు, విద్యార్థులు సినిమాలకు రాలేకపోతున్నారు. ఇది కలెక్షన్లపైనా ప్రభావం చూపుతోంది. టిక్కెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లే ఏపీ ప్రభుత్వమూ బెనిఫిట్ షోస్, టికెట్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ ఎస్.రామ్ ప్రసాద్ అన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి పరిణామం. సినిమాను ఎక్కువ థియేటర్స్లో విడుదల చేయడం ఎలా అనే దానిపై నిర్మాతలు దృష్టి పెట్టాలి’’ అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్ సూచించారు. టీఎఫ్పీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా.. టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న చిత్రాలపై భారం పడుతోంది. ఏడాదికి రిలీజయ్యే చిత్రాల్లో చిన్న చిత్రాలే 90 శాతం ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే పెద్ద చిత్రాలు ఉంటున్నాయి. చిన్న చిత్రాలకు డిజిటల్ రైట్స్ విషయంలో యూఎఫ్వో క్యూబ్ ధరలు అధికంగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలో రూ.1500 ఉంటే మన దగ్గర పది వేలు వారానికి వసూలు చేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ‘పుష్ప–2’ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి పరామర్శించారు. అతడి తండ్రికి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇక ఈ విషయాన్ని రాజకీయం చెయ్యొద్దు. సినీ హీరోల ఇళ్లపై దాడులు చెయ్యొద్దు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదని.. వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని ఆయన ఖండించారు. దాడులు చేస్తే చట్టం ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. కాగా.. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతడు క్రమంగా కోలుకుంటున్నాడని, జ్వరం తగ్గుముఖం పడుతోందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు. కాగా.. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటి రెడ్డి స్పందించిన తీరు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్య, వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన ఆయన.. రేవతి కుటుంబాన్ని, శ్రీతేజ్ను ఆదుకోవడానికి ఆర్య, వైశ్య మహాసభ ముందుంటుందని తెలిపారు. కాగా.. శ్రీతేజ్కు చికిత్స తామే చేయిస్తున్నామంటూ అల్లు అర్జున్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోందని తెలంగాణ ఆర్య, వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చామని చెబుతున్న అల్లు అర్జున్ ఇప్పటికి ఇచ్చింది రూ.10 లక్షలేనన్నారు. |
2,536,697 | పోలీసు బట్టలూడదీసిన స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డా? | ● ‘పుష్ప’పై మంత్రి ధనసరి సీతక్క వ్యాఖ్యలు● సినీ తారలది రాతి హృదయం ● కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిహైదరాబాద్/పీర్జాదిగూడ/ములుగు కలెక్టరేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు. ములుగులో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాజ్యంగ స్ఫూర్తితో తాను ఈ స్థాయికి ఎదగగలిగానని ఆమె చెప్పారు. ఉద్యమం నుంచి న్యాయ శాస్త్రాన్ని చదవడంతోపాటు ఇప్పుడు రాష్ట్రమంత్రిగా నిలబడ్డానన్నారు. అలాంటి అంబేడ్కర్ స్ఫూర్తితో ఓ న్యాయవాది చంకలో బిడ్డ, కడుపులో మరో బిడ్డతో అన్యాయానికి గురైన మహిళ కోసం పోరాడిన కథతో వచ్చిన సందేశాత్మక చిత్రం జైభీమ్కు అవార్డులు రాలేదు కానీ, పోలీసు వ్యవస్థను, రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఓ స్మగ్లర్ కథతో వచ్చిన పుష్ప సినిమాకు జాతీయ పురస్కారం వచ్చిందని అన్నారు. పుష్ప సినిమా నేర ప్రవృత్తిని ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించేలా ఉండాలని, మంచి సందేశంతో సినిమాలు నిర్మించాలని ఆమె సూచించారు.మీకంటే సోనూ సూద్, సమంత మంచు లక్ష్మి నయం: యెన్నంఅల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సినీ పరిశ్రమపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేల జీతం సంపాదించే అభిమాని రూ.3 వేలతో టికెట్ కొని సినీతారల స్టార్డం కాపాడుతున్నారని.. సూపర్ స్టార్లుగా పేర్కొనే నటులు వందల కోట్లు సంపాదిస్తున్నా.. సేవా కార్యక్రమాలకు రూపాయి కూడా ఖర్చు చేయరని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. మన సూపర్ స్టార్లు ఏ గ్రామాన్నైనా, ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రినైనా దత్తత తీసుకున్నారా? మంచి కార్యక్రమం చేయమని ఏనాడైనా అభిమానులకు పిలుపునిచ్చారా? అని ప్రశ్నించారు. బ్లడ్ బ్యాంక్ పేరుతో చిరంజీవి ఎంతోమందికి సేవ చేస్తూ అభిమానులతోనూ చేయిస్తుండగా.. ఆయన వారసులుగా చెప్పుకొనే కొంతమంది ఏనాడైనా పైసా సహాయం చేశారా? అని నిలదీశారు. సీఎం మాట్లాడిన మాటలు అబద్ధాలని అల్లు అర్జున్ భావిస్తున్నారా? అసెంబ్లీని అగౌరవపరుస్తున్నారా? అని మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ నాలుగు కుటుంబాల చేతిలో నలిగిపోతోందని, తెలంగాణ వాళ్ల విషయంలో సినిమా ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసని అన్నారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా సినీ నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ నటిస్తున్నారని, పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే తనకేం వస్తుందని ఒక నటుడు అన్నాడని చెప్పారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వస్తారన్న నమ్మకం లేదని.. వీరి కంటే సోనూ సూద్, సమంత, మంచు లక్ష్మి నయం అని వ్యాఖ్యానించారు. వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారని.. అర్ధరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో నటులు ఉంటారని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే ఒక్కరు కూడా స్పందించరన్నారు. తమిళ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు లేదన్నారు. సినీ నటులు ఏనాడైనా ఉద్యమంలో పా ల్గొన్నారా? అని శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు.వివాదాన్ని కొనసాగించే ఆలోచన కాంగ్రెస్కు లేదు: చామల అల్లు అర్జున్కు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి వైరం లేదని, ఈ వివాదాన్ని కొనసాగించే ఆలోచన కాంగ్రెస్కు లేదని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పారన్నారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. సినీ నిర్మాతలు నష్టపోవద్దని, పరిశ్రమ బాగుండాలనే దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్లో చిత్రపరిశ్రమ అభివృద్ధి జరిగిందీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని తెలిపారు.బెయిలుపై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్మీట్ ఎలా పెట్టాడు?: వీహెచ్ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ కోలుకోవాలని మృత్యుంజయ యాగం చేయాలంటూ అల్లు అర్జున్కు కాంగ్రెస్ నేత వీహెచ్ సూచించారు. పుష్ప2 సినిమాకు వచ్చిన డబ్బులను యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలన్నారు. బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రెస్మీట్ ఎలా పెట్టాడని ప్రశ్నించారు. ఈ అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలే: రోహిన్రెడ్డి అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలేనని హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి అన్నారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. థియేటర్ నుంచి వెళ్లిపొ మ్మని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ అక్కడ్నుంచి వెళ్లేందుకు ససేమిరా అన్నారని చెప్పారు.పుష్ప2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదుపుష్ప2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. థియేటర్కు వెళ్లి సినిమా చూశానని.. కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని మల్లన్న చెప్పారు. గంధపు చెక్కల స్మగ్లర్ పెద్ద హీరోలా వచ్చి పోలీస్ అధికారి కారును ఢీకొట్టడం తదితర సన్నివేశాలు పోలీసులను అవమానించేలా ఉన్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. 300 కోట్లలో 3 కోట్లు ఇవ్వడానికి మనసు రావట్లేదా?: చనగాని పుష్ప2 సినిమాకు రూ.300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్కు అందులో నుంచి బాధిత కుటుంబానికి రూ.3 కోట్లు ఇవ్వడానికి మనసు రావట్లేదా అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్గౌడ్ ప్రశ్నించారు. ఆయన నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం చల్లాచెదురైందన్నారు. బీజేపీ నేతలకు అల్లు అర్జున్పై ఉన్న ప్రేమ.. చనిపోయిన రేవతి కుటుంబంపై లేదని చెప్పారు. |
2,536,698 | శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు | కానీ నన్ను గుర్తుపట్టే స్థితిలో లేడు● నా కూతురు అమ్మ ఎక్కడా అని అడిగితే... ఊరెళ్లిందని చెబుతున్నా● సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు● అల్లు అర్జున్ టీం 10 లక్షలు చెల్లించింది● నెల ముందు నుంచేసినిమా చూడాలని ప్లాన్● అర్జున్పై కేసు వాపసు తీసుకునేందుకు సిద్ధం: శ్రీ తేజ తండ్రి భాస్కర్ హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు శ్రీ తేజ కళ్లు తెరుస్తున్నాడు.. మూస్తున్నాడు కానీ తనను గుర్తు పట్టే స్థితిలో లేడని తండ్రి భాస్కర్ తెలిపారు. ఆసుపత్రిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ తేజ కోలుకునేందుకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. తన కూతురు అమ్మ ఎక్కడా అని అడిగితే ఊరెళ్లిందని చెబుతున్నానని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం తమకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల చెక్కు అందచేశారని తెలిపారు. అల్లు అర్జున్ టీం రూ.10 లక్షల డీడీ ఇచ్చిందని, మరో రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు నుంచి ఆ బృందం సభ్యులు వైద్యులతో ప్రతిరోజూ మాట్లాడున్నారని చెప్పారు. తాను మొదటి రోజు ఆసుపత్రిలో రూ. 50 వేలు చెల్లించానని, ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్ బృందం సభ్యులే అన్నీ చూసుకుంటున్నారని తెలిపారు. శ్రీ తేజకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, నెలరోజుల ముందు నుంచే ప్రీమియర్ షో చూసేందుకు కుటుంబమంతా ప్లాన్ చేసుకున్నామని వెల్లడించారు. మూడు రోజుల ముందు స్నేహితుల సహకారంతో సినిమా టికెట్లు తీసుకొని సినిమా చూసేందుకు వెళ్లినట్లు తెలిపారు. అనుకోకుండా థియేటర్లో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా తమ కుటుంబం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్పై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శ్రీతేజ తండ్రి భాస్కర్ తెలిపారు. |
2,536,699 | గాంధీభవన్కు అల్లు అర్జున్ మామ! | దీపాదాస్ మున్షీని కలిసిన కంచర్ల చంద్రశేఖర్రెడ్డి హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సినీ హీరో అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి సోమవారం గాంధీభవన్లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాద, ప్రతివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో.. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి మున్షీని కలవడం ఆసక్తికరంగా మారింది! అయితే.. దీపాదాస్ మున్షీకి ఆయన పరిచయం లేకపోవడంతో అతి కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ నేతలను కలిసేందుకు వచ్చానంటూ ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రశేఖర్రెడ్డి దీపాదాస్ మున్షీని కలిసినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా సమావేశంలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్రెడ్డి వచ్చి వెళ్లి పోయారని తెలుసుకున్న ఆయన.. ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయన వచ్చినప్పుడు మీడియా సమావేశంలో ఉన్నానని, దీంతో ఆయన దీపాదాస్ మున్షీని కలిశారని చెప్పారు. ఆమెతో చంద్రశేఖర్రెడ్డికి పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లి పోయారని వెల్లడించారు. చంద్రశేఖర్కు తాను ఫోన్ చేశానని, ఒకటి, రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడదామని చెప్పానని అన్నారు. |
2,536,688 | ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఉరికొయ్యలే | ● సింగరేణి ప్రైవేటీకరణ యత్నాన్ని వ్యతిరేకిస్తాం: కేటీఆర్ హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘అప్పుల తిప్పలుతో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆక్రందనలు వారికి పట్టడంలేదు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నకు ఉరికొయ్యలు, చెరసాలలే దిక్కయ్యాయి’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ కాదు.. రైతుభరోసా రాదని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. అధికారంకోసం అడ్డగోలు హామీలిచ్చి.. ఆ తర్వాత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాలుకు రూ.500 బోనస్ దేవుడెరుగు.. మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనే దిక్కులేకుండా పోయిందన్నారు. తెలంగాణలోని ఏరైతూ ధైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ కుట్రలపై కలిసికట్టుగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు దేశంలో విద్యుత్తు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ మూలస్తంభంగా నిలిచిందన్నారు. ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు ఎక్స్ వేదికగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులపాలిట కల్పవల్లిగా ఉన్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే.. బీఆర్ఎస్ తరఫున వ్యతిరేకిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ తెలంగాణలో పుట్టడం గర్వకారణంఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో పీవీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడ్డుకాలంలోప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడి ఆధునిక భారతానికి బాటలు వేశారని కొనియాడారు. |
2,536,687 | నేడు కాంగ్రెస్ అంబేడ్కర్ సమ్మాన్ సప్తాహ్ | ● అమిత్షాను క్యాబినెట్ నుంచి తొలగించాలనికోరుతూ జిల్లా కలెక్టర్లకు వినతులు● హైదరాబాద్ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్న భట్టి, మహేశ్ గౌడ్..హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్.. అంబేడ్కర్ సమ్మాన్ సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ వెల్లడించారు. మంగళవారం ప్రతి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. ఆయా జిల్లాల కలెక్టర్లను కలవాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్షాను బర్తరఫ్ చేయాలంటూ వినతిపత్రం ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్లతో కలిసి ఆమె మాట్లాడారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించినప్పుడల్లా దాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ నేతలు ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకువస్తారన్నారు. మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. అమిత్షా వ్యాఖ్యలతో అంబేడ్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందని చెప్పారు. రాహుల్గాంధీ క్యారెక్టర్ను దెబ్బతీసేందుకే ఆయనపై హత్యాయత్నం కేసును నమోదు చేసిందని మండిపడ్డారు. కాగా, అంబేడ్కర్ సమ్మాన్ సప్తాహ్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ కలెక్టర్కు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ వినతిపత్రం అందజేయనున్నారు. ముందుగా వారు ట్యాంక్బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి.. లక్డీకాపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. ఇందులో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ నేతలు పాల్గొననున్నారు. |
2,536,689 | అల్లు అర్జున్పై కక్షసాధింపు: కిషన్ రెడ్డి | ● తెలంగాణ సీఎం నిర్ణయాన్ని సమర్థిస్తున్నా: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు● బన్నీ ఇంటిపై దాడి ఘటనలో నలుగురు కొడంగల్వాసులు: డీకే అరుణహైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందని ఆరోపించారు. కాగా.. బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే (విశాఖ ఉత్తర) విష్ణుకుమార్ రాజు అన్నారు. గతంలో ప్రజలకు ఉపయోగపడే పనులకు అవసరమైన నిధుల సేకరణ కోసమే బెనిఫిట్ షోలకు అనుమతించేవారని, ఇప్పుడు నిర్మాతల లాభాల కోసం, రేట్లు పెంచి ఇస్తున్నారని.. అది తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడికి పాల్పడినవారిలో నలుగురు కొడంగల్వాసులు ఉన్నారని.. వారిలో ఒకరు కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారని తెలిపారు. ఆ పార్టీ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని ఆమె ధ్వజమెత్తారు. |
2,536,690 | ప్రజా సమస్యల కంటే అల్లు అర్జున్ విషయం ముఖ్యమా?:హరీశ్ | మెదక్ అర్బన్/వరంగల్ మెడికల్/హనుమకొండ టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్ విషయం ముఖ్యమా? అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సోమవారం వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో 24 అంతస్థులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మెదక్ జిల్లా కేంద్రంలోని చర్చిని ఆయన సందర్శించారు. హనుమకొండలో, మెదక్ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో మాట్లాడి.. వారి ఆందోళనకు మద్దతు పలికారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ.. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్లో నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. సినీ హీరో అల్లు అర్జున్ గురించి అసెంబ్లీలో బాగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. స్వగ్రామంలోని తన తమ్ముడు తిరుపతిరెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. |
2,536,693 | రేవంత్ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత | హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు. ప్రజాప్రయోజన కార్యక్రమాలు అసలే లేవు’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని, దీంతో తమపార్టీ ప్రత్యేకంగా లీగల్సెల్ ఏర్పాటు చేసుకొని న్యాయపోరాటం సాగించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా.. దాన్ని నడుపుతున్నది బీజేపీ వాళ్లని ఆరోపించారు. ప్రతీకార పాలనకు తెరలేపిన సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతనే కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. తదనంతరం ఏసీబీ కేసు నమోదు, మరుసటి రోజే ఈడీ కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలతోనే కేటీఆర్పై కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ రెండు పార్టీల ప్రయత్నం ఇక్కడ సాధ్యంకాదని చెప్పారు. సీఎం తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెడుతున్నారని, దీనిపై కమ్యూనిస్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. |
2,536,692 | 10లోగా బీజేపీ మండల కమిటీలు | ● పార్టీ నేతలకు రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ పిలుపుహైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని అన్నారు. ఈ నెల 28లోగా క్రియాశీల సభ్యత్వం, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బన్సల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్రెడ్డి జిల్లాపార్టీ అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ పరిశీలకులు, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జులతో సోమవారం సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బన్సల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వం, 30 వేల క్రియాశీల సభ్యత్వం జరిగిందన్నారు. మండల, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్టీ నిబంధనావళి ప్రకారం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల నియామకం కూడా పూర్తయ్యిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీలతో పాటు జాతీయ పార్టీకి ప్రత్యేకంగా అందిన నివేదికలను బన్సల్, కిషన్రెడ్డి సమీక్షించారు. . |
2,536,713 | సంయుక్త సర్వే! | ● ఆంధ్రప్రదేశ్ నిర్ణయం.. నలుగురు అధికారులకు బాధ్యతలు● సర్వేతో పాక్షిక ప్రయోజనమేనంటున్న తెలంగాణ● బచావత్ ట్రైబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా పోలవరండిజైన్ అని ఆరోపణహైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) దాకా నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి (డీమార్కేషన్కు)గాను సర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది. ఇందుకోసం నలుగురు అధికారులకు బాధ్యతలు కట్టబెడుతూ ఆ సమాచారం తెలంగాణకు ఇచ్చింది. తెలంగాణ కూడా సమ్మతి తెలిపి, తగిన తేదీలు ప్రకటిస్తే వెనువెంటనే సర్వే, డీమార్కేషన్ ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంటే.. తెలంగాణలోని కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీరు గోదావరిలోకి సాఫీగా ప్రవహించదు. గోదావరిలో కలిసేందుకు వీల్లేకపోతే ఈ వరద.. పంట పొలాలను ముంచెత్తుతుంది. దీంతో ఈ ముంపు ఏ మేరకు ఉంటుందో సర్వే చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కూడా 2022 సెప్టెంబరు 6న ఇదే తీర్పు వెలువరించింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగి.. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ పలు సమావేశాలు నిర్వహించి, ముంపు ప్రాంతాలను గుర్తించాల్సిందేనని ఆదేశాలిచ్చింది. మరోవైపు 2022లో భారీ వరదలతో ఈ సమస్య మరింత తీవ్రమయింది. వాస్తవానికి 2021 ఏప్రిల్ 17 నుంచి 29 దాకా జాయింట్ సర్వే జరిగినప్పటికీ క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయలేదు. దాంతో తాజా నిర్ణయంతో మరోమారు సర్వేతోపాటు డీమారే ్కషన్ ప్రక్రియ ముందుకు కదలనుంది.పాక్షిక ప్రయోజనమే...సంయుక్త సర్వే, డీమార్కేషన్తో పాక్షిక ప్రయోజనమే కలగనుంది. ముంపు ప్రభావం తీవ్రంగానే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. 1986లో 27 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. భద్రాచలం వద్ద 76.5 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని, తిరిగి 2022 ఆగస్టులో 24.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా 71 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని గుర్తు చేసింది. 1986 వరద కన్నా 2022లో వచ్చిన వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు తీవ్రత అధికంగా ఉందని, ఏకంగా 106 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16 వేల ఇళ్లు నీటమునిగాయని తెలిపింది. తెలంగాణ అభ్యంతరాలు ఇవీ..● గోదావరి ఉపనదుల ప్రవాహాన్ని కూడా పోలవరం బ్యాక్వాటర్ అడ్డుకోనుంది. భద్రాచలం వద్ద గోదావరికి కుడి, ఎడమ వైపున ప్రవ హించే కిన్నెరసాని, ముర్రేడువాగు, పెద్దవాగు, ఎద్దులవాగు, పాములేరువాగు, తుర్బాగవాగులు గోదావరిలో కలవకుండా ఆ ప్రవాహం వెనక్కితన్నితే వందలాది ఎకరాల మేర భూములు నీట మునుగుతాయి. 60 గ్రామాలపై ఆ ప్రభావం ఉంటుంది. ● పోలవరం ప్రాజెక్టును.. 36 లక్షల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేసే సామర్థ్యంతో 140 అడుగుల ఎత్తులో కట్టేలా బచావత్ ట్రైబ్యునల్ అనుమతినిచ్చింది. కానీ, నిర్మాణంలో మాత్రం స్పిల్వే సామర్థ్యాన్ని 36 లక్షల నుంచి 50 లక్షలకు పెంచారు. అదీ 140 అడుగుల ఎత్తులో నుంచే 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా డిజైన్ చేశారు. ● 1988లో ఏపీఈఆర్ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వాటర్ రీసెర్చ్ లేబొరేటరీ) నివేదికలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని ఉండగా, 2009లో సీకో నివేదికలో 40 లక్షల క్యూసెక్కుల దాకా వరద రావచ్చని ఉంది. అదే 2021లో సీడబ్ల్యూసీ మాత్రం 28 లక్షల నుంచి 36 లక్షల క్యూసెక్కుల దాకా వరద రావచ్చని నివేదిక ఇచ్చింది. 2019లో ఐఐటీ రూర్కీ నివేదిక 58 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చునని పేర్కొంది. ఆయా సంస్థల నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నందున ముంపుపై స్వతంత్ర అధ్యయనం అవసరం. ● 1990కి ముందున్న నదీ స్వభావం ఆధారంగా ఉన్న పరిస్థితులతో అధ్యయనాలు జరిగాయి. కాలానుగుణంగా నదీ గర్భంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వీటినీ పరిగణనలోకి తీసుకొని తాజాగా వరదపై అధ్యయనం జరగాలి. పోలవరం రిజర్వాయర్లో నీటి నిల్వ ఉన్న సమయంలో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. పోలవరం ప్రాజెక్టు నుంచి వెనుకకు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం దాకా ముంపు ప్రభావం ఉంటుంది. |
2,536,714 | దేశ నిర్మాణంలో పీవీ పాత్ర కీలకం | ● కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే● దేశాన్ని సంక్షోభం నుంచి ప్రగతి వైపు మళ్లించిన తెలంగాణ ముద్దుబిడ్డ: సీఎం ● పీవీ తెలంగాణలో పుట్టడం అదృష్టం: భట్టి● పీవీ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమిలో మంత్రులు, వివిధ పార్టీల నేతల నివాళులున్యూఢిల్లీ/హైదరాబాద్/రాంగోపాల్పేట్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది కీలక పాత్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని గుర్తు చేశారు. పీవీ సాహసోపేతమైన ఆర్థిక సరళీకరణ విధానం మధ్య తరగతి వృద్ధి, సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఆయన పాలనలో మధ్య తరగతి రూపురేఖలను మార్చేశారని పేర్కొన్నారు. సోమవారం పీవీ వర్ధంతి సందర్భంగా పార్టీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళుర్పించాయి. ఆయన సేవలను గుర్తు చేసుకున్నాయి. ‘సంక్షోభం నుండి సమున్నత శిఖరాలకు.. భారత ప్రస్థానానికి బాటలు వేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. పీవీ నరసింహారావుకు ఘన నివాళి’ అని సీఎం ఎక్స్లో పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇటు నెక్లెస్ రోడ్డు పీవీ మార్గ్లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రులు, కాంగ్రెస్, వివిధ పార్టీల నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం అందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన అనేక సంస్కరణలు ఇప్పటికీ రాష్ట్ర పాలనలో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకువెళ్లారని చెప్పారు. పీవీ అందరివాడని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ.. ఒక మారుమూల గ్రామంలో జన్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ఘనుడని కొనియాడారు. దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన వ్యక్తి పీవీ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఎకరా, రెండెకరాలున్న పేదలు కూడా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే అది పీవీ చలవేనని.. ఆయన తెచ్చిన భూసంస్కరణల వల్లే అది సాధ్యమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఆనాడు కేంద్ర మానవ వనరుల మంత్రిగా పీవీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే విద్యావ్యవస్థ ప్రణాళికాబద్ధంగా నడుస్తోందని చెప్పారు.పీవీవి విశేష సేవలు: కిషన్రెడ్డిపీవీ దేశానికి విశేష సేవలు అందించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనేక రకాల ఆర్థిక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయనకు ఘన నివాళులన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీవీకి దేశంలోనే అతి పెద్ద పురస్కారం ప్రకటించి.. ఆయన చరిత్రను ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. పీవీకి నివాళులర్పించిన వారిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బండా ప్రకాశ్, పీవీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఉన్నారు. |
2,536,715 | 10 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకున్నాం | ● రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్● అభ్యర్థులకు నియామక పత్రాల అందజేతబిట్స్పిలానీ, చార్మినార్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశంలోని 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. సోమవారం రోజ్గార్ మేళా (ఉద్యోగ ఉపాధి) 14వ ఎడిషన్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని మాట్లాడారు. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ గ్రూప్సెంటర్లో ఏర్పాటు చేసిన ఉద్యోగ నియమక పత్రాల అందజేత కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగం, కుటుంబంతో పాటు దేశ సేవలో యువత నీతి నీజాయితితో విధులు నిర్వహించాలన్నారు. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. మోదీ సూచన మేరకు 2020 అక్టోబరు నుంచి ప్రారంభించిన రోజ్గార్ మేళాలో, నేటి వరకు దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 526 మంది యువతకు ఆయన నియమక పత్రాలను అందించారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని హకీంపేట్లోని సీఐఎస్ఎఫ్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. మరో 75 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే తమ లక్ష్యం పూర్తవుతుందన్నారు. ఇవే కాకుండా యువత స్వయం శక్తితో ఎదిగే విధంగా ప్రభుత్వ రుణాలను అందిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి ప్రపంచ దేశాలలో మన దేశం ఆర్థికంగా మూడో స్థానానికి చేరుతుందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 348 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. |
2,536,701 | రైతు భరోసాపై బీఆర్ఎస్ కొత్త నాటకం | ● పదేళ్లలో రైతులను ముంచేసి.. ఇప్పుడు డ్రామాలు● రైతుబంధుతో 21వేల కోట్లు దుర్వినియోగం ● బహిరంగ లేఖలతో అన్నదాతలనుగందరగోళపర్చే యత్నం: తుమ్మలహైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాపై బీఆర్ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ‘రైతు భరోసా’పై చర్చ పెట్టి అభిప్రాయాలు చెప్పాలని అడిగితే.. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్, హరీశ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మంత్రి తుమ్మల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక ‘రైతుబంధు’లో కూడా రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు తమ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇద్దామని అంటే కొత్త కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ధ్వజమెత్తారు. లేఖలతో రైతులను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35 శాతం ప్రకటించి, ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని నిలదీయమంటున్నారు? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకంలో 2019–20లో రెండు పంట కాలాల్లో మీరు పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. 2023 యాసంగి రైతుబంధు రూ.7,600 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. పంట నష్టం సంభవిస్తే పరిహారం ఇవ్వకపోగా.. కనీసం రైతులను పరామర్శించని వారు, నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్నా ప్రశ్నించమనేది? అని దుయ్యబట్టారు. కార్పొరేషన్ల పనితీరు మార్చుకోవాలి!ప్రతి కార్పొరేషన్ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ల పనితీరు మార్చుకొని, ప్రభుత్వ ప్రాధమ్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ, చేనేత అనుబంధ కార్పొరేషన్ల ఎండీలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్యాన శాఖ ద్వారా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జిల్లాల్లో పలు రకాల కూరగాయలు పండించడానికి, వాటి మార్కెటింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. |
2,536,702 | ఇంటెలిజెన్స్ డీజీ కుమారుడి వివాహానికి సీఎం దంపతులు.. | ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి కుమారుడు కార్తీక్ వివాహం అర్షితో సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు హాజరై వధూవరులను దీవించారు.–ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ |
2,536,704 | రాష్ట్రంలో ‘డిటెన్షన్’ ఇప్పుడే కాదు! | ● అమలు చేస్తే డ్రాపౌట్లు పెరుగుతాయనే ఆందోళనహైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు పరచకూడదని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే విద్యార్థులు నష్టపోతారని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు పాత విధానాన్నే అమలు చేయాలని భావిస్తున్నారు. 5, 8వ తరగతుల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. అంటే ఈ రెండు తరగతుల్లో వార్షిక పరీక్షల్లో పాసైన విద్యార్థులనే పై తరగతులకు పంపిస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితే రెండు నెలల్లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ పరీక్షల్లోనూ ఫెయిలైతే మళ్లీ 5, లేదా 8వ తరగతులే చదవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లకు వర్తించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేసే ఆలోచన చేయడం లేదు. కేంద్రం తీసుకున్న విధానాన్ని రాష్ట్రంలో అమలు పరిస్తే.. పాఠశాల విద్యలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో పాటు పేద వర్గాలకు విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో డిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తే పేదలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి అభిప్రాయపడ్డారు. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో డ్రాపౌట్స్ పెరుగుతారని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. |
2,536,705 | దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ అవార్డు | హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది. రైల్వే వారోత్సవాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ అవార్డు షీల్డ్ను దక్షిణమధ్యరైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు అందజేశారు. అలాగే జోన్ పరిధిలోని వివిధ డివిజన్లలో అత్యుత్తమ సేవలందించిన అధికారులు జవ్వాది వెంకట అనూష, వావిలపల్లి రాంబాబు, సుమిత్ శర్మ, ఆంథోనీ దొరైరాజ్, ఆదినారాయణ, కామారపు వినోద్లకు అతివిశిష్ట సేవా పురస్కారాలను అందజేశారు. |
2,536,710 | ఆ చెరువులపై నివేదిక ఇవ్వండి! | ● కాలువల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఏవీ రంగనాథ్ ఆదేశంహైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పలు చెరువుల ఆక్రమణలు, వరద నీటి కాలువల మళ్లింపుపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఏవీ రంగనాథ్ ఆదేశించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాపులను పూర్తిస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. సోమవారం నానక్రాంగూడలోని తౌతోనికుంట, భగీరథమ్మ, నార్సింగ్ నెక్నాంపూర్ చెరువులు, మూసీ నదిని రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా చెరువుల ఆక్రమణ ఇంకా కొనసాగుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నానక్రాంగూడలో వరద నీటి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలు తొలగించాలని సూచించారు. నదిలో కొన్ని నిర్మాణ సంస్థలు మట్టి పోసినట్టు గుర్తించిన రంగనాథ్.. దానిని తొలగించాలని, బఫర్ జోన్లో మట్టి పోస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ వర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు వెళ్లే ప్రవాహ వ్యవస్థ మూసుకుపోవడంతో అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరుతోందంటూ వచ్చిన ఫిర్యాదును పరిష్కరిస్తామని తెలిపారు. |
2,536,708 | తాండూరులో ఏసీబీ దాడులు | ● రూ.5 లక్షలతో పట్టుబడ్డ సబ్కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తాండూరు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి సబ్కలెక్టర్ కార్యాలయంలో దాడులు నిర్వహించి రూ. 5 లక్షల లంచం తీసుకుంటున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో) దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల గ్రామంలోని సర్వే నంబరు 369లో 6 ఎకరాల 26 గుంటల పట్టా భూమికి సంబంధించి ఎల్ఎఫ్(ల్యాండ్ ఫామ్) రోడ్డు నుంచి పట్టా భూమికి మార్పిడి చేసేందుకు 5 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ యూనిట్–1కి చెందిన ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. ఏవో దానయ్య నుంచి లంచం మొత్తం రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావును అరెస్ట్ చేసి పీఆర్ఎల్ ఎదుట హాజరుపరిచారు. |
2,536,700 | జాతీయ మీడియాకు.. హైదరాబాద్ సీపీ ఆనంద్ క్షమాపణలు | హైదరాబాద్ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడినందుకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సోమవారం ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ‘‘పుష్ప–2 ప్రీమియంషో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ప్రమాద ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగిన సందర్భంలో నేను సహనాన్ని కోల్పోయాను. జాతీయ మీడియా గురించి అనవసర వ్యాఖ్యలు చేశాను. నేను ప్రశాంతంగా ఉండాల్సింది. నా వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను మనస్పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను’’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. |