inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పలుగు రాళ్ళు తెచ్చి గొప్ప గొప్ప దేవాలయాలు కట్టి అందమైన శిలా విగ్రహాలు తయారుచేసి వాటికి మొక్కడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? మీరు తయారుచేసిన శిలలకి దేవుళ్ళని పేరు పెట్టి మీరే పూజిస్తే ఫలితమేమిటి? దేవుళ్ళని ఎవరైన తయరు చేయగలరా?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పలుగు ఱాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి చెలగి శిలల సేవ చేయనేల? శిలల సేవజేయ ఫలమేమి గల్గురా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మేఘాలు నీటిబిందువులను వానగా కురిపిస్తాయి. అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపించినా, అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదే విధంగా మంచివాడు నిరంతరం మంచిమాటలనే పలుకుతాడు. ఒక్కోసారి సమయానుకూలంగా కఠినంగా పలుకుతాడు. అయితే ఆ మాటల వలన మేలు జరుగుతుందే కాని కీడు జరుగదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషల పల్కు కఠోర వాక్యముల్ పలుక డొకానొకప్పుడవి పల్కిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్పినన్ శిలలగునౌట వేగిరమె శీతల నీరము గాక భాస్కరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మంచివాడు మంచేమాట్లాడతాడు.ఓసారికఠినంపలికినా తప్పుకాదు.మేఘాలుఒకసారి వడగళ్ళు కురిసినా చల్లనీరగును.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కుకఠోర వాక్యముల్ బలుక డొకానొకప్పుడవి పల్కినగీడునుగాదు నిక్కమే చలువకువచ్చి మేఘు డొకజాడను దావడగండ్ల రాల్చినన్ శిలలగు నోటువేగిరమె శీతలనీరము గాక భాస్కరా
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా!
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్ భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: పశువులు దారితప్పితే కాపరిది, ప్రజలు చెడ్డవారైతే రాజుది, భార్య గయ్యాళితనానికి భర్తది, కొడుకు దుడుకుతనానికి తండ్రిది, కూతురు చెడునడతకు తల్లిది, సైన్యం పిరికిదైతే సైన్యాధిపతిది, గుర్రం ఆగిపోతే రౌతుది.. తప్పవుతుంది. ఎవరికి వారు ఇలా తమ తప్పుల్ని తెలుసుకోక ఇష్టం వచ్చినట్లు వుంటే ఎలా? నీవైనా వారికి జ్ఞానోదయం కలిగించు స్వామీ!!
ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: పసరంబు పంజైన బసులకాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన బ్రభుని తప్పు, భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన దండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చ వచ్చి నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పనియందు కష్ట సుఖములు తెలుసుకోలేని అధికారి సేవ, ఇష్టములేని స్త్రీతో సంభోగము,చెడు స్నేహము ఏటికి ఎదురీదినట్లు కష్టము కలుగ జేయును.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాటెరుగని పతి కొలువును గూటంబున కెరుక పడని కోమలి రతియున్ జేటెత్త జేయు జెలిమియు నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ.
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! చేతిలో వెన్నముద్ద, జుట్టు ముడిలో నెమలి పింఛము, ముక్కునందు ముత్యమును నేర్పుతో ధరించి శేషునిమీద పవళించేనీవు ఏమీ ఎరుగని గొల్లపిల్ల వాడివలె తిరిగితివి కదా!కృష్ణశతకము.
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ బింఛం బాణీముత్యము ముక్కున బాణువువై దాల్తు శేషశాయివి కృష్ణా
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీదయకన్నిజాతులవారూపాత్రులేకదా!రామా!రాతినహల్యగా మార్చావు.వైరితమ్ముని లంకారాజుచేశావు.గుహునికిపుణ్యము,కోతులకిమహిమిచ్చావు.
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పాతకులైన మీకృపకుబాత్రులుకారె తలచిచూడజ ట్రాతికిగల్గెభావన మరాతికి రాజ్యసుఖంబు గల్గెదు ర్జాతికిబుణ్యమబ్బె గపిజాతిమహత్వమునొందె గావునన్ దాతవుయెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పాపపు కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా కనీసం మదిలోకూడా తలవకూడదు. మనపైనే ఆధారపడిన భార్యాబిడ్డలను ఎన్నడూ విడువరాదు. కాపాడుతానన్న వారిని వదిలి వేయవద్దు. మనసులో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అలాగే, దుర్మార్గులను ఎంతమాత్రం నమ్మరాదు. ఇలాంటి తగని పనులను తెలుసుకొని నడచుకోవాలి.
ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పాపపు బని మది దలపకు చేపట్టిన వారి విడువ జేయకు కీడున్ లోపల దలపకు, క్రూరుల ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పాపటకాయ పైకినున్నగానున్ననూ లోపలచేదుపోదు.దుర్మార్గుడు పైకందముగా నున్ననూదుర్గుణములుపోవు.నమ్మరాదు.భాస్కరశతకం
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పాపపుద్రోవవాని కొకపట్టున మేనువికాసమొందినన్ లోపల దుర్గుణంబే ప్రబలుంగద నమ్మగగూడదాతనిన్ బాపటకాయకున్ నునుపుపైపయి గల్గినగల్గుగాక యే రూపున దానిలోగల విరుద్ధపుచేదు నశించు భాస్కరా
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: అయోధ్యను పాలించే దశరథమహారాజు కుమారుడైన శ్రీరామా, కరుణకు మారుపేరయినావాడా, రామా! పాపం చేసినప్పుడు, పాపం వలన భయం కలిగినప్పుడు, బాధలు పీడించినప్పుడు, శరీరం జ్వరం వంటి రోగాలతో బాధ పడుతున్నప్పుడు, ఆపదలు కలిగిన సమయంలోనూ... నిన్ను పూజించేవారికి సహాయం చేయడం కోసం నువ్వు, నీ తమ్ముడైన లక్ష్మణుడితో కలసి వచ్చి, కష్టాలలో ఉన్నవారికి ఇరుపక్కల నిలబడి, ఆ బాధల నుంచి రక్షిస్తావని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పాపము లొందువేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవు దమ్ము డిరుపక్కియలన్ జని తద్విపత్తి సం తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పామువంటి పాపిష్టి జీవికూడ ఏదైన చెఊఇన వింటుంది కాని మూర్ఖునికి ఎంత చెప్పిన అతని గుణము మారదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును ఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరు విశ్వదాభిరామ! వినుర వేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాము ఎంతటి విషజంతువు. దానితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పాము కూడ పాములవాడు చెప్పినట్టు వింటుంది. కాని ముర్ఖుడు ఇంతకంటే ప్రమాదకరమైన వాడు. ఎవరు చెప్పినా వినడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాముకన్నలేదు పాపిష్టియగు జీవి యట్టి పాము చెప్పినట్టు వినును ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలల్లో కలిసిన నీళ్ళు పాల లాగ మారిపోతాయి. అలాగే గురువు మూలంగా శిష్యుడుకూడ విద్వాంసుడవుతాడు.కాబట్టి సాధు సజ్జనులలో చేరితే సద్గుణాలే వస్తాయి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలగతియు నీరు పాలెయై రాజిల్లు గురునివలన నట్లు కోవిదుడగు సాధుసజ్జనముల సంగతులిట్లరా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలతో కలిసిన నీరు పాలరంగులో ఉండి తాగేందుకు రుచిగా ఉంటుంది.అలాగే మంచివారితో స్నేహంచేసిన ఏమీతెలియని అమాయకుడుకూడా సజ్జనులతో కలిసి సజ్జనుడుగానే పేరుతెచ్చుకుంటాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలగలయు నీరు పాలెయైరాజిల్లు నదియు పానయోగ్య మయినయట్లు సాధుసజ్జనముల సాంగత్యములచేత మూఢజనుడు ముక్తిమొనయు వేమా
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పాలలోకలిసిననీరు చూచుటకు పాలలాగేఉండును.కానిరుచిచూచిన యెడల పాలరుచిని తగ్గించును. అట్లేచెడ్డవారితో స్నేహముచేసిన యెడల మంచి గుణములు తగ్గిపోవును.కావున చెడ్డవారిస్నేహము వలదు.బద్దెన.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాలను గలసిన జలమును బాల విధంబుననె యుండు బరికింపంగా బాలచవి జెరుచు గావున బాలసుడగువాని పొందు వలదుర సుమతీ
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: పాలను వెన్నయు మ్రుచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్ లీలావినోదివైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలరాళ్ళను తెచ్చి అత్యద్బుతంగా ఆలయం నిర్మించి, దానిలో శిలా విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటారు. మనసులో భక్తేమి లేకుండా శిలలను పూజించడం మూలంగా ఏమి లాభం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలరాళ్ళదెచ్చి పరగంగ గుడికట్టి చెలగి శిలలు పూజ చేయుచుంద్రు శిలల బూజచేయ చిక్కునదేమిటి? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాలలో కొంచెం పులుసు పడినా కాని ఆ పాలు విరిగి పనికి రాకుండా పోతాయి. అలానే చెడు సహవాసాలవలన చెడు, మంచి సహవాసాలవలన మంచి కలుగుతాయి. అదే విధంగా ఙాన సంపర్కం వలన వివేకం కలుగుతుంది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలలోన బులుసు లీలతో గలసిన విఱిగి తునకలగును విరివిగాను తెలియ మనములోన దివ్యతత్త్వము తేట విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పాలసునకైన యాపద జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ దే లగ్నిబడగఁ బట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పాలు పంచదార పాపర పండ్లలోఁ జాల బోసి వండఁ జవికిరాదు కుటిల మానవులకు గుణమేల కల్గురా విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్యవిశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు. అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపరసుఖములని అనుభవింపజేయుమా.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనం టే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య ల క్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిండాలు తయారు చేసి పితృదేవతలని కాకులని పిలిచి పెడతారెం పిచ్చివాళ్ళారా. కనిపించిన చెత్తంతా తినే కాని మీ పితృదేవత ఎట్లయింది?.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పిండములను జేసి పితరుల దలపొసి కాకులకును బెట్టు గాడ్దెలార పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా విశ్వధాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నీవు చిన్నవారిని, పెద్దవారిని చూచినయెడల మర్యాదతో ప్రవర్తింపుము. మంచివారు నడచు మార్గములందు నడువు, అట్లు నీవు ప్రవర్తించుచుండిన యెడల లోకమునందంతటనూ ప్రఖ్యాతికెక్కగలవు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పిన్నల పెద్దలయెడఁ గడు మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ వెన్నుకొని తిరుగుచుండిన నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పిలవనిదే పనులకు పోరాదు.ఇష్టపడనిదే భార్యతో భోగించరాదు.అధికారి చూడని ఉద్యోగము చేయరాదు.పిలవనిపేరంటము పోరాదు.ఇష్టములేనిదే స్నేహము చేయరాదు.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పిలువని పనులకు బోవుట గలయని సతి రతియు రాజు గానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పిసినారివాడి ఇంట్లో మరణం సంభవిస్తే పాడె కట్టెలకు డబ్బులిచ్చి, అవి ఖర్చై పొయాయని వెక్కి వెక్కి మరీ ఏడుస్తాడు లోభి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పిసిని వానియింట బీనుగు వెడలిన గట్టె కోలలకును గాసు లిచ్చి వెచ్చమాయనంచు వెక్కివెక్కి మరేడ్చు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: రెండు కండ్లనిండా నిన్ను చూసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ! నిండైన నా మనోవాంఛ తీరేలా సొగసైన నీ రూపాన్ని చూపించు. పాపకర్మలు చేసే వారికంట పడకూడదని తీర్మానించుకున్నావా? సృష్టిలో పతిత పావనుడవు నీవేనని పుణ్యాత్ములంతా నిన్నే పొగడుతారు కదా! నీకింత కీర్తి ఎలా వచ్చెనయ్యా! ఇకనైనా నను బ్రోవవయ్యా నారసింహా!!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: పుండరీకాక్ష! నా రెండు కన్నులనిండ నిన్ను జూచెడి భాగ్యమెన్నడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య పాపకర్ముని కంటబడక పోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె వసుధలో బతితపావనుడ వీవంచు నేబుణ్యవంతుల నోట బొగడవింటి నేమిటికి విస్తరించె నీకింత కీర్తి? ద్రోహినైనను నాకీవు దొరకరాదె? భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టిన వారందరూ మరణించనిచో యీ భూగోళము పట్టదు. యమునిలెక్క ప్రకారము ఒకరి తరువాత ఒకరుచనిపొవుచునే యుందురు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు వట్టిదెపుడు యముని లెక్క రీతి అరుగుచు నుందురు విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు తమ అంతరాత్మలోనె భగవంతుడు ఉన్నాడనే చిన్న విషయం గ్రహించలేక కాశి యాత్రలకని, తీర్దయాత్రలకని పిచ్చిపట్టిన వాళ్ళలా తిరుగుతూ ఉంటారు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టు ఘట్టములోన బెట్టిన జీవుని గానలేక నరుడు కాశికేగి వెదకి వెదకి యతడు వెఱ్ఱియైపొవును విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫుట్టగానే ఏడుపు, జీవితాంతం ఏడుపు, చావు సమయం దగ్గర పడగానే మళ్ళీ ఏడుపు ఇలా జీవించినంత కాలం మనిషి లోకం దుఃఖమయమే. ఇటువంటి దుఃఖనికి సాటిగల దుఃఖం మరెక్కడా లేదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టు దుఃఖమునను బొరల దుఃఖమునను గిట్టు దుఃఖమునను గ్రిందపడును మనుజుదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పుట్టగానే సంతోషిస్తారు. చనిపోగానే ఏడుస్తారు. పుట్టిన వారల్లా చావక తప్పదన్న చిన్న విషయం అందరికి తెలుసు. కాని ఈ ఏడుపులెందుకో అర్దంకాదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుట్టుటకు ముదంబు గిట్టుటకును వెత అందఱెఱిగినట్టి యల్పవిద్య చచ్చుగాన బుట్ట జప్పున నేడ్వరే? విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ యందు సరియైన భక్తిగల తత్వజ్ఞానియైన భక్తుడు ఒక మారేడు దళముతో నిన్ను పూజించెనేని అనంతపుణ్యము పొందగలడు. అట్టి భక్తి లేకయో ఏమో కొందరు ఇతరదైవములను నమ్మి వారికి భక్తులగుచు వారికి పప్పులు, ప్రసాదములు, కుడుములు, దోసెలు, సారెసత్తులు, అటుకులు, గుగ్గిళ్ళు మొదలగు పదార్ధములను నైవేద్యముగ సమర్పించి ఆరాధించుచున్నారు. దీనివలన వారు తగినంతగా ఐహిక సుఖమును పొందజాలరు. పరమున మోక్షానందమును పొందనే పొందజాలరు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: పుడమి న్నిన్నొక బిల్వపత్రముననేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్ ప్రసాదంబులం గుడుముల్ దోసెలు సారెసత్తులడుకుల్ గుగ్గిళ్ళునుం బేట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదు రకటా! శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! చెడ్డనడవడి కలవాడు దుడుకుతనముచే లంచములను తీసికొనుటకు ఉద్దేశించును. కాబట్టి దుష్టబుద్ధిగల వాడవై లోకులందరనూ మర్యాదనతిక్రమించి వెంటతిప్పుకొనుచూ హాని చేయవద్దు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పుడమిని దుష్టత గలయా తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ నడవడి మిడి యందఱి వెం బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో జనులు కొడుకుని కనాలని విపరీతమైన ఆశతో తహతహలాడుతుంటారు. కాని కొడుకు పుట్టినంత మాత్రాన కులాన్ని ఉద్దరిస్తాడా ఎంటి?. అదంతా మూర్ఖత్వం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుడమిలోన నరులు పుత్రుల గనగోరి యడలుచుందు రనుపమాశచేత కొడుకు గలిగినంత కులముద్ధరించునా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనవంతుడికి చిన్న పుండు వచ్చినా లోకమంతా తెలుస్తుంది కాని పెద వాని ఇంట్లో పెల్లైనా ఎవరికి తెలియదు. ఇదే లొకం పోకడ.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పుత్తడి గలవాని పుండుభాదయు గూడ వసుధలోన జాల వార్తకెక్కు పేదవానియింట బెండ్లైన నెఱుగరు విశ్వధాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: కొడుకుపుట్టగానే సంతోషంతండ్రికి కలగదుట. ఆకొడుకుపెద్దవాడై మంచిపేరుతెచ్చుకుని ప్రజలందరూ మెచ్చుకుంటూంటే అప్పుడుకలుగుతుందిట.కవిభావం పుట్టినప్పటికన్నాఅప్పుడెక్కువని.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడుజన్మించి నపుడెపుట్టదు జనులా పుత్రునిగనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడుపొందుర సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: విత్తనము వేయకుండానే భూమ్మీద ఎక్కడైనా వారి పండుతుందా? అలాగే మనిషి తన ప్రయత్నం తాను చేయకపోతే భగవంతుడు ఎలా అనుకులిస్తాడు? కాబట్టి ఏ పనికైనా మానవ ప్రయత్నం అనేది ముఖ్యమని ఈ పద్యభావము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పురుషుండొనర్పని పనికిని నరయగ దైవం బదెట్టు లనుకూలించున్ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వరలి కుమారా !
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఖర్జూరపండ్లు పైకిఅందముగాలేకున్నాతియ్యగానుండుటచే తిందురు. అట్లేమంచివారిని అందములేకున్నాగౌరవింతురు.
ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూపసంపదల్ దూరములైన వానియెడ దొడ్డగజూతురు బుద్దిమంతు లె ట్లారయ గొగ్గులైన మరియందుల మాధురి జూచికాదె ఖ ర్జూరఫలంబులం ప్రియముచొప్పడ లోకులుగొంట భాస్కరా
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూర్వజన్మమందు పుణ్యంబు చేయని పాపి తా ధనంబు బడయలేడు విత్తమరచి కోయ వెదకిన చందంబు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అభరణాలు బంగారు పుష్పాలు వంటివి గల సంపన్నుడు భూమి మీద తక్కువ కులస్తుడైనా గౌరవం పొందుతాడు. కులం అనేది పేరుకే గాని, మనుషులందరికి డబ్బంటే ఆశ, డబ్బు ఉన్నవాడంటే గౌరవం.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూసపోగు పసిడి పుష్పంబు మొదలగు సంపదగలవాడు జగతియందు హీనకులజుడైన హెచ్చని యందురు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విలువైన బట్టలు,నగలు ధరించి ధనవంతునిగా నున్నయెడల దానికితోడు కండబలముకూడా నున్నయడల అట్టివానికి ఎదురేగి తీసుకొచ్చి సింహాసనమున కూర్చుండబెట్టి సత్కరించెదరు.నీచుడైననూ సరే.వేమన.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పూసపోగులైన పుట్టంబు విడియంబు కాయపుష్టి మిగుల గలిగియున్న హీనజాతినైన నిందు రమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దయాగుణం కలిగిన ఓ దశరథరామా! మమ్మల్ని పెంచి పోషించటానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలను పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే పది ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుని రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపటానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు.
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: పోషించుటకుతల్లిగా,దుష్టులచేరకుండాకాపాడు తండ్రిగా,అనారోగ్యాలనుండీ కాపాడువైద్యుడుగా రామా!ఇహపరాలకునీవేగతి.గోపన్న
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెంపునతల్లివై కలుషబృంద సమాగమమొందకుండర క్షింపనుతండ్రివై మెయివసించు దశేంద్రియరోగముల్ నివా రింపనువెజ్దవై కృపగురించి పరంబుదిరంబుగాగస త్సంపదలీయనీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనేకమైన చదువులెందుకు? అర్ధరహితమైన వాదనలెందుకు? స్థిరమైన మనస్సుతో మౌనం వహించిన వేళ మనిషి ముని అవుతాడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెక్కు చదువులేల చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూఱుకున్న సర్వసిద్దుడగును సర్వంబు దానగు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనను పోషించుకుంటానికి దుష్టుడు జనాల్ని హింసిస్తాడు, వాళ్ళ సొత్తును దొంగలించుతాడు, చివరికి చంపటానికి కూడ వెనుకాడడు. అలాంటి వాళ్ళు తమ సంపద కలకాలం ఉంటదనుకుంటారు, అది వాళ్ళను కాపాడుతుందనుకుంటారు. కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యముని చేత చావు తప్పదని తేలుసుకోలేరు
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెక్కు జనులగొట్టి పేదల వధియించి డొక్కకొఱకు నూళ్ళ దొంగలించి యెక్కడికరిగిన నెఱిగి యముడు చంపు విశ్వదాభి రామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఉక్కుస్థంభమునుండి భయంకర నృసింహరూపముతో వెలువడి హిరణ్యకశిపుని గోళ్ళతోచంపి అతడికొడుకు ప్రహ్లాదుని కాపాడితివి
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహభీకర స్ఫుట వటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం తట గృపజూచితివికద దాశరధీ కరుణాపయోనిధీ
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరులకు దానం చేసిన రోజులలో దట్టమైన అరణ్యమధ్యభాగాలలో ఉన్నప్పటికీ అక్కడ కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. అదే ఇతరులకు దానం చేయని రోజులలో అయితే బంగారపు కొండ మీద ఉన్నప్పటికీ అక్కడ అనుభవించదగినదేదీ దొరకదు కదా! కనుక ఉన్నంతలో ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా కవి ఈ పద్యం ద్వారా నొక్కి చెప్పాడు. పెట్టిన దినములలోపలన్ అంటే ఇతరులకు దానం చేసిన రోజులలో; నడు + అడవులకున్+ ఐనన్ అంటే దట్టమైన అడవుల మధ్యభాగంలో ఉన్నప్పటికీ; నానా + అర్థములున్ అంటే కావలసిన ద్రవ్యాలన్నీ; వచ్చున్ అంటే దొరుకుతాయి; పెట్టని దినములన్ అంటే ఇతరులకు దానం చేయని రోజులలో; కనకము + గట్టు అంటే బంగారంతో నిండిన కొండ ను; ఎక్కినన్ అంటే అధిరోహించినప్పటికీ; ఏమి అంటే అనుభవించదగినదేదీ; లేదు + కదరా అంటే ఉండదు కదయ్యా!
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ పెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరన్నా ఇతరులకు సహాయము చెద్దామని వస్తే, తను పెట్టకపొయినా ఫర్వాలేదుకాని చెడగొట్టకుండా ఉంటే చాలు. అలా చేసినట్లైతే తనే పెట్టినంత ఫలమే కాకుండా ఒక పెల్లి చేసినంత పుణ్యము వస్తుంది. కాబట్టి ఎవరన్నా ఇతరులకు సహాయము చేయడానికి సిద్దపడితే తనలోని ద్వేషభావాలను వదిలివేసి వారిని ప్రోత్సహించడం మంచిది.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెట్టినంత ఫలము పెక్కుండ్ర కుపహతి జేయకున్న దాను చెఱపకున్న పెండ్లి చేయునట్టి పెద్ద ఫలమురా! విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనమేమి అడగకుండానే ఇచ్చేవాడు నిర్మలమైన దాత. అలా కాకుండా నొటికొచ్చినట్టు తిట్టి ఇచ్చెవాడు ఒక పురుగులాంటి వాడు. అసలేమి ఇవ్వకుండా పైపై ఆర్బాటం చేసే వాడు అసలెన్నడు పైకెదగడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పెట్టిపోయువాడు కట్టడి గలదాత తిట్టి పోయువాడు తుట్టె పురువు రట్టు సేయువాడు రాణింపునకు రాడు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు. ఇతర స్త్రీలను ఎపుడైనా చూచుటకు కోరవలదు.
ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పెద్దలు వద్దని చెప్పిన పద్దులఁబోవంగరాదు పరకాంతల నే ప్రొద్దే నెదఁబరికించుట కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: పెద్దలను గౌరవించే పద్ధతిని చక్కగా తెలిపిన నీతిపద్యమిది. పెద్దలు మనమున్న చోటుకు వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ, పొగరుతోనో, చిన్నాపెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరకు బద్ధకం వల్లనైనా సరే మన హద్దు గ్రహించకుండా, అలానే కూచుండిపోయే వారిని బుద్ధిలేని మొద్దుగా, మూర్ఖునిగా జమకడతారు.
ఇచ్చిన భావం వచ్చే కుమార శతకం శైలి పద్యం: పెద్దలు విచ్చేసినచొ బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్ హద్దెరిగి లేవకున్నన్ మొద్దు వలెం జూతురతని ముద్దు కుమారా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రతి మహిళా పుట్టినింటి గౌరవాన్ని నిలుపుతూ, మెట్టినింటి మేలు కోసం పాటుపడాలి. భర్త వద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదు. బావల ముందు అర్థం పర్థం లేకుండా తిరుగకూడదు. చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించకుండా మనసులో కల్మషం లేకుండా మెలగాలి. అలాంటి కోడలును ఆ అత్తింటి వారు కన్నకూతురు వలె చూసుకోకుండా ఉంటారా!
ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నడు జేయరాదు బావల కెదుటన్ గనపడగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సోమయాజి అని పేరు పెట్టుకుని పెద్ద బలవంతుడినని ఊహించుకుంటూ అమాయకమైన మేక పిల్లని, కోడి పిల్లని బలి ఇస్తారు. ఇలాంటి బలులు ఎన్ని ఇచ్చిన మోక్షం దొరకదని తెలియని మూర్ఖులు వాళ్ళు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: పేరు సొమయాజి పెనుసిమ్హ బలుడాయె మేకపొతు బట్టి మెడను విరవ కాని క్రతువువలన కలుగునా మొక్షంబు విశ్వధాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దోరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే ఙానము రాదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు పైరు నిడని వాడు ఫలము గనునె? పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయు చుండుము. అప్పుడే వారు సంతోషింతురు. లేకున్న దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కల్గిన యెడల నీకు హాని కలుగును.
ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: పోషకుల మతముఁగనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్, దోషముల నెంచుచుందురు, దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధైర్యవంతుడు పట్టభద్రుడుకాకున్నను ప్రజలు గుర్తిస్తారు, రాజు కాకున్నను గౌరవిస్తారు అలాగే యోగి కాకున్నను మంచి చెడ్డలు ఎరిగి జాగ్రత్తగా మాట్లడుతారు. కాబట్టి సమాజంలో మన్నన పొందడానికి ధైర్యం కలిగి ఉండాలి. చెడ్డని ఎదిరించగలగాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రజలెఱుంగ బ్రతుకు బట్టభద్రుడు కాడు పై గిరీటముండు బ్రభుడుకాడు ఓగు దెలిసి పలుకు యోగీశ్వరుడుకాడు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు తోలి దైవం తల్లి. ఆ తర్వాత తండ్రి . ఇక గురువు తుది దైవము. ఈ ముగ్గురిని మించిన దైవం లేదని అందరు గ్రహించాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రధమున మాతృదేవత పదపడి జనకుండుటగును బరికింప నికన్ కుదిరిన సదమల గురుడే తుది దైవము పెరలు వేఱు తోరము వేమ.
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజులకి అపరాధములు చెల్లిస్తారు కాని బీదవానికి దానం చేయరు. వేశ్యలకు ధనమిచ్చినట్లు విద్యార్ధులకివ్వరు. కల్లు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు కాని పాలు కోసం పది సార్లు ఆలోచిస్తారు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రభుల కిచ్చునట్లు రహి పేదలకు నీరు వనిత కిచ్చునట్లు వటులకీరు సురకు నిచ్చునట్లు సుధనుకును నీయరు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజు కాని కోతిలాగ చపలచిత్తుడైతే గనుక మంత్రి అశుద్దాన్ని తినే పందిలా మారతాడు. సైనికులు పశువుల్లా మారిపోతారు. ఇక గుర్రాలు ఏనుగులు, ఎలుకలు పిల్లుల్లా అవుతాయి. కాబట్టి ఎంత బలగం ఉన్నా రాజ్యన్ని పరిపాలించే ప్రభువు సమర్దుడు కావాలి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రభువు క్రోతియైన ప్రగ్గడ పందియౌ సైనికుండు పక్కి సేన పనులు ఏన్గులశ్వములను నెలుకలు పిల్లులు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి 1. ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? కోరికలన్నీ తీర్చే సంపదలు పురుషునికెన్ని కలిగితేనేమి? 2. న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? శత్రువులపై విజయం సాధించి భూభాగాన్ని ఎంత విస్తరిస్తేనేమి? 3. సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? బాగా మిత్రులకు ధనకనక వస్తువాహనాలిచ్చి గౌరవిస్తేనేమి? 4. కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్? కల్పాంతందాకా చావులేకుండా బ్రతికితేనేమి? అనేవి ప్రశ్నలు దీనికి సమాధానాలేమిటి? అంటే ఇందులో లేవు. బయటినుండి తీసుకోవాలి ఆలోచించగా ఇవన్నీ ప్రయోజనం లేనివని అర్థం. మరేమి కావాలి ఎప్పుడు ఇవి ఫలవంతమైనవి. అంటే మోక్షదాయకమైనపుడు అనేది సమాధానం లేదా మోక్షమివ్వవుకనుక ఇవి నిష్ప్రయోజనాలే అని అర్థం స్ఫురుస్తుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ప్రాప్తాః శ్రియస్సకల కామదుఘా, స్తతః కిం? న్యస్తం పదం శిరి విద్విషతాం, తతః కిం? సంపాదితాః ప్రణయినో విభవై, స్తతః కిం? కల్పం స్థితం తనుభృతాం తనుభి, స్తతః కిమ్?
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రేమతో పెట్టకపోతే పంచభక్ష్య పరమాన్నాలు కూడ రుచించవు. భక్తిలేని పూజ వలన పూజ సమాగ్రి దండగ. అలానే పతి భక్తి లేని భార్య నిరుపయోగము.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రియములేని విందు పిండి వంటలచేటు భక్తిలేని పూజ పత్రిచేటు ఓజమాలు నాల దోలి మాడల చేటు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రేమలేకుండా విందుచేస్తే పిండివంటలు వృధా.భక్తిలేకుండా పూజచేసి ప్రయోజనం ఉండదు. పత్రీ,పూలు చేటు.అర్హత లేనివారికి సువర్ణ దానమిస్తే పుణ్యం రాదుసరికదా!బంగారం వృధా.వేమన శతకం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ప్రియములేనివిందు పిండివంటలచేటు భక్తిలేనిపూజ పత్రిచేటు పాత్రమెరిగి నీవి బంగారు చేటురా విశ్వదాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనిషిఎడమచేతతినుట,కుడిచేత గుదముకడుగుటకూడనట్లే ప్రభువులునీచునికి గొప్ప అధికారము,గొప్పవారికి నీచపనిచ్చుటతగదు.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ప్రేమనుగూర్చి అల్పునకు బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్చపుంబని నెదంబరికింపక యీయరాదుగా వామకరంబుతోడ గడువం గుడిచేత నపానమార్గముం దోమగవచ్చునే మిగులదోచని చేతగుగాక భాస్కరా
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందరికి ఉపయోగపడే మంచి విషయం ఒక్కటి చెప్తే చాలు. అనవసరమైన వ్యర్ధ ప్రేలాపలనలు వెయ్యి పలికినా ఉపయోగం ఉండదు. అలాగే భక్తి లేకుండా ఎన్ని మొక్కులు మొక్కినా శూన్యం. భక్తి కలిగిన మొక్కు ఒక్కటి చాలు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫక్కితెలిసి పలుక నొక్కవాక్యమె చాలు పెక్కులేల వట్టి ప్రేల్పులేల? దిక్కుకలిగి మ్రొక్క నొక్కటి చాలదా? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుని దగ్గర కాని ధనం చేరిందా, తమకేమన్న హాని చేస్తాడెమో అని కోరలున్న పాముని చూసి భయపడినట్లు భయపడుతారు. కాని ధనం పొయిందా, అతన్నెవరూ పట్టించుకోరు, చేరదీయరు. కోరలు పొయిన పాముని ఎవరూ పట్టించుకోరు కదా ఇదీ అలానే.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫణికి గోరలుండు భయమొందునట్టులే వెఱుతురయ్య దుష్టువిభవమునకు కోఱలూడ ద్రాచు మీఱునా దుష్టత విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైనా సమస్య వచ్చినపుడు న్యాయం తెలుసుకుని జవాబివ్వడం ఉత్తమం. అలా సమాధానం ఇచ్చినవాడే ఉత్తముడై గౌరవించబడతాడు. అలాంటి న్యాయ గుణము లేకపొయినా, కావాలని అన్యాయాన్ని ప్రోత్సహించినా గౌరవం పొందలేరు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఫణితి తెలిసి మాఱు పల్కుటే యుక్తము గణనకెక్కునట్టి ఘనుడె యెపుడు గుణములేక యున్న గుదురునే యూహలు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చకోరపక్షులు చంద్రునిచల్లనివాడని దరిచేరును.అట్లేఅధికారి మంచివాడైన లాభముకొంచమైననూ అంతాదగ్గరచేరుదురు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకు లాతనికపేక్ష యొనర్తురదెట్లు చంద్రికా విలసనమైన దామనుభవింప జకోరములాసజేరవే జలువగలట్టి వాడగుటజందురు నెంతయుగోరి భాస్కరా
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సాధారణముగా కొందరు కామినీ కాంచనముల యందు ఆశ కలిగి యుందురు.ఎవరు బంగారమును,స్త్రీలను చూచినను మనసు చలించక యుందురో అట్టివారు యోగులలో అగ్రగణ్యులని చెప్పబడుదురు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బంగరు పొడగన్న భామల పొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడె పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: బంగారము తాకట్టుపెట్టకు అసలు,వడ్డీ అంటూ మొత్తం లాగేస్తారు.యుద్ధంలోంచీ భయంతో పారిపోయిరాకు.దుకాణములనుండీ సరుకులు అప్పుగా[అరువు]తీసుకోకు. వివేక హీనుడితో స్నేహముచేయకు.సుమతీ శతకపద్యం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జెలిమివలదు వినరా సుమతీ
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సే అన్ని కర్మలకు మూలం. దానిని అదుపులో ఉంచుకోనె మిగిలిన వాటిని జయించాలి. మన మనస్సునే అదుపులో ఉంచుకోలేనప్పుడు బయట వాటిని ఎలా సాదిస్తాం. ఇంట గెలిచాకనే బయట కూడ గెలవాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బంటుతనముగాదు బలముతొగట్టగా వెంటనుండి మనసు వెతలబఱచు ఇంటగెల్చి రచ్చ నిల గెల్వవలెనయా! విశ్వధాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎప్పుడూ బురదలో దొర్లె పందికి గంధం వాసన ఎలా తెలియదో, అలాగే ఏప్పుడూ బండబూతులు మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టెవాడికి మంచి వాళ్ళ విలువ అసలు తెలియదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బండబూతులాడు పరమనీచుండెన్న దండివాని మేల్మి తానెఱుగునె? చందనంబు ఘనత పంది యేమెఱుంగును? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పాడైపోయిన పదార్థాలను నాలుగుబానలతో నూనిపెట్టి వంట చేసినప్పటికీ ఆవంటకు రుచిరాదు. అదేవిధంగా పూర్వపుణ్యం ఉంటే వాళ్ళజీవితం బాగుపడుతుందిగానిఅది లేనప్పుడు ఏమి బాగుపడదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బట్టిపెట్టి నాల్గుబానల చమురుతో వండి శుద్ధిచేయ దండి యగునె పుట్టునందు గల్గు పూర్వపున్యంబున విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పేదవారి కష్టాన్ని తెలుసుకుని వారికి సాయపడని ధనవంతుడి ధనంవల్ల ప్రయోజనమేమిటి?కలిసిరాని బంధువుతో లాభమేమిటి?రోగి వ్యాధిఏమిటో తెలుసుకో లేని వైద్యుడెందుకు?అంటున్నాడువేమన.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బడుగు నెరుగలేని ప్రాభవం బదియేల ప్రోది యిడని బంధు భూతమేల వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల విశ్వదాభిరామ వినురవేమ
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గెదెలు అరిచినట్లు వేదాలు వల్లిస్తే ఫలితమేమి ఉండదు. దానిలో ఉన్న భావార్ధకములు గ్రహించి సార్ధకులు కావాలి. అలా కానట్లైతే వినెవారు వెఱ్ఱివారుగా నెంచుతారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బఱ్ఱెలట్టు లఱవ ఫలమేమి కలదురా? అందు సార్ధకంబు చెందకున్న విన్నవారు వారి వెఱ్ఱులుగా నెంత్రు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నువ్వు కరిరాజు గజేంద్రుడికి బలమై కాపాడావు. ద్రౌపదికి కౌరవులు మాన భంగం చేయు సమయములో చీరలిచ్చి ఆమె మానాన్ని కాపాడావు.సుగ్రీవునికి బలమయ్యావు.నాకూనీవు బలమౌతండ్రీ!
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: బలమెవ్వడు కరి బ్రోవను బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ బలమెవ్వడు రవిసుతునకు బలమెవ్వడు నాకునీవు బలమౌ కృష్ణా
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: బలముంటే బంధువులసాయముంటుంది లేకుంటేశత్రువులౌతారు. మంటల్నిగాలి మరింతపెంచుతుంది.కొంచెమైతే ఆర్పుతుంది.
ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: బలయుతుడైనవేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే బలముతొలంగెనేని తనపాలిటశత్రు వదెట్లుపూర్ణుడై జ్వలనుడుకానగాల్చుతరి సఖ్యముచూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగుపట్టున నార్పదేగాలిభాస్కరా
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైన చీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రపంచంలో చాలామంది తమకు చాలా బలం ఉందని, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉంటారు. ప్రతివారితోనూ అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఎవరు పలకరించినా వారిని తక్కువగా చూస్తూ హేళనగా మాట్లాడతారు. తలనిండా విషం ఉన్న పామును సైతం అతి చిన్నవైన చీమలన్నీ క లిసి చంపేస్తాయి. పాములతో పోలిస్తే చీమలకు బలం కాని శక్తి కాని లేదు. అయినప్పటికీ ఐకమత్యం గల కొన్ని చీమలు కలిసి ఆ విషసర్పాన్ని చంపుతాయి. ఇది లోక ంలో ఉన్న వాస్తవం. అటువంటి వాస్తవంతో పోల్చి, మనుషుల ప్రవర్తనను వివరించాడు బద్దెన తన సుమతీ శతకంలో.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చంద్రుడున్నచో వెన్నెలకాయునేగాని నక్షత్రములెన్నున్న వెలుగులేనట్లే రాజువల్లే సభకు కాంతి.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: బల్లిదుడైన సత్ప్రభువు పాయక యుండిన గాని రచ్చలో జిల్లరవారు నూరుగురు సేరిన దేజము గల్గ దెయ్యెడన్ జల్లని చందురుం డెడసి సన్నపు జుక్కలు కోటియున్న జల్లునే వెన్నెలల్ జగము జీకటులన్నియు బాయ భాస్కరా
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులు ప్రయత్నమేమి లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యము సఫలమవుతుందని సంతోషిస్తారు. ఒకవేళ అవకపోతే తమ కర్మమని వాపోతారు. పనులు ప్రయత్నముతో అవుతాయని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్దం కాదు. శకునాలు విడిచి కష్టపడుట మేలు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బల్లిపలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫలములగు ననుచు సంతసించి, కానిపనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రాహ్మనుడైతే ఏమిటి, భక్తుడైతే ఏమిటి, జోగి ఐతే ఏమిటి, యొగి ఐతే ఏమిటి. యముడు ముందు ఇలాంటి భెదాలేమి ఉండవు. ఎవరి పాపలకు తగ్గట్టు వాళ్ళకి శిక్ష వేస్తూనే ఉంటాడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాపడనగనేమి? భక్తుడనగనేమి? జోగియనగనాఎమి? స్రుక్కనేమి? ఇన్నియేల వెన్కని నజుండు పని తీర్చు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాలుడిగా ఉన్నప్పుడెమో భగవచ్చింతన తగదు. యవ్వనములో సిరి సంపదలు, అందచందాల వెంటపడి తిరుగుతావు. ముసలితనం వచ్చి చావు దగ్గరపడే సరికి శివుడు గుర్తొచ్చి, ఆరాధించడం, అన్వేషించడం మొదలుపెడతావు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాలుడువై యున్నప్పుడు చాలవు, యౌవనమందు సంపదరూపుల్ మేలమౌ, ముదిమియె యే వేళను కడతేర్చు, శివుని వెదకుర వేమా
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పొట్టకూటి కోసం ప్రతిఙలు చేసి, వాటిని పట్టించుకోక, ఇతరులను మోసము చేసి కాలము గడుపుతూ ఉంటారు దుర్జనులు. ఇన్ని చేసిన తరువాత చివరి దశలో మోక్షము కోసము ప్రాకులాడుతుంటారు. వీరికెలా మోక్షము కలుగుతుంది?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బాసలాడనేర్చి పలుమోసములు చేసి గ్రాసమునకు భువిని ఖలుడవైతి దోసకారి! నీకు దొరుకునా మోక్షము? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖుడు తనకు తానే పెద్ద వాడిని గొప్ప వాడినని బింకాలు పోతుంటాడు. కాని అటువంటి వాడికి ఇంటా బయట ఎటువంటి మర్యాద ఉండదు. వాడు చచ్చినా గౌరవం పొందలేడు. గొప్పతనము మనకు ఇతరులు ఇచ్చేది కాని మనకు మనము ఇచ్చుకునేది కాదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకళ్చునకు ఎచ్చు కలుగుదిచట, జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్దిమంతునికి పనికి మాలిన స్నేహము, కార్యసాధకునికి చంచలత్వము, కుత్సితుడికి గురుభక్తి కుదరవు. ఇవన్ని ఒకదానికోకటి వ్యతిరేకమైనవి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బుద్దియతునికేల పొసగని సఖ్యము కార్యవాదికేల కడు చలంబు కుత్సితునకు నేల గురుదేవభక్తి? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బుద్ధిమంతునకు కుదరని స్నేహముతో పనిలేదు. కష్టించి పనిచేయువానికి పట్టుదలలు,పంతాలతో పనిలేదు. అట్లే దుష్టునికి గురువులయందు, దేవతలయందూ భక్తి కుదరదు.అనవసరమని తలతురు.ఇదివేమన పద్యం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బుద్ధియుతునకేల పొసగని సఖ్యంబు కార్యవాదికేల కడుచలంబు కుత్సితునకేల గురుదేవతాభక్తి విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బూటకపు మాటలు చెపుతూ, నాటకాలాడి, దొంగ వినయము చూపి, వంచన చేస్తూ తమకెదురు లేదనే గర్వంతో తిరుగుచుంటారు కొందరు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బూటకంబు చేత బుడమిలో నొకకొన్ని నాటకంబు లాడి నయముచూపి దీటులేక తాము తిరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారా, దయలో సముద్రమువంటివాడా, అబద్ధం చెప్పనివాడు గొప్పవాడు, యోగ్యుడూను. శత్రువు బాగా దగ్గరకు వచ్చినప్పటికీ భయపడని వాడే వీరుడు, ధీరుడూను. యాచకుడు చేయి చాచి దానం అడిగినప్పుడు మంచిమనసుతో దానం చేసేవాడే అసలయిన దాత. నిన్ను పూజించేవాడే అనుమానం లేని మనసు ఉన్నవాడు (నిర్మలమైన మనసు కలిగినవాడు).
ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: బొంకని వాడె యోగ్యుడరి పుంజములెత్తినచోట జివ్వకున్ జంకని వాడె జోదు రభసంబున నర్థికరంబు సాచినన్ గొంకని వాడె దాత మిము గొల్చి భజించిన వాడె పో నిరా తంక మనస్కుడెన్నగను దాశరథీ కరుణాపయోనిధీ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నాడీ పద్యంలో వేమన. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు. ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలి ఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన. బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు. అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది. ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం. భక్తి అంటే అంకితభావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ శరిరాన్ని నమ్మి, మంచి ఆహారమిచ్చి పోషించి మళ్ళి దేవుని పేరుమీద ఉపవాసాలతో శుష్కింపజేయడం మహా పాపం. తన హృదయంలో మనస్పూర్తిగా భక్తిని నిలిపితే అదే మోక్షం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొంది నమ్మి మిగులు బోషించి పలుమాఱు ప్రాణి విడుచుటెల్ల బాతకంబె తనదులోన భక్తి దనరటే మొక్షము విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరంఎంతపోషించినా చూస్తూండగానే ముసలిదయిపోతోంది.ప్రాణంఎలా వచ్చిందోఅలాగేపోతోంది,ధనము మనదనిప్రేమిస్తే అనుకోనిఖర్చులొచ్చి కరిగి పోతోంది.ధర్మమేమిగిలిమనతో పుణ్యం గావస్తుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొందిఎవరిసొమ్ము పోషింపబలుమారు బ్రాణమెవరిసొమ్ము భక్తిసేయ ధనముఎవరిసొమ్ము ధర్మమేతనసొమ్ము విశ్వదాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేశ్య కల్లబొల్లి మాటలు చెప్పి విటుని ఇల్లు గుల్ల చేసి, దరిద్రుని చేసి, తర్వాత వెల్లి రమ్మంటూ తన ఇంటినుంచి వెళ్ళగొడుతుంది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బొల్లి మాటలాడు బోగముదానితో దొల్లి డుల్ల నిల్లు గుల్లజేసి వెళ్ళి రమ్మటంచు వెడలించు నింటిని విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తలను బోడిగా చేసుకున్నా, విభూతి పూతలు పూసుకున్నా, ఎంతగా యోగ విద్యలు ప్రదర్శించినా, ప్రాణాయామాయాలు చేసినా మనసులోని మాలిన్యాలు తొలగిపోకుండా ఎవరూ యోగి కాజాలరు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: బోడి తలలు నెల్ల బూడిద పూతలు నాసనముల మారుతాశనముల యోగిగాడు లోను బాగు గాకుండిన విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఙానము పొందాలంటే నిష్టగా కష్టపడి ప్రయత్నించాలి. లేదంటే బొనులో ఉన్న ఎలుక ఎలగైతె బయటకు పోవాలని దారులు వెతుకుతుందో మనసు కూడ అలాగే చేసె పని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బోనులోన యెలుక పోజూచునట్టుల ఙానమొంద ఎఱుక చనును మీద గాన మేను మఱచి ఘనతత్వమందరా విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రతుకు శాశ్వతమని భావించి విర్రవీగుచూ తిరిగేవాడు వెఱ్ఱివాడు.భూమిమీద ఉన్న ప్రాణులందరు యముని కత్తిముందు గొఱ్ఱెలే.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బ్రతుకు నిత్యమనుచు బదరుచు వగమీఱ విఱ్ఱవీగువాడు వెఱ్ఱివాడు ప్రాణులెల్ల యముని బారికి గొఱ్ఱెలు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దైవం ఎక్కడ, బ్రహ్మం ఎక్కడ అని పదే పదే అడుగుతూ ఉంటారు మూర్ఖజనులు, సమస్తమంతా బ్రహ్మతో నిండియుండగా అనుమానం ఎందుకో?
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: బ్రహమ్మేడ ననుచు బలుమాఱు నాడేరు వెఱ్ఱిమూర్ఖ జనులు విధముచూడ బ్రహ్మ మన్నిట దగు పరిపూర్ణమై యుండ విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: యుద్ధము చేయుటలో ఆరితేరిన భయంకరుడు, దుఃఖములో ఆర్తితో నున్నవారిని అక్కున జేర్చుకునే ఆత్మబంధువు. బాణప్రయోగ విద్యయందును, భుజ బలము నందును రామునకు దీటైన దేవుడు మరియొకడు లేడు గాక లేడని మదగజము నెక్కి 'డాం డాం' అంటూ డప్పు కొట్టి ప్రపంచమంతటా చాటింపు వేస్తాను.దశరధ రామా! కరుణా సముద్రా!ఇది దాశరధీ శతకం లోని పద్యం.కవి రామదాసుగా పేరుపొందిన గోపన్న.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనుకూలవతి అయిన భార్య దోరికిందా అతడు అదృష్టవంతుడే. అటువంటి భార్య మూలంగా భక్తి, ముక్తి, భాగ్యము మూడు కలుగుతాయి. కాని భర్త మనస్సు గ్రహించలేని భార్యతో సంసారం వ్యర్ధము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: భక్తి ముక్తి కలుగు భాగ్యంబు కలుగును చిత్తమెఱుగు పడతి చెంత బతికి చిత్తమెఱుగని సతి జేరంగరాదురా విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, నీవు నా విషయమై "వీడు సంసార సుఖములయందాసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినాడు, నన్ను యెరగకున్నాడు, మహాపాపాత్ముడై యున్నాడు, వీనితో నాకేమి?" అని తలచుచున్నావు. నేను నరకసముద్రములో పడియున్నను పట్టించుకొనకున్నావు. ఇది నీకు తగునా! తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవశ్యములో, యెరుగక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యెనో విచారింపక, వానిని నూతినుండి బయటకు తీయకుండ ఊరకుండునా!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భవకేలీమదిరామదంబున మహా పాపాత్ముఁడై వీడు న న్ను వివేకింపఁ డటంచు నేను నరకార్ణోరాశిపాలైనఁ బ ట్టవు; బాలుండొకచోట నాటతమితోడ న్నూతఁ గూలంగఁ దం డ్రి విచారింపక యుండునా కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సంసారదుఃఖములు తొలగుట నీ పాదపద్మస్తుతిచేతనే అగును కాని నీ ముందు కీటకములవంటి వారగు రాజులను స్తుతించుటచే కాదు. ఎట్లన పసివారికి తమ తల్లులు వాత్సల్యముతో దయాభావముతో ఇచ్చు స్తన్యమును త్రాగుటచే వారి ఆకలిదప్పులు తీరునే కాని మేకల మెడలనుండి వ్రేలాడు చంటినుండి తీరవు కదా!
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భవదుఃఖంబులు రాజకీటముల నేబ్రార్ధించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్యద్బ ష్థివిశేషంబున నిచ్చి చంటఁబలె నో శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']