inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: స్థిరతరధర్మవర్తన బ్రసిద్ధికినెక్కినవాని నొక్కము ష్కరు డతినీచవాక్యముల గాదనిపల్కిన నమ్మహాత్ముడుం గొరతవహింపడయ్యెడ నకుంఠీత పూర్ణసుధాపయోధిలో నరుగుచు గాకిరెట్టయిడినందున నేమికొఱంత భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: పైనపోవుచూ కాకి పాలసముద్రములో రెట్టవేసినసంద్రము చెడనట్లే ధర్మపరుని మూర్ఖుడు నిందించిన కొరతుండదు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: స్నాన సంధ్య జపము జరియించు భుజియించు నిష్ఠ లెన్నియైన నెఱుపుగాని ఒకని కీయడేమి సుకృతంబు కలుగునో? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధర్మ బద్దులులాగ స్నానం చేసి సంధ్యా వందనం చేసి జపము చేశాకె భొజనం చేస్తారు. కాని ఇలాంటి నియమ నిష్ఠలెన్ని చేసినా, కష్టాల్లో ఉన్న ఇతరులకు దానం చేయక పొతే పుణ్యం కలుగదు.
3
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: స్వపరప్రతారకోऽసౌ, నిన్దతి యోऽళీకపణ్డితో ఉపతీః, యస్మాత్తపసోऽపి ఫలం స్వర్గః స్వర్గేపి చాప్సరసః
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: దుర్విరక్తులు తాము తమనే మోసం చేసుకుంటూ ఇతరుల్నీ వంచించేవారిని గురించి చెబుతున్నాడు స్త్రీలు చెడ్డవారు, వారిని కూడరాదు అంటూ సుద్దులు చెబుతుంటారు కొందరు. తపస్సే ముఖ్యం అని కూడ వీరి భాషణ. తపస్సు వల్ల ఫలితం స్వర్గప్రాప్తి. అక్కడ ఉండేది అప్సరస స్త్రీలు. స్వర్గం నిజంగా పొందడం అంటూ జరిగితే అక్కడ ఉండేదీ స్త్రీలే అయినపుడు, వీరు స్త్రీలను నిందించడం దేనికీ దీనివల్ల వీరి వైరాగ్యం అంతా నటనయే అనీ బయటకు అలా అంటారే తప్ప లోపల స్త్రీలాభాపేక్ష ఉందనీ గ్రహించవచ్చు మనం
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: స్వామిద్రోహముఁ జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాట న్విననొల్లకుండితినొ నిన్నే దిక్కుగాఁ జూడనో యేమీ ఇట్టివృధాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ చీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావము: శ్రీ కాళహస్తీశ్వరా, నా ప్రభువగు నిన్ను వదలి నేను మరియొక ప్రభువును సేవింపబోతినా! లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా! నీవే నా రక్షకుడవని భావింపక యుంటినా! ఈ విధమైన అపరాధములు నేను చేసియుండలేదే. ఐనను నీవు నన్ను అకారణముగ అపరాధినిగా తలచుచున్నావే! నన్ను మహా దుఃఖసముద్రములో ముంచివేయుచున్నావే! ఇట్లు చేయుట నీకు న్యాయమా!
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హయమదరి పరువులిడుగతి రయమున బాఱెడిని మనసు ప్రతికూలముగా నయమో భయమో చూపుచు బయనము సాగింపనీక పట్టర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: గుర్రము దారి తప్పు పరిగెడుతుంటే దానిని నయానో భయానో అదుపులోకి తెచ్చి సరి అయిన దారిలో పెడతాము. అలాగే చంచలమైన మనస్సుని సాధనతో స్థిరపరచి సరి అయిన దారిలోకి మళ్ళించాలి.
5
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్ బరమేష్ఠి సురలు బొగడగ కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: కృష్ణా! నువ్వు లక్ష్మీదేవితో కూడివచ్చి బ్రహ్మాది దేవతలు పొగిడేలా... మొసలిని చంపి దయతో ఏ విధంగా ఏనుగును కాపాడావో, నన్ను కూడా అదేవిధంగా రక్షించు. నాకు నీవే శరణు అవుతున్నావు. ఏనుగుకి, మొసలికి జరిగిన భయంకర యుద్ధంలో ఏనుగు బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఏనుగు తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉన్నవాడు అలాగే వచ్చి ఏనుగును రక్షించాడు. తనను కూడా అదేవిధంగా రక్షించమని కవి ఈ పద్యంలో విన్నవించుకున్నాడు.
5
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: హరి సర్వస్వంబున గలడని గరిమను దైత్యుండుపలుక గంబములోనన్ ఇరవొంద వెడలిచీల్పవె శరణన బ్రహ్లాదుండుసాక్షియె కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావం: కృష్ణా! హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు నీవుఅంతటా నిండియున్నావని చెప్పగా స్థంభములోనుండీపుట్టి గొప్పవెలుగుతోవచ్చి ప్రహ్లాదుడు చూస్తుండగా అతడి తండ్రినిచంపితివి.
2
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజ నాభా హరి నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: హరి అన్న రెండక్షరాలకు వున్న శక్తిని తెలిపే అద్భుత భక్తినీతి పద్యమిది. హరి అన్నమాట పలికినంతనే ప్రపంచంలోని పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాదు, హరి అనే ఈ పలుకులోని మహత్తు ఎంత గొప్పదంటే, దీనిని పలికినంతనే జన్మ ధన్యమైనట్టే. అటువంటి మహోత్కృష్టమైన శ్రీమహావిష్ణువు నామస్మరణతో స్వామిని పొగడడం ఎవరి వల్ల అవుతుంది!
6
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: శివపార్వతులకి,విభీషణునికి మంత్రమై,కరి,అహల్య,ద్రౌపదికి ఆర్తిహరించిచుట్టమైన నీదివ్యనామము నానాలుకపైఎప్పుడూ పలుకజేయి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హానిచేతగల్గు నధిక దుఃఖంబులు హానిచేత దప్పు నరయ సుఖము హానిచేత గొంత యలమట గలుగురా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: పిరితనము వలన దుఃఖము కలుగును, కష్టము కలుగును, దరిద్రము కూడ కలుగును. పిరికితనము వలన మనిషి సాదింపగలిగినది ఏది లేదు. కావున పిరికితనాన్ని వీడి దైర్యం కలిగి ఉండాలి.
1
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హానినిజప్రబుద్ధి తిరమైనవిధంబున బెట్టుబుద్ధులా వేళలకంతెకాని మరివెన్కకు నిల్వవు హేమకాంతి యె న్నాళుల కుండు గానియొకనాడు పదంపడి సానబట్టినన్ దాళియు నుండునే యినుపతాటక జాయలుపోక భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎవరికైనా స్వంతబుద్ధి బంగారుకాంతివలె నిలుచును.పరులుచెప్పినబుద్ధి సానబట్టిన ఇనుము తళుకువలె తాత్కాలికము.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: హీనగుణము వాని నిలుజేర నిచ్చిన నెంతవానికైన నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: దుర్గుణాలు కలిగిన వారిని ఎంత మాత్రం దరి చేరనీయరాదు. వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడమే మేలు. పొరపాటున అలాంటి వారిని ఇంట్లో వుంచుకొంటే, ఎంతటి వారికైనా సరే కష్టాలు తప్పవు. కర్మ కాలి ఈగ ఒకవేళ మన కడుపులోకి చేరితే.. ఇంకేమైనా ఉందా? లోన అది చేసే హాని ఇంతా అంతా కాదు కదా.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: హీనగుణమువాని నిలు సేరనిచ్చిన ఎంతవానికైన నిడుము గలుగు! ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా? విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: హీననరుల తోడ నింతులతోడను పడుచువాండ్రతోడ బ్రభువుతోడ బ్రాజ్ఞజనులతోడ బలకంగరాదయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: దుర్జనులతో, స్త్రీలతో, పడుచువాళ్ళతో, రాజులతో, పండితులతో మాట్లాడెటప్పుడు ఎప్పుడు, ఏమి, ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోని మాట్లాడాలి. లేనిచో వారు దేన్ని తప్పు పడతారో చెప్పలేము. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడెటప్పుడు ముందు వెనుక ఆలొచించి జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: హీను డెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడుగాడు మొఱకు జనుడెగాని పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ౠణము పెంచి నరుని హీనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయ అలవి గాని యట్టి యాలును నట్టులే విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అప్పులు బాగా చేసి కొడుకుని దరిద్రుని చేసే విడిచిపెట్టే తండ్రి శత్రుపక్షంలో ఉన్న వీరుడు లాంటి వాడు. ఎంత వీరుడైనా శత్రువు శత్రువే కదా! అలానే మాట వినని భార్యకూడ శత్రువులాంటిదే.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: వేరుపురుగుజేరి వృక్షంబు జెఱుచును చీడపురుగుజేరి చెట్టుజెఱుచు కుత్సితుండుజేరి గుణవంతు జెఱుచురా విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: వృక్షానికి వేరుపురుగు చేరిందంటే వేళ్ళు కొరికి కూల్చును.అట్లే చెట్లకు చీడపురుగు పట్టి నాశనము చేయును. అదేవిధముగా దురాత్ముడు మంచివారి దగ్గరజేరితే చెడగొట్టును.వేమన.
1
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము ఇవ్వండి: ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.
3
['tel']
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: సీ. మందుడనని నన్ను నిందజేసిన నేమి? నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావము లేక తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? తీవ్రకోపము చేత దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మలాడిన నేమి? చేరి దాపట గేలి సేయనేమి? తే. కల్పవృక్షము వలె నీవు గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ! భూషణవికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార ! నరసింహ ! దురితదూర!
ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి అర్ధము: లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటూంటారు లక్ష్యం అంటే మనం చేరలనుకునే స్థానం. అది ఉన్నతంగా ఉండాలి అప్పుడే అదికాకపోయినా దాని క్రింది స్థానమైనా సంపాదించుకోగలుగుతాము. ఇది కేవలం చదువుకునే విద్యార్థులకో, ఉద్యోగార్థులకో సంబంధించిన విషయమేకాదు ఇది పూర్తి మానవజీవితానికి కూడ వర్తిస్తుంది. మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు. విద్యార్థి గొప్పచదువుకావాలని కోరుకోవాలి. ఉద్యోగి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అలాగే మనిషి తను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చాడో అది గుర్తెరిగి తిరిగి అక్కడికే పోవాలనే దృష్టితో తన జీవనాన్ని మలచుకొని జీవనం సాగిస్తే అదే ఉన్నతమైన ఆలోచన అవుతుంది.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎద్దుమొద్దువాని కేల శాస్త్రంబులు? ముద్దునాతి కేల ముసలిమగడు? చద్దిమిగుల నిల్లు సంసారమేలరా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మొరటువానికి శాస్త్రములతో పని లేదు. ఎవరు చెప్పినా వినడు. పడుచుదానికి ముసలిమొగుడు కిట్టడు. అలాగే చద్ది మిగిలిఉండని ఇల్లు సంసారానికి సరి అవుతుందా?
6
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: వడుగుడవై మూడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిల జగంబుల్ తొడిగితివి నీదు మేనునన్ గడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: కృష్ణా అంటే ఓ కృష్ణా నీవు; వడుగుడవై అంటే బ్రహ్మచారివై; మూడు + అడుగులన్ అంటే మూడు పాదములు మోపునంత స్థలాన్ని; అడిగితివి అంటే కోరుకున్నావు; నీదు అంటే నీయొక్క; మేనునన్ అంటే శరీరంలో; అఖిల అంటే సమస్తమైన; జగంబుల్ అంటే లోకాలను; తొడిగితివి అంటే ఆక్రమించావు; (అన్ని లోకాలను ఆక్రమించావు) ఔను అంటే వాస్తవము; భళిర భళిర అంటే ఆహా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం; నీ చరిత్ర అంటే నీ గొప్పదనాన్ని చెప్పే కథ; కడు చిత్రము అంటే చాలా చిత్రమైనది; ఘనము + అవు అంటే గొప్పది అగును కదా! ఓ శ్రీకృష్ణా! వామనుడిగా మూడడుగుల నేలను దానంగా ఇమ్మని అడిగి, రెండు అడుగులతో సమస్త లోకాలనూ ఆక్రమించిన నీ చరిత్ర చాలా గొప్పది, ఆశ్చర్యాన్ని కలిగించేదీనూ. వామనావతారంలో విష్ణుమూర్తి బహ్మచారిగా సాక్షాత్కరించి, రాక్షస రాజైన బలిచక్రవర్తి నుంచి మూడడుగుల దానం స్వీకరించబోగా, వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని రాక్షసగురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికీ, వినకుండా బలిచక్రవర్తి దానం చేస్తాడు. రెండడుగులతో లోకాలన్నిటినీ ఆక్రమించి, మూడవ అడుగు ఎక్కడ ఉంచాలని బలిచక్రవర్తిని అడిగినప్పుడు, తన తల మీద ఉంచమని చెప్పిగా బలిని పాతాళానికి పంపాడు. కవి ఈ పద్యంలో వామనావతారాన్ని వివరించాడు.
5
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కెరలి యఱచేత కంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉదరము జీరి వధించితివి నరహరి రూపావతార నగధర కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కొండను ధరించిన వాడవైన ఓ కృష్ణా! రాక్షసరాజయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో కోపంగా... ఈ స్తంభంలో విష్ణువుని చూపుతావా అంటూ ఉక్కు స్తంభాన్ని అరచేతితో గట్టిగా చరచగా నువ్వు నరసింహావతారం ధరించి, ఆ స్తంభంలోనుంచి బయటకు వచ్చి, హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపావు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి చావులేని వరం కోరుకున్నాడు. ఇంటిలోపల బయట... పగలురాత్రి... మనుషులుజంతువులు... ఇలా ఎన్నో వాటి కారణంగా మరణం లేని వరాన్ని పొందాడు. అందువల్ల విష్ణుమూర్తి పగలు రాత్రి కాని మధ్యాహ్న సమయంలో, ఇంటిలోపల బయట కాని గడపమీద, మనిషిజంతువు కాని నరసింహాకారంలో స్తంభంలో నుంచి బయటకు వచ్చి తన వాడి గోళ్లతో హిరణ్యకశిపుని వధించాడు. నరసింహావతారం గురించి కవి ఈ పద్యంలో వివరించాడు. నరహరి అంటే మనిషి, సింహం; రూప + అవతార అంటే రూపంలో అవతరించినవాడా; నగధర అంటే కొండను ధరించువాడా; కృష్ణా అంటే ఓ కృష్ణా; కెరలి అంటే క్రోధంతో; అఱచేతను అంటే అరచేతితో; కంబమున్ అంటే స్తంభాన్ని; అరుదుగ అంటే ఎప్పుడూ లేనట్లుగా; వేయుటకు అంటే కొట్టటం చేత; వెడలి అంటే ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి; ఆ + అసుర + ఈశ్వరునిన్ అంటే ఆ రాక్షసరాజయిన హిరణ్యకశిపుని; ఉదరము అంటే వక్షస్థలాన్ని; చీరి అంటే రెండుగా చీల్చి; వధించితివి అంటే చంపావు.
3
['tel']
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: సభ లోపల నవ్విన యెడ సభ వార్నిరసింతు రెట్టి జను నిన్నెరి నీ కభయం బొసంగె నేనియు బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!
ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి తాత్పర్యము: సభ జరిగే వేళ నవ్వకూడదు. ఎందుకంటే,అది తప్పుడు అర్థానికి దారితీస్తుంది. అలా నవ్విన వారు ఎంతటి వారైనా సరే, సభికులతో చిన్నచూపుకు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది. అలాగే, రాజు నీకు అభయమిచ్చి రక్షించినప్పుడు నీ పట్ల తాను చూపిన ఆ కరుణను నమ్ముకొని నువు ఎంతమాత్రం గర్వపడకూడదు కుమారా!
4
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: దైవ పాదసేవను మించిన పరమోత్కృష్ట భక్తి మరేమీ ఉండదని చెప్పిన భక్తినీతి పద్యమిది. సాలెపురుగు, ఏనుగు, పాముతో పాటు బోయవానికి సైతం మోక్షసిద్ధి ఎలా కలిగింది? వేదాలు, శాస్త్రాలు, విద్యాభ్యాసం, మంత్రాలు వంటి వాటన్నింటికంటే విలువైంది కాళహస్తీశ్వరుని పాదసేవ. ఆ భాగ్యాన్ని నాకూ కలిగించుము స్వామీ!
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్చూచె, దా నే విద్యాభ్యసనం బొనర్చెగరి, చెంచేమంత్ర మూహించె, బో ధావిర్భావని దానముల్ చదువులయ్యా? కావు, మీ పాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్ చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! పూర్వము చిత్రాంగియను నామె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె యెన్నో దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాడ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు. కాన, స్త్రీలను నమ్మరాదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టు; వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగఁజేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!నీదయనాపై కాస్తచిలకరిస్తేచాలు. చెడుపనులువదులుతాను.విరోధులనిఅదలిస్తాను.కోర్కెలువదలి నీకుబంటునై యమదూతలనెదిరిస్తాను..రామదాసు.
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినజాలు దాననిరసించెద నాదురితంబులెల్ల దూ లించెదవైరివర్గ మెడలించెదగోర్కుల నీదుబంటనై దంచెదకాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు చేరవలయు బ్రతుకజేయు నతడు ఆ విభీషణునకు నతిగౌరవంబీడె భూతలమున రామమూర్తి వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: స్వామీ! రామచంద్రమూర్తీ!! నిన్నే నమ్మి, మనసారా కొలిచిన వారికి నువ్వెన్నటికీ లోటు చేయవు కదా. అలాంటి వారి పాపాలు కొండలంతగా వున్నా సరే వాటిని నువ్వు నశింపజేస్తాయి. నీ కరుణా కటాక్షాలతో వారికి అఖండ వైభవాలు కలుగకుండా ఉండవు! ఆఖరకు మోక్షలక్ష్మి కూడా వారిని వరించేస్తుంది కదా.
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్‌ కొండల వంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండల వైభవోన్నతులు గల్గక మానునె మోక్ష లక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: గరుడవాహనా!దశరధ రామా!నిన్నునమ్మి కొలిచెడువారి పాపములు కొండలంతటివైననూకరిగి సుఖములందుటేకాక మోక్షముసిద్ధించును.
ఇచ్చిన భావం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అండజవాహన నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నె తుద దాశరధీ కరుణాపయోనిధీ
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓగరుడవాహనుడవైన కృష్ణా!నీవు గోవర్ధనమనేకొండ నెత్తావంటారు.బ్రహ్మాండాలనే బంతుల్లా ఆడేవాడవునీవు. గోవర్ధనగిరిని ఎత్తడంఓవింతా?నీకది పిల్లాట వంటిదికాక అదోపెద్ద కొండకిందలెక్కా?
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అండజవాహన వినుబ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్ గొండల నెత్తితివందురు కొండికపనిగాక దొడ్డకొండా కృష్ణా
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతరుల మనస్సులో ఏముందో పసిగట్టడం చాల కష్టం. దాన్ని పసిగట్టినవాడె గొప్పవాడు, గురువుకి కావలిసిన అర్హతలు కలవాడు.అంతెందుకు అతడు సరాసరి శివుడితో సమానం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను అంతరంగ మెఱుగ నార్యుడగును అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో కొంతమంది మనుస్సులో చెడ్డభావాలు పెట్టుకొని పైకి మంచివారిలాగా ప్రవర్తిస్తారు. ఈవిషయాన్ని మనుష్యులు గుర్తించలేక పోయిన భగవంతుడు మాత్రం గుర్తిస్తాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగమంద అపరాధములుచేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లేరుగాకున్న ఈశ్వరుండేరుగడ విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి చాటు మాటూగ అనేక తప్పుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులనుగుర్తిస్తాడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అంతరంగమందు సపరాధములు చేసి మంచివానివలెను మనుజు డుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుఁ డెరుంగడా విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా, ఈప్రపంచమున కన్పించు ప్రతియొకటి వాస్తవమైనదిగ కన్పించుచున్నది. కాని వాస్తవము కాదు. వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమగుచున్నది. సత్యాసత్యములు ఎరుగగలిగిన ప్రతియొకడు తన భార్య/భర్త పుత్రులు, ధనము, శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలచుచు వానికై మరియు వానివలన సుఖము పొందుటకు ప్రయత్నింతురు. ఈ మోహమను సముద్రమున పడి ఒడ్డు చేరక లోపలలోపలనే తిరుగుతున్నాడు. ఆలోచించినవారికి నీవు మాత్రమే పరమసత్యవస్తువని తెలుయును. అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు. ఇది చాల శోచనీయమగు విషయము కదా!
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా!
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మోక్షమనేది ఎత్తయిన చెట్టుకున్న పండు లాంటిది. అది పొందాలంటే ఙానముతొ కష్టపడి ప్రయత్నించాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అందరానిపం డదడవి వెన్నెల బైట నుండు జూడ బెద్ద పండుగాను పండుపడిన జెట్టు బట్టంగలేరయా! విశ్వధాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: లక్ష్మీదేవి భర్తవైన ఓ శ్రీకృష్ణా! దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి స్నేహంగా పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో నువ్వు తాబేలు రూపం ధరించి, ఎంతో చాకచక్యంగా కవ్వంగా ఉన్న మందరపర్వతాన్ని ఎత్తావు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం. విష్ణుమూర్తి అవతారాలలో రెండవది కూర్మావతారం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకాలనుకున్నారు. అందుకు వాసుకి అనే పామును తాడుగానూ, మందరగిరి అనే పర్వతాన్ని కవ్వంగానూ ఎంచుకున్నారు. ఆ కవ్వంతో సముద్రాన్ని చిలుకుతుంటే అది నెమ్మదిగా కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణుమూర్తి కూర్మ (తాబేలు) రూపంలో వచ్చి మందరగిరిని తన వీపు మీద మోశాడు. ఆ సన్నివేశాన్ని కవి ఈపద్యంలో వివరించాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందఱు సురలును దనుజులు పొందుగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీవా నందముగ కూర్మరూపున మందరగిరి యెత్తితౌర మాధవ! కృష్ణా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: పాదములకు అందెలు ధరించి అందముతో మునిజనులతో పొగడబడుతూ సౌందర్యముతో నిలబడిన నందుని వరపుత్రా! నిన్నే నమ్ముకున్నాను శ్రీకృష్ణా!కృష్ణ శతక పద్యం.
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందెల బాదములందును సుందరముగా నిల్చినావు సొంపమరంగా సుందర మునిజనసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! బాల్యంలో నీ కాళ్లకు అందంగా అలంకరించిన అందెలు, గజ్జెలను ఘల్లుఘల్లుమని చప్పుడు చేస్తూ గంతులేస్తూ, నందుని భార్య అయిన యశోద ఎదుట నిలబడి ఆమెకు ముద్దు కలిగించేలా ఆడుతుంటావు.
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అందెలు గజ్జెలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! అడవిలో గర్వముతో పొగరుతో తిరుగుచు బాధించు మృగమును బంధించుటకు, అడవినుండి బయటకు వచ్చు మార్గమును ముందే ఏర్పచుకుని, దాని పరిసరములకు పోయి భయంకరములైన ఘంటలు, ఢంకాది వాద్యముల ధ్వనులతో భయపెట్టి లొంగదీసుకుందురు. అట్లే ఉపాసకులు ప్రణవనాదమను ఘంటయు, బిందువను దీపకాంతుల శ్రేణులు, వివేకాదులు సాధనములుగ చేసికొను, మనస్సు స్వాధీనమైన తర్వాత సంసారారణ్యము నుండి వెలికి వచ్చు మార్గముగా తారకయోగము తోడు చేసికొని సంసారబంధములను భయంకరమైన తీగలకట్టలను త్రెంచుట ఏమి ఆశ్చర్యము. కాని ఇవి లేని వారికి ఇట్టి సాధనములనుపయోగిచనివారికి సంసారబంధములు ఎట్లు వీడును.
ఇచ్చిన భావము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అకలంకస్థితి నిల్పి నాడ మను ఘంటా(ఆ)రావమున్ బిందుదీ పకళాశ్రేణి వివేకసాధనములొప్పన్ బూని యానందతా రకదుర్గాటవిలో మనోమృగముగర్వస్ఫూర్తి వారించువా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీ కాళహస్తీశ్వరా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏవో ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అటువంటి సమయంలో బంధువులు వారికి చేతనైన సహాయం చేయాలి. అలా చేయనివారు బంధువులు కారు. అటువంటివారిని దూరంగా ఉంచాలి... అని చెబుతూ ఎటువంటివాటిని దూరంగా ఉంచాలో మరికొన్ని ఉదాహరణలు ఈ పద్యంలో ఉన్నాయి. ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి. ‘అక్కరకు రావటం’ అంటే అవసరానికి ఉపయోగపడడం, వేల్పు అంటే దేవుడు, గ్రక్కున అంటే వెంటనే అని అర్థం. ఇందులో గ్రక్కున అనే పదం అన్నిటికీ సంబంధించినది. అవసరానికి ఉపయోగపడని బంధువును, దేవతను, గుర్రాన్ని... ఈ మూడిటినీ వెంటనే విడిచిపెట్టాలి అని సుమతీ శ తకం రచించిన బద్దెన వివరించాడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: జపమాలలు ధరించి దొంగ జపాలు చేసేది భక్తి ఎక్కువై కాదు, కడుపులు నింపుకోవడానికి. ఇది ఎలాంటిది అంటే చేపలను మెక్కడానికి కొంగ నీళ్ళలో పైకి చూస్తూ ఉంటుంది కదా అలాంటిది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అక్షమాలబూని యలసటజెందక కుక్షినింపుకొనుట కొదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో! విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దెవుడుని వెతుక్కుంటూ దైవ గ్రంధాలను అడవులను కొండలను పట్టుకుని తెగ తిరుగుతూ ఉంటారు కాని మనలో ఉన్న దెవుణ్ణి మాత్రం గుర్తించలేరు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అక్షరాశివెంట అడవులవెంటను కొండరాల గోడు గుడవనేల హ్రుదయమందు శివుడుండుట తెలియదా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: లెక్కలేనంత వైభవము గల కేశవా, కొండ నెత్తిన వాడా,పూమాలలు ధరించే ఆదినారాయణా, భగవంతుడా, లక్ష్మిగలవాడా, జగత్తుని కాపాడువాడా!రక్షించు.రక్షించు.రక్షించు. కృష్ణా!
ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అగణిత వైభవ కేశవ నగధర వనమాలీ యాది నారాయణ యో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఇతరులను చెడుపనులనుండి నివారించేవాడు, మంచిపనులను చేయడానికి ప్రోత్సహించేవాడు, ఇతరులరహస్యాలను కాపాడటం, పరులయొక్క సద్గుణాలను మెచ్చుకొనడం, తమను ఆశ్రయించిన వారిని మాత్రమేకాక ఆపదలో ఉన్నకాలంకో ఎవరినైనా విడువకుండా ఉండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఈ గుణాలున్న వాడు మంచి మిత్రుడని భావం.
ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు.
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: పాపపు పనులు చేయకుండా చూచుట, మేలు చేయుటకే ఆలోచించుట, రహస్యములను దాచిఉంచుట, మంచిగుణాలను అందరికీ తెలుపుట, ఆపదల్లో తోడుండుట, అవసరానికి సాయపడుట మిత్రుని గుణములు.
ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అఘమువలన మరల్చు హితార్ధకలితు జేయు గోప్యంబుదాచు బోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలంగుచుండు
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: బ్రహ్మకు తండ్రివి,సనకాదులకు పరతత్వానివి,మునులకు పరదేవతవు.సూర్యవంశ రాజులలో మేటివి.నిన్నునుతింతును.గోపన్న
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్వమయ్యుస ద్ద్వజమునికోటికెల్ల బరదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా ద్ద్విజ మిము బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుష్యులు ఆవులయొక్క లేగదూడలను వాని తల్లుల పాలు త్రాగనీయకుండ, వారు పాలు తీసికొందమన్నచో నా యావులు వారికి పాలనివ్వక తన్నును. అదేవిధముగా లోభివానివలె వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షకుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొకప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అడిగినయట్టి యాచకులయాశ లెరుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె య్యెడల నదెట్లుపాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువగ నీనిచోగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నాకు నీ సేవ లభించినందున, ఇక నా కొఱకై నిన్ను సేవించుటయందాసక్తి లేని వారినెవ్వరిని ఏమియు కోరను. ఒక వేళ ఆవశ్యకత కలిగిన, నీ పాద పద్మములనారాధించు వారి దగ్గరికి మాత్రమే పోయెదను. వారినే యాచింతును. నీ సేవ లభించిన తరువాత కూడ నేను ఇతర దేవతలను కాని నీ భక్తులు కానివారిని కాని ఏల యాచింతును? నీ అనుగ్రహమొక్కటియే నాకు చాలును.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అడుగంమోనిక నన్యమార్గరతులంబ్రాణావనోత్సాహినై యడుగంబోయిన మోదు నీదు పదపద్మారాధకశ్రేణియు న్నెడకు న్నిన్ను భజింపంగాఁగనియు నాకేలా పరాపేక్ష కో రెడి దింకేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఎవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో వానికి సముద్రం ఒక చిన్న కాలువలాగా, నిప్పు నీటిలాగా, మేరుపర్వతం చిన్న రాయిలాగా, మదించిన సింహం లేడిలాగా, కోపించిన సర్పం పూలదండలాగా, భయంకరమైన విషం అమృతంలాగా ఔతాయి అని భావం.
ఇచ్చిన అర్ధము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అతనికి వార్ధి కుల్య, నగ్ని జలం బగు, మేరుశైల మం చితశిలలీల నుండు, మదసింహము జింక తెఱంగుఁ దాల్చుఁ, గో పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్ క్షితి జనసమ్మతంబగు సుశీల మదెవ్వనియందు శోభిలున్
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అతిగా నిద్ర పోయెవానికి, అతిగా త్రాగేవానికి, అతిగా ఆకలి కలవానికి, అతి కోపిష్టికి, పిరికి వానికి, అపకారికి వీరందరికీ కష్టమైన విద్యలు తలకెక్కవు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతి నిద్రావంతునకును నతి పానికి నిరశనునకు నతి కోపునకున్ ధృతిహీనున కపకృతునకు జతపడదీ బ్రహ్మ విద్య చాటరా వేమ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగా నుండి ఉన్నప్పటిని, విరుద్ధముగా నడవక మంచిమార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే కుమార శతకం శైలి పద్యం: అతి బాల్యములోనైనను, బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స ద్గతిమీఱ మెలఁగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటికి అతిధి రాగనే అదిలించి కసిరి పొమ్మని చెప్పే మూర్ఖులు తమ ధర్మాన్ని గుర్తించరు. మనకు మంచి కర్మలు కలగాలంటే ముందు ధర్మం ఆచరించాలి కదా?
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతిధి రాకచూచి యడలించి పడవైచి కఠిన చిత్తులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: ప్రతి పని వెనుకా ఒక పరమార్థం దాగుంటుంది. పెద్ద చదువులు అన్నవస్ర్తాలకు, ఉద్యోగ వృత్తులు ఆర్థిక సంపాదనకు, భార్య సంసారసుఖానికి, పిల్లలపోషణ ఉత్తమగతులకు, సైన్యం శత్రు నాశనానికి, సామువిద్యలు వీరత్వానికి, దానాలు పుణ్యానికి.. ఇలా ఎంత గొప్ప కార్యమైనా పొట్టకూటి కోసమే కదా. అలాగే, నీ పట్ల నిలిపే భక్తి అంతా ముక్తికోసమే స్వామీ!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: అతివిద్య నేర్చుట యన్నవస్త్రములకే, పనుల నార్జించుట పాడి కొఱకె, సతిని బెండ్లాడుట సంసార సుఖముకే, సుతుల బోషించుట గతుల కొఱకె, సైన్యమున్ గూర్చుట శత్రుభయంబు కె, సాము నేర్చుట లెల్ల జావు కొఱకె, దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగా జదువు కడుపు కొఱకె, యితర కామంబు గోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొఱకె, భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉత్తమమైన వాళ్ళు ఎవరైన మిక్కిలి హితముగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు. కాని అర్ధం లేకుండా అధిక ప్రసంగములు చేస్తే వారికి నచ్చదు. మనము ఉత్తములుగా ఉండి అర్ధరహితమైన సంబాషణలను ఖండించాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అతిహితమగునట్టు లాడిన మాట సంతసించు రెల్ల సత్పురుషులు అధికభాషణంబు లాయాసదంబులు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! ఈభూమియందెవరికైనను పాలు కావలసివచ్చినప్పుడు ఆవులవద్దకు వెళ్లి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలు కొరకు ఆ ఆవుల పొదుగులను కోసినచో వానికి పాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవంగా చూచినచో వారు ఆదరాభిమానము ఆతనిపై చూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వారేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.
ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండుకోరినన్ గదిసి పదార్థ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ బొదుగుమూలము గోసిన పాలుగల్గునే పిదికినగాక భూమి బశుబృందము నెవ్వరికైన భాస్కరా.
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగ నుండును. ప్రతిదినము తినుచుండిన వేపవేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయచుండిన పనులు నేరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు యీ విధముగ ఉండును.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: ఇనుముతో గూడిన అగ్నికి(అగ్నహోత్రునకు) సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మరియే సంబంధము లేకపోయినను వానితో కూడినంతమాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును.
ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అనఘనికైన జేకరు ననర్హుని చరించినంతలో మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే యనువున నైన దప్పవు యదార్థము తా నది యెట్టులున్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకు అనుకూలము కాని పరిస్థితులలో/ప్రదేశాలలో, ఎంత గొప్పవారైనా తగ్గి ఉండాలి. అలా తగ్గి, తలొగ్గినందు వల్ల తమ గొప్ప తనానికి వచ్చే లోటు ఏమీ ఉండదు. ఎలాగంటే, ఎంతో పెద్దదయిన కొండ కూడా అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది కదా!
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువు గాని చోట అధికులమనరాదు కొంచె ముండు టెల్ల కొదువ గాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా? విశ్వదాభిరామ వినురవేమ.
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగాని చోట అధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచమై యుండదా ? విశ్వదాభిరామ! వినుర వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సుని మన ఆధీనంలో పెట్టుకుంటే ఎంతటి కష్టంలో కూడ ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి మనస్సుతో ఆనందం అనుభవించువాడే పరమాత్ముడు కూడ. అలాగే మనస్సును ఆధీనంలో ఉంచుకోకపోతే ముక్తి అనేది కలుగదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగాని మీఱ మదిని నానంద మందెడి నరుడు పరుడుగాడె నయముగాను మనసు నిలుపకున్న మఱిముక్తి లేదయా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అనుకూలము కాని చోట మనకు అచ్చిరాని చోట జూదము ఆడరాదు. అలా ఆడె ధర్మరాజు అడవి పాలైనాడు. అతనిని చూసి మనము నేర్చుకొవడము మంచిది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అనువుగానిచోట బనిగొని జూదము నాడి యాడి యెడి యడవి సొచ్చు ఘనుని జూడజూచి గడువుము మూర్ఖత విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్నదానముకన్న మంచి దానం ఈ ప్రపంచంలోనే లేదు. అది కాకుండా మీరెన్ని ఎంతమందికి ఇచ్చినా అది గొప్ప అనిపించుకోదు. ఎందుకంటే ఆన్నం జీవనాధరం. మీరొక జీవాన్ని బతికించినట్లే.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్న మిడుట కన్న నధిక దానంబుల నెన్నిచేయ నేమి యెన్న బోరు అన్న మెన్న జీవనాధార మగువయా విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇతర దానములు ఎన్ని చేసిననూ అన్నదానముతో సాటిగావు. లేలోచించినచో అన్నమే యీ లోకములో జీవనాధారము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్న మిడుటకన్న అధిక దానంబుల నెన్ని చేయనేమి యేన్నఁబోరు అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్న దానం చేయడం చేత అధిక పుణ్యం కలిగి దేవలోకంలో కూడ పుజ్యుడవుతారు మీరు. అన్నమే పర బ్రహ్మస్వరూపం. దానికి మించిన దానం ఈ లోకంలో లేదు. కాబట్టి అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేయండి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్ని మార్గాలనూ నశింపజేసుకొని కేవలం ఆనందాన్ని మాత్రమే కాంక్షిస్తాడు. అప్పుడే ధర్మాచరణంలో నీ మీద భారం వేసే స్థితికి చేరుకుంటాడు. నిజంగా చెప్తున్నాను నిన్ను పూర్తిగా విశ్వసించినప్పుడే ముక్తి నిశ్చయంగా లభిస్తుంది అని ప్రబోధిస్తున్నాడు వేమన. అన్ని జాడలు అంటే మార్గాలు, అంటే అనేక సంప్రదాయాలు, షణ్మతాలు కావొచ్చు. ఇంకా చిన్నాచితకా పలు పంథాలు కావొచ్చు. వీటన్నింటితో తల బద్దలు కొట్టుకోకుండా ఆనంద మార్గంలో వెళ్లమంటున్నాడు వేమన. ఇంతకూ ఆనందమంటే ఏమిటి? అతిశయ సుఖ స్వరూపమైన ప్రేమకు నెలవైంది ఆనందం అని పెద్దలు చెప్తున్నారు. ఇంగ్లిషులో దీనిని bliss అంటారు. బ్లిస్ అంటే పరమ సుఖం, బ్రహ్మానందమని అర్థాలు. ఆనందానికి అనేక సూక్ష్మ భేదాలున్నాయి. వాటిలో బ్రహ్మానందం, విషయానందాలు ప్రస్తుతానికి తెలుసుకోదగ్గవి. బ్రహ్మానందమంటే సుషుప్తియందు అనుభవించబడే ఆనందం. దీనికి స్వయం ప్రకాశం ఉంటుంది. విషయానందాలు అంటే ఇవి అంతఃకరణ వృత్తి విశేషాలు. అంటే ఇష్ట ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిఫలించేవి విషయానందాలు. ఆనందకాముడు అంటే ఆనందాన్ని కోరుకునేవాడు. ఇక్కడ ఆనందమంటే పరబ్రహ్మమే. నిష్ఠ అంటే నియమ పాలన. బ్రహ్మమును తప్ప ఇతరాలను ఉపాసించరాదనే నియమం. జాడ అంటే దారి, రీతి, విధం, వైపు, గతి, వృత్తాంతం అని అర్థాలు. ఇక్కడ మార్గం. నిక్కం అంటే నిజం, నిశ్చయం, వాస్తవం, శాశ్వతత్వం అని అర్థాలు. ఆన అంటే ఒట్టు, తోడు, ఆజ్ఞ, ప్రమాణం అని అర్థాలు. ‘నీ యాన’ అనేది చక్కని తెలుగు నుడికారం. బహుశా ‘అనుట’ నుంచి వచ్చి ఉంటుంది. నిక్కచ్చితనానికి వాడుతారు. ‘నీయాన’ అంటే నీ మీద ఒట్టు అని. ‘నా యాన’ అంటే నాపై ఒట్టు అని. ఇంగ్లిషులో ’upon my word upon my honor' అంటారు. తెలుగులో 'నా ధర్మంగా' అనేది ఇట్లాంటిదే. అన్ని ధర్మాలను వదిలేసి నన్ను శరణుజొచ్చాలనే గీతావాక్యం ఇట్లాంటిదే. ఉడుగు అంటే నశించు అని. ‘రోగాపమృత్యు వార్తాగంధ మెడలెను జారచోరాదుల పేరు నుడిగె’ అని ప్రయోగం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్ని జాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్టతోడ నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన! విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అన్నదానంలోని మంచితనాన్ని, కన్నతల్లి గొప్పతనాన్ని, గురువు వెల కట్టలేని విలువను వెల్లడించిన అద్భుత నీతిపద్యమిది. పుణ్యకార్యాల్లో అన్ని దానాల్లోకెల్లా అన్నదానమే ఉత్తమం. ఎలాగంటే, ప్రపంచంలో కన్నతల్లిని మించిన ఘనులెవరూ వుండరు. అలాగే, గౌరవాన్ని చూపించడంలోనూ గురువును మించిన వారుకూడా ఉండరు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అన్ని దానములను నన్నదానమె గొప్ప కన్నతల్లి కంటె ఘనము లేదు ఎన్న గురునికన్న నెక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఒక గ్రామంలో మనుషులు నివసించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి. మొదటిది... అవసరానికి ఆదుకుని అప్పుగా డబ్బు ఇచ్చేవాడు. కష్టాలు అనుకోకుండా వస్తాయి. ఆ సమయంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. వెంటనే ఆదుకునే వాడు తప్పనిసరి. ఇక రెండవది... వైద్యుడు. బుద్ధిమతీ! అవసరానికి డబ్బు అప్పుగా ఇచ్చేవాడు, జబ్బుచేయకుండా లేదా జబ్బు చేసినప్పుడు చికిత్స చేసే వైద్యుడు, తాగటానికి అవసరమయిన నీటినిచ్చే జీవనది, పెళ్లి వంటి శుభకార్యాల సందర్భాలలో పూజలు చేయించేందుకు బ్రాహ్మణుడు... ఈ సౌకర్యాలు లభించే ఊరిలో మాత్రమే నివసించాలి. ఇవి లేని ఊరిలోకి ప్రవేశించకూడదు. ప్రాణాంతకమైన అనారోగ్యాలు కలిగిన సమయంలో డాక్టరు వెంటనే తగిన చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణం నిలబడుతుంది. డాక్టరు అందుబాటులో లేకుండా దూరంగా ఉంటే, రోగిని తీసుకు వెళ్లేలోపే ప్రాణం పోవచ్చు. అందుకని డాక్టరు చాలా అవసరం. మూడవది... మంచినీరు గల నది. నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం. అందువల్ల నివసించే ప్రాంతంలో నీరు తప్పనిసరి. ఇక చివరగా... అన్ని రకాల కర్మలుచేసే బ్రాహ్మణుడు. ఏ ఇంట్లోనైనా మంచి కాని చెడు కాని జరిగితే దానికి కావలసిన పూజలు చేయటానికి బ్రాహ్మణుడు తప్పనిసరి... అని బద్దెన వివరించాడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము, జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అప్పుచేసి చేసే వేడుకలు [ఫంక్షన్లు], ముసలితనంలో పడుచుపెండ్లాము, మూర్ఖుడు చేసేతపస్సు,తప్పుసరిగ్గావిచారించని రాజుయొక్కరాజ్యము సహించరానివై చెడుచేయును.అంటున్నాడు బద్దెన.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీదగీడు దెచ్చుర సుమతీ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తమని తాము తెలుసుకోలేక మూర్ఖులు గొప్ప కులంలో పుట్టాము ఎంతో గొప్ప వారమని భ్రమపడుతుంటారు. కాని వారికి తాము భ్రాంతిలో ఉన్నట్లు తెలియదు. మనం చేసె పనుల బట్టి గొప్పవారమవుతాము కాని జన్మించిన కులము బట్టి కాదు. ఇలాంటివారందరు మురికి కుండలమీద వాలే ఈగల లాంటివారు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అభిజాత్యముననె యాయువున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక మురికి భాండమునను ముసరునీగలరీతి విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చెవులకుశాస్త్రాలు[మంచివిషయాలు]వినడమేఅందం.కుండలాలుకావు.చేతులకు దానంచేయుటేఅందం.కంకణాలుకావు.శరీరానికిఇతరులకి సాయపడడమేఅందం. పైపూతలుకావు.వీరేదయగలవారు.భర్తృహరి.
ఇచ్చిన భావము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: అమరు జెవి శాస్త్రమున గుండలమున గాదు వలయమున నొప్ప దీవిచే వెలయుబాణి యురు దయాఢ్యులమేను పరోోపకార కలన రాణించు గంధంబు వలన గాదు
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అమృతమువలన మరణాన్ని జయించి చిరంజీవులమవుదామనుకుంటారు. అలాంటి అమృతాన్ని ఏవరూ చూడలేదు. కాని ఒక్కొసారి అమృతమే విషమవుతుంది.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అమృత సాధనమున నందఱు బలిసెద రమృత మెంచి చూడ నందలేరు అమృతము విషమాయె నదియేమి చిత్రమో విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు. అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే. కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నా పంచేంద్రియములు నన్ను[నామనసును] ఉయ్యాలలూచుచూ నన్ను కలతలకు లోనుచేయుచున్నవి. మహాత్మా! నామొరాలకించి నన్ను కాపాడి నీమహత్యమును నిలుపుకో తండ్రీ!.కృష్ణ శతకం.
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్ జయ్యన గలుగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గురుతుగ కృష్ణా
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చిల్లుకుండలో ఏవిధంగా నైతే నీరు నిలవదో అదే విదంగా అబద్దాలాడి మనుషులను మోసగించే వారి ఇంట లక్షి నిలువదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరయ దఱచు కల్లలాడెది వారింట వెడల కేల లక్ష్మి విశ్రమించు? నీరమోటుకుండ నిలువనిచందాన విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆలోచింపగా , లేదనక అడ్డుచెప్పక తట్టుపడక మనస్సులో "యీయనా ? వద్దా ! అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిదే.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరయ నాస్తియనక యడ్డుమాటాడక పట్టుపడక మదిని దన్ను కొనక తనది గాదనుకోని తాబెట్టునదె పెట్టు విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏదో నొక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారుకాదు. అట్లే యెంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తిలేక అతని గొప్పతనము రాణింపదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ పదారు వన్నె బం గారములోన నైన వెలిగారము గూడక యున్న భాస్కరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సుర్యోదయాస్తమయాలు, జననమరణాలు, జాతులు లెక్కింపరానివి. అది తెలుసుకున్న వాడే ధీరుడైన యోగి అవును.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అరుణు నుదయ సంఖ్య అస్తంసమయ సంఖ్య జనన మరణ సంఖ్య జాతి సంఖ్య దీనినెఱిగి యోగి ధీరుడై యుండును విశ్వధాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అయ్యో! మూర్ఖులకు ఎంత చెప్పినా అర్ధం కాదే? మెడలో శివలింగాన్ని ఉంచుకుని దైవ దర్శనమని కొండలు గుట్టలు ఎక్కుతారే? ఇలా ఎక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా ఏమిటి. వీరందరూ మూర్ఖులు అవుతారు కాని మరెవరూ కాదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అఱుత లింగముండ నదియెఱుంగగలేక పర్వతంబుబోవు బానిసీడు ముక్తిగాననగునె! మూఢాత్ముడగుగాని విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణునికి చారెడు అటుకులు ఇచ్చాడు. ఆ మాత్రం స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణ్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు. అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైనవారు... నిరుపేద స్నేహితుడు ప్రేమతో తనకు ఏది ఇచ్చినా దానిని గొప్పగా భావించి, దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తాడు.
ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటికొచ్చిన అతిధిని నానా భాదలకు గురిచేసి, మాటలతో సాధించి అన్నము పెట్టె మూర్ఖులు మరు జన్మలో పెండకుప్పల మీద జీవిస్తూ మట్టిదినే వాన పాములై పుడతారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అలయజేసి మలచి యడిగండ్లు మలిగండ్లు తిరిపెమిడెడు కటికదేబెలెల్ల నెలమి మన్నుదినెడి యెఱ్ఱ్లౌదురు సుమీ విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పజాతి వాని కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ణునికి సంపదగలిగినట్లయితే పెద్ద వారినందరిని తిరస్కరించి తిరుగుతాడు. అల్పుడైన వానికి గొప్ప వారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పుఁ డైన వాని కధిక భాగ్యము గల్గ దొడ్డవారి దిట్టి తొలగఁ గొట్టు అల్పబుద్ధి వా డధికుల నెఱఁగునా విశ్వదాభిరామ! వినుర వేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వ దాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! జగత్తుకే నాధుడవైన నీకు రేపల్లె క్రీడారంగ మయింది.పరమాత్ముడవైన నీవు ఓ గొల్ల భామ యశోదని తల్లిగా చేసుకుని ఆమె చన్ను గుడిచి ఆమెను తరింప జేశావు.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: అల్ల జగన్నాధుకు రే పల్లియ క్రీడార్ధమయ్యె బరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయు దల్లియునై చన్ను గుడిపె దనరగ కృష్ణా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తలలు బోడి చేసుకుని , ఒంటికి బూడిద పూసుకుని, కంభళ్ళు కట్టుకుని మెము భక్తులమని చెప్పుకు తిరిగే వాళ్ళందరు, అవి తిండి కొసం వేసె వేషాలు కాక మరేమి కాదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అల్ల బోడి తలలు తెల్లని గొంగళ్ళూ ఒడల బూతిపూసి యుందురెపుడు ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమీ విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: రాజు నీతిమంతుడైన యెడల, సేవకు లెట్టివారైనను పనులు నెరవేరును. నీతివిశారదుడగు శ్రీరఘురాముని కార్యము చపలచిత్తములగు కోతులు చక్కజేశాయి కదా!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: అవనివిభుండు నేరుపరియై చరియించిన గొల్చువార లె ట్లవగుణలైన నేమి పనులన్నియు జేకురు వారిచేతనే ప్రవిమలనీతిశాలి యగు *రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా ! వికలాంగుని, కురూపిగా వుండువానిని, ధనము లేని దరిద్రుని, విద్యరానివానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని, పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు.
ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: అవయవహీనుని సౌంద ర్యవిహీను దరిద్రు నివిద్య రానియతని సం స్తవనీయు, దేవశృతులన్ భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషికి ఈ శరీరం మీద మక్కువ చాలా ఎక్కువ. ఎంతో వ్యయప్రయాసలు కోరి పెంచి పొషించిన ఈ దేహం తుదకు అగ్ని పాలో నక్కలపాలో అవుతుందన్న విషయం గ్రహించరు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: అస్థిరమగు మేని కదరిపాటుల బొంది పెక్కు విధములందు బెంచి బెంచి అగ్నికిచ్చు; లేక యడవి నక్కల కిచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకలితో వచ్చె వాళ్ళకి పట్టెడన్నం కూడ పెట్టరు కాని వేశ్యలకి ఎంత డబ్బు అయినా ఇస్తారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకలిగొని వచ్చెనని పరదేశికి పట్టెడన్నమైన బెట్టలేడు లంజెదానికొడుకు లంజెల కిచ్చును విశ్వధాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఆకాశగంగ శివుని తలమీంచీ హిమాలయం,భూమి,సముద్రం,పతాళాలకు దిగాజరినట్లు వివేకహీనుడు దిగజారుతాడు.భర్తృహరి
ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రిసు శ్లోకంబైన హిమాద్రినుండి భువిభూలోకంబునందుండియ స్తోకాంభోది బయోధినుండి పవనాంధోలోకముంజేరె గం గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకులమీద వ్రాసింది ఎవరైనా చదవవచ్చు. అలాగే చేతిలోని రెఖలబట్టి ఊహించి చెప్పవచ్చు కాని మన నుదిటిమీద బ్రహ్మ వ్రాసిన రాత చదవడం ఎవరితరమూ కాదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకుమీదివ్రాత యందఱికిదెలియు చేతిలోనివ్రాత జెప్పవచ్చు తోలుక్రిందివ్రాత దొడ్డవాడెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆకులు, వనమూలికలు తింటే కాయసిద్ది కలుగుతుందని మూర్ఖులు వాటిని తింటూ ఉంటారు. ఎప్పుడూ ఆకులు తింటున్నా కాని మేకలకెమన్న మోక్షం కలుగుతుందా?
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆకులెల్ల దిన్న మేకపోతులకేల కాకపోయెనయ్య కాయసిద్ది లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళ బోదురు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు. ఈ పద్యంలో మనిషికి ఉండవలసిన కొన్ని మంచి లక్షణాలను వివరించాడు కవి. ఆ లక్షణాలను అలవరచుకుంటే మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నడుస్తుంది. అందుకే వీటిలో కొన్నిటినైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఆకొన్నకూడె యమృతము తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్ సోకోర్చువాడె మనుజుడు తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: నేర్పరులైన వారి వ్యక్తిత్వం అత్యంత విలక్షణం. మన గురువును ఎప్పుడూ ఎదిరించకూడదు. అన్నం పెట్టే యజమానిపై ఎలాంటి నిందలూ వేయరాదు. చేసే పనులను గురించి అదే పనిగా ఆలోచిస్తూ వృథాగా కాలక్షేపం చేస్తూ కూచుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఇటువంటి మంచి నడవడికలతో మెలిగే వారు నిజమైన నేర్పరులు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఆచార్యున కెదిరింపకు బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా లోచనము లొందజేయకు మాచారము విడువ బోకుమయ్య కుమారా!
10
['tel']