inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! విభూతి ధూళి రేగునట్లు పూసికొనుటచే దుమ్ముతో నిండిన శరీరము కలవారు, తమ తలలపై ఉన్న జడల బరువుతో నిండిన తమ శిరస్సులు కలవారు, శివతత్త్వమునే నిరంతరము భావన చేయుట అను తపమునందే మునిగి చిక్కుకొనియుండు అంతఃకరణవృత్తులు కలవారు, తమ నాలుకలపై పంచాక్షరీమంత్రమును నిలుపుకొని జపసిద్ధి పొందినవారు ప్రాపంచిక సుఖముల విరక్తి నొందినవారు, తమకు ఏమియున్నను లేకున్నను ఉన్నదానితోనే ఆనందముతో నుండువారు సత్యమునే పలుకువారు, మిగుల ప్రకాశించుచుండు రత్నములవలె శ్రేష్ఠరుద్రాక్ష పంక్తులతో కూడిన వారును అగునట్టి నీ భక్తులు ఎవ్వరు అయినను వారి యితరము లగు భేదములను ఎన్నక వారిని సేవింతును.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: భసితోద్ధూళనధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపో వ్యసనముల్ సాధితపంచవర్ణరసముల్ వైరాగ్యవంతుల్ నితాం తసుఖస్వాంతులు సత్యభాషణలు నుద్యద్రత్నరుద్రాక్షరా జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రాక్షసాంతక రామా!సూర్యుడుదయించగానే చంద్ర,అగ్నితేజస్సులు వెలవెలపోయినట్లు నీపదధ్యానము చేసినయెడల ఇతరదేవతలకాంతు లణగిపోవును.గోపన్న.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్రతేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీపద ధ్యానముచేయుచున్న బరదైవమరీచు లడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా.
ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైన భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను, భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా అగును అని భావం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు, రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పాలకుడు సమర్థుడు కాకపోతే ప్రజలకు మేలు జరగదు. మహాభారతంలో కౌరవులవైపు అతిరథ మహారథులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యుల వంటి వారెందరో ఉన్నారు. అయినా, ఏం లాభం? ప్రభువు దుర్యోధనుడి బుద్ధిలోనే ఉంది కదా అసలు లోపం. మంత్రులు, ప్రధానులు ఎంత ప్రజ్ఞాదురంధరులైతేనేం, పాలకుడు సమర్థుడైనప్పుడే కార్యాలు చెల్లుతాయి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: భూపతికాత్మబుద్ధి మదిబుట్టని చోట ప్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై యోపిన ద్రోణభీష్మ కృపయోధులనేకులు కూడి కౌరవ క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగలవారు భాస్కరా!!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రాజశ్రేష్టుడవైనరామా!ముల్లోకాలలో రాజ్యము స్థాపించిన రామా!మోక్షాన్ని ఇవ్వగల రామా!ఓసీతాపతిరామా!నిన్ను స్టుతిస్తాను.పాపాలుపోగొట్టు.గోపన్న
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: భూపలలామరామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్ బాపగదయ్యరామ నినుప్రస్థుతి చేసెదనయ్యరామసీ తాపతిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతుఁజూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: అర్జనుడెంతగొప్పవిలుకాడైననూ క్రిష్ణనిర్యాణానంతరము కృష్ణునిభార్యలను బోయవారినుండీ కాపాడలేకపోయెను.దైవబలంముఖ్యం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: భూరి బలాఢ్యుడైన దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవుగాదతడొక్కెడ మోసపోవుగా వీరవరేణ్యుడర్జనుడు వింటికినేనధికుండనంచుదా నూరక వింటినెక్కిడగనోపడు కృష్ణుడులేమి భాస్కరా
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మొక్కకు నీళ్ళు పోయకుండా మల్లెపూలు పూస్తాయా? అలాగే వంట వండకుండా వంటకం దోరుకుతుందా? ఎదైనా పొందాలంటే కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఫలితం పొందాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచినీరు పోయ మల్లెపూచునుగాని ఫలిత మొనరుటెట్లు పని జొరమిని వంటచేయకెట్లు వంటక మబ్బును? విశ్వదాభి రామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు దోరకడం చాలా కష్టం. అదే చెడ్డవాళ్ళైతే ప్రతిచోట కనపడుతూ ఉంటారు. లోకంలో మంచి బంగారం దోరకడం కష్టం కాని బూడిద దోరకడం చాలా తేలిక.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచివారు లేరు మహిమీద వెదికిన కష్టులెందఱైనగలరు భువిని పసిడి లేదుగాని పదడెంత లేదయా! విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి శకునాన్ని ముహుర్తాన్ని జూసి లోకంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు, అయినప్పటికీ మంచిచెడ్డలు జరుగుతూనే ఉంటాయి. మనుష్యుల కర్మలని శకునాలు అడ్డుకుంటాయా? అనుభవించి తీరవలసిందే.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంచిశకునములని యెంచి పెండిలి సేయు వారె కానివారు లేరు వసుధలోన జనుల కర్మములకు శకునముల్ నిల్పున? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో తిరిగి, చివరికి మట్టిలోనే కలిసిపోతున్నాడు. మనిషి అనేవాడు మట్టిలో కలవడమే తత్వము. ఇది తప్పుబట్టరాని నిజం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంటిలోన బుట్టి మంటిలోన బెరిగి మంటిలోనె దిరిగి మనుజుడాయె మన్నుమంటి గలువ మనుజుడే తత్వము విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోటికొచ్చిన కొన్ని మంత్రాలు జపించి, కాసేపు దేవతారాధన చేసి, తామింకా గొప్పవాళ్ళమైపొయామని తలచి వేద పఠనము మొదలు పెడతారు. ఇదంతా వెఱ్ఱితనము. మంత్ర తంత్రాల వలన కరుణ జనించదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మంత్ర మొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకు గరుణ చెందినదని వేదపఠన చేసి వెఱ్ఱులైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: మొసలి నోట్లో దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అసాధ్యం అని భావం.
ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన సౌందర్యం కలవాడా! ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం. చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: మగ మీనమువై జలధిని పగతుని సోమకుని జంపి పద్మ భవునకు న్నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమి లేమి రెండు గల వెంతవారికి విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మర్యాద తెలియని వాని ఇంటికి స్వయంగా దేవేంద్రుడు వెళ్ళినా అతనిని గౌరవించరు. అవమానించి పంపివేస్తారు. దారివేంట తిరిగే ఊర కుక్క మొఱుగుతూ యోగి వెంటపడుతుంది. అతని గొప్పతనం కుక్కకేమి తెలుస్తుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మఘవుడైననేమి? మర్యాదయెఱుగని వారలేల తెలిసి గౌరవింత్రు ఉరిమి మొఱుగుకుక్క యొగినేమెఱుగురా విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: అత్యుతా! కృష్ణా! నీవు మడుగులోదూకి కాళీయుడను విషసర్పముతలలపై భరతశాస్త్ర రీతిలో ఆనందముగా నాట్యమాడితివి కదా!ఆనీ పాదములను నేను మనసులో నిలిపి ధ్యాన్నించు చున్నాను.కృష్ణశతకం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: మడుగుకు జని కాళింగుని పడగలపై భరతశాస్త్ర పధ్ధతి వెలయం గడువేడుకతో నాడెడు నడుగులు నేమదిని దాల్తు నత్యుత!కృష్ణా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తాను అనుచరించే మతంపై నమ్మకం ఉండడంవలన ఆ మతం పేరుతో జరిగే మాయల్ని తెలుసుకోలేక పోతున్నాడు. మనిషిలో గర్వం పెరిగినప్పుడు తనని తాను మరిచిపోయి తిరుగుతూ ఉంటాడు. వీటివలన బుధ్ధిలేని పనులు చేస్తూ చెడిపోతాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మతముచేత లోకమాయల తెలియక మదముచేత తన్నుమరచు నెపుడు బుధ్ధిలేనిపనులు బధ్ధులై చెడుదురు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మదపుటేనుగులును, అందలములును, అశ్వములును, మణులును, పల్లకులును, సుందరులగు స్త్రీలును, మేలగు సన్నని వస్త్రములును, సుగంధద్రవ్యములును మోక్షమునీయగలవా! ఇది ఆలోచించని అవివేకులు కొందరు ఇవి కావలయునని, అవి లభించునన్న విశ్వాసముతో రాజభవనద్వారప్రదేశమున కాచి వేచి యుండి దినములను వ్యర్ధముగ గడుపుచుందురు.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మదమాతంగము లందలంబుల హరుల్ మాణిక్యము ల్పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునే? మదిలో వీని నపేక్షసేసి నృపధామద్వారదేశంబుఁ గా చి దినంబుల్ వృధపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒళ్ళంతా మదమెక్కి ప్రగల్భాలు పలుకుతూ, మాయ మాటలతో పరులను మోసగించి వారి ధనాన్ని ఆర్జించే వాడు ఎక్క్డైనా గురువు అవుతాడా? కీనె కాడు. అలాంటి వాణ్ణి గురువుగా స్వీకరించడం మూర్ఖత్వం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మదమువలన గలుగు మాటలు మఱి పల్కి మ్రుచ్చు సుద్దలు నొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: కూడావచ్చినకుక్కను ధర్మజుడుముందుగా విమానమున కూర్చుండబెట్టెను. తన్నాశ్రయించినవారిని మంచివారాదరింతురు.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: మదిదను నాసపడ్డయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్ వదలడు మేలుపట్టున నవశ్యముమున్నుగ నాదరించుగా త్రిదశ విమానమధ్యమున దెచ్చికృపామతి సారమేయమున్ మొదలనిడండె ధర్మజుడు మూగిసురావళిచూడ భాస్కరా
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సు,బుద్ధి పనిచేస్తున్నప్పుడే ఆయాసంవంటి కఫరోగాలురాకముందే శరీర పటుత్వంతగ్గకముందే మోక్షసాధనచెయ్యాలి మానితేకీడే.గోపన్న
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: మనమున నూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంతటి మేనిబిగిదప్పకమున్నె నరుండుమోక్షసా ధన మొనరింపగావలయు దత్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెట్టునాటిన వెంటనే ఎక్కడైనా కాయ కాస్తుందా? కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. అలా ఆగితే తప్పకుండా ఫలం పొందవచ్చును. అదే విధంగా స్థిరంగా కొంత కాలం మనస్సును భగవంతునియందు నిమగ్నం చేసిన మోక్షం దొరుకుతుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసునంటి నిలిచి మనసున సుఖియింప గడకు మోక్షపదవిగనకపోడు చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అట్లా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగినవాడే నిజమైన యోగి అవుతాడు అంటున్నాడు వేమన. మనసు అంటే చిత్తం, హృదయం అని అర్థాలున్నా తాత్వికంగా చెప్పాలంటే ఇది జీవాత్మ కంటే భిన్నమైన జ్ఞాన జనక ద్రవ్యం. దీనికి మనన ధర్మం ఉంటుంది. దీనికో రూపం ఉండదు కాబట్టి ఇంద్రియాల ద్వారానే వ్యక్తమౌతుంది. లోకంలో ప్రేమికులు మనసును పారేసుకున్నామంటారు. ఇది కవితాత్మకంగా చెప్పడం. నిజానికి పారేసుకునేది తలపులనే కాని మనసుని కాదు. మమత అంటే నాది అనే అభిమానం. దీనిని నిర్దాక్షిణ్యంగా తీసేసుకోవాలి. కోసి అనే మాట వాడాడు వేమన. దృఢం చేసి అంటే పటిష్ఠ పరచుకొని. తేట అంటే స్వచ్ఛత, నిర్మలత్వం. తేట అంటే ఒక పదార్థంలోని సారం. ద్రవ పదార్థాలపైన తేరే భాగాన్ని తేట అంటారు. అట్లా పరిశుభ్రమైన మనస్సుతో శరీరాన్ని నిర్వహించుకోవాలి. ఇక ఘటం. ఘటం అంటే కుండ. ఇది దేహానికి సంకేతం. ఘటం అనేది శరీరానికి వేదాంత పరిభాష. ఘటం అంటే కుంభకం అనే ఒక ప్రాణాయామ భేదం కూడ. ఘనం అంటే దృఢత్వం, దిటవు అని అర్థాలు. గట్టిదైన అని. తోడుకొన్న పెరుగులో పైదీ కిందదీ కాక నడిమి గట్టి భాగాన్ని ఘనం అంటారు. ఘనతరం అంటే మరింత గట్టిదని. యోగ సాధనకు ముందుగా కావల్సినవి నిర్మమమత్వం, మానసిక నిర్మలత్వం. ఇవి పూజకు ముందు ఇల్లు అలకటం లాంటివి. ‘మనసులోన నున్న మర్మమెల్ల దెలసి, దిట్టపరచి మనసు తేటజేసి అనేవి పాఠాంతరాలు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసులోన నున్న మమతలన్నియు గోసి దృఢము చేసి మనసు తేటపరచి ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా విశ్వదాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సె ముక్తి మార్గం. అది తెలియక మూర్ఖులు దేవాలయలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్ధయాత్రలికి తిరుగుతూ ఉంటారు. అది గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని ఊరంత వెతికినట్టు ఉంటుంది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మనసులోని ముక్తి మఱియొక్కచేటను వెదకబోవువాడు వెఱ్ఱివాడు గొఱ్ఱె జంకబెట్టి గొల్ల వెదకురీతి విశ్వదాభి రామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మరణం గురించి అంతలా ఎందుకు భయపడతారు. యుగయుగాలుగా మనకన్నా మహమహులెందరో మరణిస్తానే ఉన్నారు కదా? వారెం చేయలెకపొయిన దాన్ని మీరెం చేయగలరు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మరణమన్న వెఱచి మది కలంగగనేల నిరుడు ముందటేడు నిన్న మొన్న తనువు విడుచి నతడు తనకన్న తక్కువా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు శ్రమపడుచు స్త్రీలతో కామసుఖములననుభవించు ప్రయత్నములో మునిగియుందురు. ఇది యోగసాధనములోని అంశమా ఏమి? స్త్రీ దేహాంశములలో ఈ కామసుఖస్థానము మలమూత్రాది మాలిన్యములతో నిండియుండు చోటే కాని సుషుమ్నా నాడీద్వారము కాదు. బొడ్డునుండి పైన కనబడు ’నూగారు’ అనబడు రోమరేఖ ’కుండలినీ’ కాదు. రెండు పాదములు, రెండు చేతులు రెండు కన్నులును పద్మములతో పోల్చి ఆనందింతురు. అవి మూలధారము మొదలైన ఆరు పద్మములు కావు కదా. ముఖమును పద్మముతో సమమని బావించి అందు ఆసక్తి చెందుదురు. అది వాస్తవ సహస్రారపద్మమా? కాదు. నుదురును అష్టమీచంద్రరేఖగా భావింతురు. అది వాస్తవమగు చంద్రరేఖ కానే కాదు. సంభోగప్రక్రియ యోగసాధనము కాదు. దేవా! నన్నట్టి మోహమునుండి తప్పింపుము. నిన్ను సేవించి తరించగల్గునట్లు అనుగ్రహింపుము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మలభూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో యారు కుం డలియో పాదకరాక్షియుగ్మంబులు షట్కంజంబులో మోము దా జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ గా సిలి సేవింతురు కాంతలన్ భువి జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాటమీద నిలువని వాడు నీచుడు. అలానే ఆఙ ఇవ్వలేని రాజు వల్ల ప్రయొజనం లేదు. వరములివ్వని ఇంటి వేల్పు మట్టితో చేసిన పులితో సమానం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాట నిలుపలేని మహితుండు చండాలు డాఙ్లేని నాధు డాడుముండ మహిమలేని వేల్పు మంటిజేసిన పులి విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మాటకు సత్యము,కోటకు మంచి భటుల సమూహము, స్త్రీకి సిగ్గు, ఉత్తరమునకు సంతకము ప్రాణము వలె ముఖ్యమైనవని అర్ధము.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి పరగ ప్రియము జెప్పి బడలకున్న నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా? విశ్వదాభిరామ! వినుర వేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు ఏవేవోమాట్లాడతారు. మనసుఆమాటలకి కట్టుబడిఉండదు. ఏవేవో చెప్తారుగాని తమమనసు ఏమిటో ఎవరికీ తెలియనివ్వరు.కత్తి చేతబట్టినంత మాత్రాన అతడువీరుడని చెప్పలేముకదా!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడగ వచ్చు మనసు నిల్పగరాదు తెలుపవచ్చు దన్ను దెలియరాదు సురియు బట్టవచ్చు శూరుండు గారాదు విశ్వదాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారు ఒకటి చెప్పి మరొకటి చేస్తుంటారు. మనస్సులో ఒకటి పెట్టుకుని నడతలో మరొకటి పాటిస్తారు.ఇట్లాంటి నీచులకు ముక్తి ఎలా లభిస్తుంది. మనం నమ్మిన దాన్ని మనసా వాచ పాటించడమే ముక్తికి నిజమైన మార్గం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో ఉన్నది ఒకటి , పైకి మాటాదేది మరొకటి. తన గుణము ఒకటి, అలోచన వేరొకటి ఉన్నవానికి మోక్షము దొరకదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలాగు తానుండ విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఓయి మిత్రమా!నే చెప్పు హితమాలింపుము.ధనము లేనిచో తల్లి దూషించును; తండ్రి మెచ్చుకొనడు; సోదరులు మాట్లాడరు; సేవకుడు మిడిసిపడును; కుమారుడును చెప్పినమాట వినడు; భార్య దగ్గరకు చేరబోదు; బదులు అడుగుననే శంకతో మిత్రులు మాట కూడ ఆడరారు; గనుక ధనము ఆర్జింపుము. ధనమునకు అందరూ వశులగుదురు. అదన్నమాట సంగతి. అందుకే ధనసంపాదన కోసం మనం ఇన్ని పాట్లు పడేది.కాని అదే అంత ముఖ్యమా? దానిని మించిన విలువలు ఇంకా ఎన్నో ఉన్నాయే.మరి వాటి సంగతి? ఇది ఎవరికి వారుగా నిర్ణయించుకోవలసిన విషయం.
ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే! భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే! అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్! తస్మా దర్థ ముపార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాదిగలనగానే ఎంతో చులకనగా చూస్తారు మూర్ఖులు. పురాణాలను చూస్తే మాదిగ దేవతలకు మామ కదా! అంతెందుకు మాదిగలలో పుట్టిన బిడ్డే మన అరుంధతి కదా! ప్రతి నవదంపతులకె చూపె దేవత తనే. కాబట్టి మనుషులందరు సమానమనే సత్యం తెలుసుకోవడం ముఖ్యం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాదిగయనగనె మఱి తక్కువందురు మాదికయిలసురుల మామ గాదె మాదిగకును బిడ్డ మన యరుంధతి గదా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అభిమానము గలవాడు ధైర్యము వదిలి ఒక దుర్మార్గుడి కింద పనిచేయుట అనగా మానెడు[లీటర్]నీళ్ళల్లో ఒక ఏనుగు శరీరాన్ని దాచినట్లుగా ఉంటుందని కవి బద్దెన అంటున్నాడు. ఈపద్యంలో.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: మానధను డాత్మధృతి చెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెండు జలము లోపల నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పెరట్లో మల్లెపాదును వేసి, దాని నీటికోసము బావి తవ్వి, అది ఎదిగి పెద్దదయ్యాక, దానికింద పందిరి వేసి, ఆ పందిరి కింద మంచము వేసి, దాని మీద మంచి భామతో సరససల్లపములు సాగిస్తామని మనస్సునందు ఊహించుకోంటూ ఉంటారు మూర్ఖులు. అటువంటి ఊహల మూలంగా కాలము వ్యర్ధమేగాని ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి ఊహలు కట్టిపెట్టి కష్టపడుట మేలు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మానసమున మంచి మల్లెపూలచవికె బావితోటజేసి బాలగూడి భోగినయ్యెదనన బోయె బోకాలంబు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భూములిచ్చే వారొక్కరైనా ఉండరు కానీ, ఆక్రమణకైతే సిద్ధం. బంజర్ల గోడు ఎవరికీ పట్టదు కానీ పండిన పంటలకైతే ముందుంటారు. పేదవారిని పట్టించుకొనే వారుండరు కానీ సంపన్నుల సిరులైతే కావాలి. తమ భార్యల తప్పులు పట్టవు కానీ, పరస్త్రీలపట్ల చింత ఒలకబోస్తారు. ఇలాంటి వారిని అందలమెక్కించే ముందు ప్రభువులే ఆలోచించాలి కదా స్వామీ!
ఇచ్చిన అర్ధం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత, యెండిన యూళ్ల గోడెఱిగింప డెవ్వడు, బండిన యూళ్లకు బ్రభువులంత, యితడు పేదయటంచు నెఱింగింప డెవ్వడు, గలవారి సిరులెన్నగలరు చాల, దన యాలి చేష్టలదప్పెన్న డెవ్వడు బెఱకాంత తప్పెన్న బెద్దలంత, యిట్టి దుష్టు కధికార మిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నాపాపములు లెక్కలేనివి చిత్రగుప్తుడేమని వ్రాయునో యముడేశిక్షవేయునో ముందుగా తెలియదు.రామా! నిన్నేనమ్మాను.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: మామక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తుడే మేమని వ్రాయునో శమనుడేమి విధించునో కాలకింకర స్తోమ మొనర్చుటేమొ విన జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లు గాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ) జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాలజాతి వాని చేత మాలకాడు. జగత్తులో ప్రతిపూట మాట తప్పిన వాడే మాల. పైగా మాల జాతిలో పుట్టిన వాడిని మాల అని నిందిస్తే అలా అన్న వాడే భూమి మీద అతిపెద్ద మాలవాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాల మాల కాడు మహిమీద నేప్రొద్దు మాట తిరుగు వాడె మాల గాక వాని మాల యన్న వాడె పో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తక్కువ కులంవాడైన మంచిగుణమున్న వ్యక్తే మేలు. మనం చేసే పనులు మన గుణాన్ని నిర్ణయిస్తాయి కాని వేరొకటి కాదు. కావున గుణమే ప్రదానం కాని కులం కాదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాల మేలు గుణము మంచిది గల్గిన మాలకూడు గుడుచు మనుజుకంటె గుణమే మేలుకాని కులమేమి మేలురా? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మాసినబట్టలతో,మలిన దేహముతో అశుభ్రమైన పనులుచేయువారిని ఎంతటి ఉన్నతకులస్థుడైనను చూచిఅసహ్యించుకొని దరికిరానియ్యక పొమ్మందురు.పరిశుభ్రతే ఆచారమయింది. వేమనశతక పద్యము
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మాసినపనితోడ మలినవస్త్రముతోడ యొడలు జిడ్డుతోడ నుండెనేని యగ్రజన్ముడైన నట్టె పొమ్మందురు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సత్పురుషులు మ్రుదుస్వభావము గలిగియున్నను వారిమనసులో కోపముండును. ఇందుకు ఋషులు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెరపకాయ చూడ్డానికి ఎర్రగా ఉన్నా కొరికితే నోరు మండుతుందికదా!అలాగే
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరపకాయ జూడ మీద నెర్రగ నుండు గొరికి చూడ లోన జురుకు మనును సజ్జను లగువారి సారమిట్టులనుండు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరపగింజచూడ మీద నల్లగనుండు కొరికిచూడు లోనచురుకు మనును సజ్జను లగునారి సారమిట్లుండురా విశ్వదాభిరామ! వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు కొఱికి చూడ లోనంజుఱు మనును సజ్జనులగువారి సార మిట్లుండురా విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నెత్తిన గుండు కొట్టిచ్చుకొని పెద్దలమని పవిత్రులమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఎంత శుద్దిగా కనిపించిన మనసులో మాత్రం శుభ్రత ఉండదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మీది యీకతీసి మిగులు పెద్దలమని కానరాక తిరుగు కర్మజనులు బయలు కోరినట్లు భావంబు గోరరు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: శరీరమునకు తగిలిన గాయలు తగ్గించడానికి, మాన్పడానికి ఈ లోకంలో మందులు దొరుకుతాయి కాని, మనసుకి తగిలిన గాయాలు మాన్పె మందులు ఎక్కడా దొరకవు. కాబట్టి ఎవరి మనస్సుని నొప్పించకుండా , సుటి పోటి మాటలతో భాద పెట్టకుండా ఉండటం మానవత్వం.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముందరి పోటుల మాన్పను మందెందైనను గలుగును మహిలోపల నీ నిందల పోటుల మాన్పను మందెచ్చటనైన గలదె మహిలో వేమా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గయ్యాలితనము గల భార్య దొరికిన వాడు, ఆమెను భరించలేక దేశాలు పట్టి తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాని తల్లిదండ్రులెమై పోతారో అని తలుచుకుంటుంటే భాద కలుగుతుంది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముక్కుపట్టి యీడ్చు ముండను చేపట్టి తిక్కయెత్తి నరుడు తిరుగుచుండు ఎక్కడి తల్లిదండ్రు లేమైన దనకేల? విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముక్తి గాని, భక్తి గాని మరియు శక్తి గాని ఒకరికి సంబందించినవి కాదు. మనం ఒకరి దగ్గరనుంచి ఇవన్ని తీసుకోలేము. ఇవన్ని యుక్తితోనూ కష్టంతోను సాధించాల్సినవే.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముక్తి ఎవరిసొమ్ము ముక్కుమీదుగజూడ భక్తి యెవరిసొమ్ము భజనచేయ శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందమైన అమ్మాయిని ముసలివానికిచ్చి పెళ్ళి చేస్తే మనస్సు అదుపులో ఉండక వేరొకరి చెంతకు చేరుతుంది. అలానే వెర్రిమొద్దుకు వేదశాస్త్రాలు నేర్పించడం దేనికి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముద్దుగుమ్మకేల ముసలి మగడు మది వసము గాక విటుని వలను జిక్కు వెఱ్ఱి మొద్దునకును వేదశాస్త్రములేల? విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తత్వము తెలియని మూర్ఖులు పుణ్యతీర్ధాలలో మునిగినా, కాకులవలే దేవాలయాలన్ని తిరిగినా, కడుపు కాల్చుకుని ఉపవాసాలు చేసినా ముక్తి లభించదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మునిగి మునిగి మునిగి ముద్దయై ముద్దయై వనరి వనరి వనరి పక్కి పక్కి తిరిగి తిరిగి తిరిగి దిమ్మరైపోదురు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైన నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ గన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరికైనాపాపఫలము మరుజన్మలోనైన అనుభవించాలీ.రాముడు చెట్టుచాటునుండీవాలినిచంపిన పాపము కృష్ణునిగా బోయవానిచే చంపబడెను.
ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: మునుపొనరించుపాతక మమోఘముజీవులకెల్ల బూనియా వెనుకటిజన్మమం దనుభవింపకతీరదు రాఘవుండు వా లినిబడవేసితామగుడలీల యదూద్భవుడై కిరాతుచే వినిశితబాణపాతమున వీడ్కొనడేతనమేను భాస్కరా
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉదయాన్నే జన్మనిచ్చిన తల్లి తండ్రులను పూజించి, ఆ తరువాత ఙానముని అందించిన గురువుని పూజించి కార్యాలు మొదలు పెట్టాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ, వారి సన్నుతించి పిదప సంతతమును ఙాన దాత గొల్వ ఘనతచే విబుధిని విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ప్రాణముకొరకు యమభటులొచ్చినప్పుడు.రోగముతో గొంతులోశ్లేష్మ మడ్డుకున్నప్పుడు,బంధువులున్నప్పుడు మీస్మరణకలుగదు ఇప్పుడేచేస్తాను
ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ముప్పున కాలకింకరులు ముంగిటనిల్చినవేళ రోగముల్ గొప్పరమైనచో కఫముకుత్తుక నిండినవేళ బాంధవుల్ గప్పినవేళ మీస్మరణ గల్గునోగల్గదో నాటికిప్పుడే తప్పకచేతుమీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వాక్కు, దృశ్యము, ద్రష్ట వీటిని త్రిగుణాలంటారు. వీటిని మనము ఎల్ల వేళలా ఆధినంలో ఉంచుకోవాలి. అలా కానట్లైతే తాడుని తొక్కి పాము అని భ్రాంతి పడె మనిషిలాగ ఉంటుంది జీవితం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మూడు గుణములంటు మూలంబు గనవలె వీలుగాను త్రిపుటి వెలయనొక్కి త్రాడుత్రొక్కి బాము దలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టక ఏదో దొరికిన నాలుగు గడ్డిపరకలు మేస్తూ జీవించే జింకలకు అకారణ విరోధులు బోయవాళ్ళు. నీటిలో దొరికిన మేతతో బతికే చేపలకు అకారణ వైరం పూని వలవేసి పట్టేవారు జాలరులు ఇతరుల జోలికి పోక తనమానాన బ్రతికే సజ్జనుల్ని నిష్కారణంగా పీడించేవారు కొండెగాళ్ళు ఇదీ లోకరీతి. అని భావం
ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: మృగమీన సజ్జనానాం తృణ జలసన్తేష విహితవృత్తీనామ్ లుబ్దకధీవరపిశునా నిష్కా రణమేవ వైరిణో జగతి
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నోరులేని మృగాలు అపాయం తలపెడతాయని వాటిని ద్వేషిస్తారు, వేటాడి చంపుతారు. కాని మూర్ఖులు మృగము కంటే అపాయం అని తెలుసుకోలేరు. మృగము తన ఆకలి కోసం వేటాడి అది తీరిన వెంటనే ఇంకెవరి జోలికి వెళ్ళదు. కాని మూర్ఖులు అలా కాదు తమ ద్వేషం చల్లారేదాకా హింసిస్తూనే ఉంటారు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగముకన్నజెడ్డ మూర్ఖుడగును మృగముకన్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రకాశించు సూర్యుని మేఘము లడ్డమొచ్చిన కాంతిమరుగవును.చిత్త చాంచల్యము[మనోవికారములు బుద్ధినిచెరిచి]స్థిరత్వము తొలగును.అజ్ఞానము జ్ఞానమును పోగొట్టి ముక్తినిచెరచును.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మేఘ మడ్డమయిన మిహిరుని జెరుచును చిత్త మడ్డమయిన స్థిరము జెరుచు మరపు లడ్డమయిన మరిముక్తి జెరుచురా విశ్వదాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మురికిగా ఉన్న బట్టలతోటి, మాసిన తలతోటి, ఒంటినిండా మురికి పట్టిన వాడు ఉత్తమ కులముకలవాడే అయినా వాడిని ఎవరు గౌరవించరు. కాబట్టి పరిశుభ్రంగా ఉండటం మనుషులకు ఎంతో ముఖ్యం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మైల కోకతోడ మాసిన తల తోడ ఒడలి మురికి తోడ నుండెనేని అధిక కులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మైలకోక తోడ మాసిన తలతోడ ఒడలు ముఱికి తోడ నుండెనేని అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మొదట ఉపకారము చేసెదననిచెప్పి , త్రిప్పిత్రిప్పి తరువాత పొమ్మను లోభులకు, అపకారము వుండేలు దెబ్బవలె తప్పక తగులును.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మొదట ఆశపెట్టి తుదిలేదుపొమ్మను పరలోభులైన పాపులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు దురాత్ములు సన్మార్గులవలె నటించుచు గతంలో కొందరు ధర్మకర్తలు నిర్మించిన దేవాలయములను నిర్మూలించి తాము మరియొక ధర్మకార్యమును ఆచరింతురు. వీరిని వీరిదోషములతో కూడిన ధర్మకార్యములను చూసి, దేవుడు తప్పక నవ్వుకొనును. ఇటువంటివారి వలన లోకమున వాస్తవమగు ధర్మము భ్రష్థమగుచున్నది. ఈ చెడుపనుల వలన తమకు పుణ్యము లభించునా లేదా అని కాని తమవలన లోకమునకు హాని కలుగునని కాని తమకు పరమున నరకాది లోకములు ప్రాప్రించునని కాని భయపడకున్నారు.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మొదలం జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు ర్మదులై యిప్పుడు వారె ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న వ్వడె రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే ఏల చే సెదరో మీఁదు దలంచిచూడ కధముల్ శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా ’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలో ప్రవేశించిన కుక్క కుండలు వెదనుకునట్లుగ గదిలోకి వచ్చిన దొంగ ధనము కొరకు వెదుకునుగాని దేవునికిమ్రొక్కడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని పొసగ స్వామిజూచి మ్రొక్కడతడు కుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసులో మలినము పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా ముక్తి రాదు. నిశ్చలమైన మనసు కలవాడే ఉత్తమోత్తముడు. కాబట్టి మనలోని చెడుని తొలగించి మంచిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: యాత్రపోయినాత డెన్నాళ్ళు తిరిగిన బాదమైన ముక్తి పదవి గనడు మనసు నిల్పునతడు మహనీయ మూర్తిరా! విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనకు ఇష్టము లేని పనులు చేస్తే మన దగ్గరి వారి మెప్పు కూడ పొందలేము. అదే ఏ పనైనా మనసుపెట్టి ఇష్టముతో చేస్తే రాజు కూడ మెచ్చుకుంటాడు. రాజేంటి, అందమైన యువతుల మెప్పుకూడ అవలీలగా పొందవచ్చు. కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్దగా చేయాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రక్తిలేని పనులు రమ్యమై యుండునా? రక్తికలిగెనేని రాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: రామావతారం ఎత్తిన ఓకృష్ణా! అల్పము, చంచలము అయిన నాబుద్ధితో రోజూ నీనామజపము నేను చేయలేక పోయిననూ నీవు దయగల తండ్రివి. నీవు నాపై దయజూపి నాపాపాలు పోగొట్టి రక్షించు తండ్రీ!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: రఘునాయక నీనామము లఘుపతితో దలపగలనె లక్ష్మీరమణా! అఘముల బాపుము దయతో రఘురాముడ వైన లోక రక్షక కృష్ణా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యుద్ధభూమిలో మనలో మనం గొడవపడకూడదు. అబద్దలాడేవానిని బుజ్జగింపకూడదు. అలాగే గురువులతో వితండవాదం చేయకూడదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రజ్జు లాడరాదు రణభూమి లోపల బుజ్జగింప రాదు బొంకు వాని నొజ్జతోడ వాదు లొనరంగ మానరా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! శివభక్తుల మనస్సులందు ఒకప్పుడు స్వాభావికమగు కామభావము తన శక్తిని అధికముగ చూపును. అట్లు మన్మధుడు శివుని అణచివేయుచుండును. మరియొక సమయమున శివుడే తన శక్తి పైచేయి కాగా భక్తుల మనస్సులయందలి మన్మధుని నొక్కివేయుచుండున్. ఇట్లు శివ మన్మధులు తమ బలములను చూపుచూ బాగుగా పోరాడుచుండుట గవయ మృగము ఆబోతు పోరాడుచున్నట్లున్నది. అట్టి పోరాటములో లేగ నలిగిపోవునట్లు, నీ భక్తులు ఈ రెండు భావముల మధ్య నలిగిపోవుచున్నారు. కనుక ప్రభూ వీరి ఇట్టి కష్టమును తెలిసికొని వీరలపై దయవహించి రక్షించుమా.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రతిరా జుద్ధతి మీఱ నొక్కపరి గోరాజాశ్వుని న్నొత్తఁ బో నతఁ డాదర్పకు వేగ నొత్త గవయం బాంబోతునుం దాఁకి యు గ్రతఁ బోరాడంగనున్న యున్నడిమి లేఁగల్వోలె శోకానల స్థితిపాలై మొఱపెట్టునన్ మనుపవే శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులందు ధర్మముగ ఉండవలసిన గుణములు దయ, ధర్మము, అభిజాత్యము, విద్య, ఓర్పు, సంస్కారము, సత్యము పలుకుట, విద్వాంసులను మిత్రులను కాపాడుట, సుజనత్వము, కృతజ్ఞత, విశ్వాసము, ఇతరులు తనను నమ్మదగిన వానిగ ఉండుట రాజులందు కనబడుట లేదు. రాజు కాగానే మానవతాలక్షణములైన్ పై గుణములన్నియు సహజముగానే పోవును కాబోలు. అట్లు కానిచో రాజులు పైన చెప్పిన గుణములు లేని పరమనీచులగుటకు కారణమేదియు కానరాదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజన్నంతనె పోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాతక్షమ సత్యభాషణము విద్వన్మిత్రసంరక్షయున్ సౌగన్యంబు కృతంబెఱుంగటయు విశ్వాసంబు గాకున్న దు ర్బీజశ్రేష్థులు గాఁ గతంబు గలదే శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజసం చేత రాజ్యాదికారం లభిస్తుంది. కాని ఓర్పు లేకుండా ఉంటే రాజ్యం మోక్షం రొండూ పోతాయి. రాతి గుండును నీటిలో వేస్తె తేలదు కదా?
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాజసంబుచేత రాజ్యభారం బందు నోర్పులేని యాత డుభయతజెడు నీటిపైన గుండు నిలుచునా మునగక విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! రాజులు అన్ని విధములుగ మత్తులు. వారి సేవ నరకబాధతో సమానము. వారు మెచ్చిన ఇత్తురు సుందర స్త్రీలు, మేనాలు, పల్లకీలు, గుఱ్ఱములు, భూషణములు మొదలైనవి. ఇవి చిత్తమునకు ఆత్మకు వ్యధ కలుగుటకు మూలసాధనములు. వాటియందు కోరిక కూడదు. వానిని కోరి ఇంతవరకు నేను చేసిన రాజసేవ చాలును. వానితో తగిన సంతృప్తిని పొందినాను. ఇక వారివలన ఏవిధమైన లక్ష్మి వలదు. నీవు నన్ను అనుగ్రహించి పరిపాకము పొందిన జ్ఞానలక్ష్మీజాగృతిని యిమ్మని వేడుచున్నాను.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజుల్ మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాజులకు ఎప్పుడూ యిద్దముల గురించిన ఆలోచనే, మునులకు ఎప్పుడూ పరమాత్మగురించి ఆలొచనే, అల్పునకు ఎప్పుడూ అతివల గురించిన ఆలొచనే.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాజువరుల కెపుడు రణరంగముల చింత పరమ మునులకెల్ల పరము చెంత అల్పనరులకెల్ల నతివలపై చింత విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! చంద్రునకు రాజనుపేరు కలిగి గురుభార్యా సాంగత్యమువలన మహాపాతకి అయ్యెను. కుబేరునకు రారాజను శబ్ధము ఉండినందుననే అతనికొక కన్ను పార్వతీశాపము వలన వికలమాయెను. దుర్యోధనునకును రారాజను పేరున్నందుననే అతడు బంధుసమేతముగా యుధ్ధములోఁ జచ్చెను. రాజను పేరు గలవారందరు ఏదోయొక కీడును పొందియేయుండిరి. కావున నాకీ జన్మముననే కాక మరి ఏ జన్మమందైనను ఆ రాజ శబ్ధమునియ్యవలదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రాజై దుష్కృతిఁ జెందెఁ జందురుండు రారాజై కుబేరుండు దృ గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁ డామాటనే యాజిం గూలె సమస్తబంధువులతో నా రాజశబ్ధంబు చీ ఛీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జీవం లేని నందిని మొక్కి జీవమున్న ఎద్దును భాదలు పెడుతూ ఉంటారు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులను మించిన పాపులు ప్రపంచంలో ఉండరు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాతి బసవని గని రంగుగా మొక్కుచూ గనుక బసవనిగని గుద్దుచుండ్రు బసవ భక్తులెల్ల పాపులూ తలపోయ విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాముని భక్తులమని అనుకుంటూ మనసులో భక్తి లేకున్నా కూడ తెగ భజనలు చేస్తుంటారు. నిజమైన భక్తి ఉన్న వాడు భజనలు చేయవలసినా అవసరం ఉందా? భక్తిని మనస్సులో ఉంచుకుంటే చాలు, భజనలు చేయవలసిన అవసరం లేదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రామ భక్తులమని రాతి బొమ్మకు మ్రొక్కి భజన సేయనేల భక్తిలేక, భక్తి నిల్ప నతడు, భజన చేయునా? విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!దుష్టులు నన్నుఅన్యాయంగాహింసిస్తూంటే ఊరుకుంటావా?నన్నుకాపాడు'రామదాసు.
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రామఇదేమిరా నిరపరాధిని దుర్జనులేచుచుండగా నేమిఎరుంగనట్టుల సహించుచునున్నపనేమిచెప్పురా నీమదికింతసహ్యమగునే ఇకనెవ్వరునాకురక్షకుల్ కోమలనీలవర్ణ రఘుకుంజర మద్గతిజానకీపతీ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధర్మాధర్మముల సూక్ష్మమును గ్రహించవలెను.రాముడు గొప్పరఘువంశమునబుట్టి ధర్మముతో మరింతపేరుతెచ్చెను.దుర్యోధనుడుగొప్ప కురువంశములోపుట్టి అధర్మముతో దానికికీడుతెచ్చాడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రామవిభుడుపుట్టి రఘుకులం బలరించె కురువిభుండుపుట్టి కులముచెరిచె యెవరిమంచిచెడ్డ లెంచిచూచిన దేట విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: నీలమేఘపురంగుతోవెలుగుతూ జనులకానందకారకా పరశురామునిగెలిచి ఏకపత్నీవ్రతుడవై కాకుత్సవంశచంద్రుడవైన రాక్షససంహారీరామా!గోపన్న
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రామవిశాలవిక్రమ పరాజితభార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీలనీరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధిసోమ సురారిదోర్బలో ద్దామవిరామ భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: రాముని పుట్టుకతో రఘువంశము ఉద్ధరింపబడింది. దుర్యోధనుని పుట్టుకతో కురువంశము నశించింది. ప్రపంచములో పుణ్య పాపములు విధముగానే ఉంటాయి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెఱచె ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: ఘోరపాపాల నుండి విముక్తిని కలిగించేవాడు, సద్గుణములతో కూడిన కల్పవృక్షం వంటివాడు, తీగెలెన్నో విచ్చుకొనే తోట వంటివాడు, ఆరు రకాల వికారాలను జయించిన వాడు, సాధుపుంగవులను రక్షించడమే వ్రతంగా గలవాడు.. ఎవరంటే రాముడే. పరమదైవమూ ఆయనే కదా. నీ అడుగులలో పూచే తామరలనూ కొలవడమే నా పని భద్రగిరి వాసా!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రాముడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో ద్ధాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: పాపముల పోగొట్టువాడవు, మంచిగుణములకు కల్పవృక్షపు వంటివాడవు,ఆరువికారములజయించి మంచినికాపాడు రామా!నిన్నేనమ్మానుగోపన్న
ఇచ్చిన భావము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: రాముడు ఘోరపాతకవిరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయరాముడు సాధుజనావన వ్రతో ద్దాముడు రాముడేపరమదైవము మాకనిమీయడుంగుగెం దామరలేభజించెదను దాశరధీ కరుణాపయోనిధీ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక రాయిని పట్టుకుని మరొక రాయితో అదె పనిగా రాస్తూ ఉంటే ఎంత గరుకు తనము అయినా పొయి నున్నగా తయారవుతాయి. అలాగే పట్టుదలతో చేస్తూ ఉంటే ఎలాంటి పనినైనా సాధించవచ్చు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన యట్టు లన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు.దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు కానలేరు ముక్తికాంత నెపుడు తానయుండుచోట దైవంబు నుండదా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన మనస్సు ఏమి చెబుతుందో వినకుండా ఆవేశంతో అడవులబట్టి పోతే ప్రయొజనం ఉండదు. కావున ముందు మన మనస్సులో ఎముందో అది ఏమి చేప్పాలనుకుంటుందో విని అర్దం చేసుకోవాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రూఢిమదిని మించి రొద వినజాలక కాడు చేరనేమి ఘనము కలుగు? వీటిలోన రవము విన్నంద వినుచుండు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: స్థిరముగా చేసెదననిచెప్పి తరవాత మానరాదు.సహాయముగా నుండే బంధువులకి చెడు మనసులోకూడా తలవకూడదు. కోపించే అధికారిని సేవించకూడదు.పాపులున్న దేశానికి వెళ్ళరాదు.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు మదిలో గోపించు రాజు గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైనా రూఢిగా చెప్పి అనలేదని అబద్ధామాడకు.సహాయముగానుండు. బంధువులకు కీడుచేయకు.[మిగతావారికి చెయ్యచ్చని కాదు]కోపించే అధికారిని సేవించకు.పాపాత్ములుండెడి దేశానికి వెళ్ళకు.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: రూపించి పలికిబొంకకు ప్రాపగుచుట్టంబు కెగ్గుపలుకకుమదిలో గోపించురాజు గొల్వకు పాపపుదేశంబుసొరకు పదిలము సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీ రూపుని, నడకలో హొయలుని చూసి క్షణికావేశంలో బ్రాంతి చెందుతారు. అలాంటి బుద్ది మారక పోతె అందరి దగ్గర నవ్వుల పాలవ్వాల్సి వస్తుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: రూపు నడక చూడదాపంబు పుట్టిన భ్రాంతిలంకురించు నంతలోనె బుద్దిమఱలకున్న రద్దికి నెక్కురా! విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! వాస్తవమగు తత్వజ్ఞానుభవము కాని చిత్తపవిత్రత కాని పవిత్రవర్తనము కాని లేక శుష్కమగు పాండిత్యము మాత్రము సంపాదించిన కొందరు ’మేము ప్రాపంచిక సుఖములపై రోత చెందితిమి’ అందురు. వాస్తవముగ తమ మనస్సులందు ఏ ఉత్తమ సంస్కారము లేక రోగగ్రస్తమగు మనస్సులు కలవారు. వీరికి ఏమి రోత కలిగినది. రోతనగా వీరికేమి తెలియును. నేను శివభక్తుడను, ఎంత విభూతిని పూసికొంటిని అందురు. వీరు పూసుకొన్నది లేదు వారి దేహములందు ఏపూతయు లేదు. ఎందుకంటె వారి అంతఃకరణములందు పాదుకొనియున్న మదము మొదలైన దుర్దోషములచే వారి దేహములు అపూతములు అపవిత్రములయి ఉన్నవి. నా వాంఛలు మొదలగు వాటిని మాత్రమే కాదు ధ్యానస్థితిలో కన్నులను మూసికొంటిని అందురు. వీరి కన్నులు మూతలు పడియున్నను వీరి మనస్సులు ప్రాపంచిక సుఖాదులు, వానిపై వాంఛలు, వాటిని పొందుటకు దుష్కర్మలును చూచుచునే ఉన్నవి. సదా మూఢత్వమే కాని వీరి అంతఃకరణములందు తత్వజ్ఞానము, యుక్తాయుక్త వివేకము ఉండవు. కనుక శివా నన్ను అట్టివానినిగా కానీయక నిన్ను సదా సేవించువానిగ అనుగ్రహించుము.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రోసిం దేంటిది రోఁత దేంటిది మనొ రోగస్థుండై దేహి తాఁ బూసిందేంటిది పూఁత లేంటివి మదా(అ)పూతంబు లీ దేహముల్ మూసిందేంటిది మూఁతలేంటివి సదామూఢత్వమే కాని తాఁ జేసిందేంటిది చేంతలేఁటివి వృధా శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్ పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']