inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! ఇతరులకు ఉత్తర్వు చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరునూ మెచ్చుకొనునట్లుగా వివేకము కలిగి యుండిన యెడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడువుగ ఎంచుతారు.
ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్, బ్రాజ్ఞతను గలిగి యున్నన్, బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: గుణవంతుడైన రాజుకు 6 గుణాలుంటాయి 1. దుష్టశిక్షణ నైపుణ్యం 2.. గొప్పకీర్తి 3. బ్రాహ్మణాదరణ 4. భోగాలను అనుభవించే గుణం 6. గొప్ప విరాళాలను దానంగా ఇవ్వగలగడం 6. శరణన్నవారిని రక్షించడం వీటిలో ఏది లోపించినా అలాంటి రాజును కొలవడం వృథా అంతేకాదు దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు. అని భావం
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆజ్ఞా కీర్తః పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్రసంరక్షణం చ యేషామేతే షడ్గుణా ప్రవృత్తాః కోऽర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ?
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడువారిని, బంగారాన్ని మరియు ధనాన్ని చూసి ఆశ పుట్టనిది ఎవరికి. సాక్షాత్తు బ్రహ్మకూడ తనకు వరుసకు కుమార్తె అయిన సరస్వతి దేవిని చూసి మోహించలేదా? అందుకే అంటారు బ్రహ్మకైన పుట్టు దిమ్మతెగులు అని.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆడదానిజూడ నర్ధంబు జూడగ బమ్మకైన బుట్టు దిమ్మతెగులు బ్రహ్మయాలిత్రాడు బండిరేవున ద్రెంప విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధము అని వేమన భావన)
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మ శుద్దిలేని యాచార మదియేల భాండ సుద్దిలేని పాకమేల చిత్తశుద్దిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైన ఙానులు తాము గొప్ప వాళ్ళమని గర్వపడరు. ధీరులైయున్నను తిరగరు. ప్రశాంతముగా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మశుద్దికలిగి యధికులమనబోరు ధీరవృత్తి కలిగి తిరుగబోరు రూపుకుదరనుంచి రూఢిగావింతురు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆత్మశుద్ధి లేని యాచారమది యేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్దిలేని శివపూజలేలరా? విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా! నీవు గజరాజుఆర్తితో చేసిన మొరను విని వెంటనే కాపాడినదేవుడవు దండకారణ్యమున కోదండ ధారివై తిరిగిన కోమల మూర్తివైన రాముడవు. నాయందుండి నన్ను ఎల్లవేళలా కాపాడవయ్యా!కృష్ణ శతక పద్యము.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఆదండకావనంబున గోదండము దాల్చినట్టి కోమలమూర్తీ నాదండ కావరమ్మీ వేదండము గాచినట్టి వేల్పువు కృష్ణా
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మంచివారు చేసె పనులకు అర్ధం మూర్ఖుడు తెలుసుకోలేడు కాని వాటిని చెడకొడతానికి మాత్రం అన్ని వేళళా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలానే చేసే ప్రతి మంచి పనిలోనూ కూడ తప్పులు పడుతూ ఉంటాడు. జాగ్రత్తగా పేర్చిన కుండలను కుక్క త్రోసి పడగొట్టి చిరాకు చేస్తుంది కాని తిరిగి వాటిని పేర్చలేదు కదా?
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆదికారణముల నల్పుడెట్టు లెఱుంగు? చెప్పలేడుగాని తప్పుబట్టు త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: మొట్టమొదటి వరాహరూపాన్ని (ఆది వరాహం) ధరించిన ఓ కృష్ణా! నువ్వు హిరణ్యాక్షుడు అనే పేరుగల రాక్షసుని చంపి పాతాళంలో మునిగి ఉన్న భూమిని నీ కోరలతో పెకైత్తి ప్రకాశించావు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఆయన ముక్కు నుంచి వరాహం శిశువు రూపంలో బయటపడి, క్రమేపీ పర్వతమంత పెరిగి గర్జించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలు దానిని విష్ణుమూర్తి అవతారంగా గుర్తించారు. ఆ వరాహం సముద్రంలోకి ప్రవేశించి వాసన ద్వారా భూమిని వెతికింది. భూమి పాతాళంలో కనిపించింది. అప్పుడు ఆ ధరణిని వరాహమూర్తి తన కోరలతో పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసరాజు అడ్డు తగిలాడు. హిరణ్యాక్షుడి (హిరణ్యాక్షుడు అంటే సంపదమీద కన్ను వేసినవాడు అని అర్థం) తో యుద్ధం చేసి సముద్రంలోనే వాడిని చంపి భూమిని నీటి పైకి తీసుకువచ్చాడని వరాహావతారాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన భావం వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఆదివరాహుడవయి నీ వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్ మోదమున సురలు పొగడఁగ మేదిని గిరి గొడుగునెత్తి మెఱసితి కృష్ణా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన. ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. అప్పటి ఉమ్మడి కుటుంబాలు కూడా నేడు నామమాత్రమయ్యాయి. కాని విడిపోవడం ఆనాడూ ఈనాడూ అంత సులభం కాదు. సంఘ వ్యవస్థలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. వేదాంతాలన్నీ దీని గురించే చింతన చేస్తున్నాయి. అలాగే సి.పి.బ్రౌన్ "But if she be disagreeable, the only happiness is in quitting her'’ అనటాన్ని కేవలం పాశ్చాత్య వ్యాఖ్యగా కొట్టిపారెయ్యలేం. ఆధిపత్యాన్ని కాసేపు పక్కన పెడితే ఇద్దరి మధ్య ఇష్టం బలంగా ఉంటే కష్టం ప్రసక్తి రాకపోవచ్చు. ఇది స్వభావాలకు సంబంధించిన సమస్య కూడా. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భారతీయ సమాజంలో, భారతీయ సమాజంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇతర సమాజాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి వేమన పద్యాలు మంచి చర్చకు దారితీసి మరింత అర్థవంతమైన మానవ సంబంధాలను, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను బేరీజు వేసుకోవడానికి వీలు కల్పించవచ్చు. ఆనుకూల్యం అంటే అనుకూలమైన భావం. హితమైన, ఆరోగ్యకరమైన ప్రవర్తన. అనుగుణమైన ఆలోచన. ప్రతికూలం కానిది అనుకూలం. మొత్తానికి ఇష్టంగా ఉండేదని. అనుకూలుడు అనేది ఒక నాయక భేదం కూడా. అనుకూలుడు అంటే ఒకే స్త్రీయందు అనురాగం గల నాయకుడు, సహచరుడు, మిత్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో కూడా సస్యానుకూల వర్షం, స్పర్శానుకూలం అనే అభివ్యక్తులున్నాయి. అనుకూల వాయువులు సరేసరి. ‘‘అనుకూల పవన మోహనమ్ములే ఈ దినమ్ములు?’’ అని రాయప్రోలు వారి తృణ కంకణంలో ఓ ప్రయోగం. ఆనుకూల్యానికి వ్యతిరేకమైంది ప్రాతికూల్యం. సౌఖ్యము+అమరు. అమరు అంటే కుదరటం, ఒప్పడం. ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆనుకూల్యము గల అంగన కలిగిన సతికి పతికి పరమ సౌఖ్యమమరు ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కష్టములు కలిగినప్పుడు బంధువులు దగ్గరకు పోయిపరిశీలిపపుము, భయము కలిగినప్పుడు, ధైర్యమును పరీక్షింపుము. దరిద్రముగా వున్నప్పుడు భార్యగుణము పరీక్షింపుము.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆపదల వేళ బంధులరసిజూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా భయపడక చివరివరకు లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి లక్షణం . అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు.ఎప్పుడు కార్యసాధకుల వలనే ఉండాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆత్మకు ఆశ్రయస్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచేర్మడిన ’ఓం’ కారము. దీనిని ఉపాసనా సంప్రదాయమునందు "తారకము" అని అందురు. మరియొక నామము "నాదము". దీనినుండి దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహిరింతురు. నాదము కాని బిందువు కాని చక్కైని శోభతో ప్రకాసించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు సబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. దానిని తెలుపు సావయవసబ్దముల మూలతత్త్వము "కలలు" అనబడు వర్ణములు. ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు శక్తి అను అంశములుగ చూడవలయును. ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ) కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్ సుఖ శ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నిజమైన జీవితానుభవం కలిగినవారు తమ అనుభవములను స్పష్టంగా చెప్పగలరు. కాని ఇతరులావిధంగా చెప్పలేరు. తమకు లేని అనుభవాలని కల్పించి చెప్పేవారు బుద్దిహీనులు. అసలు గురుతే తెలియని వాడు గురిని చూపుట సాధ్యమా?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆర్యులైనవార లనుభవరూఢిని దెలియజెప్పుచుంద్రు తేటపడగ గుఱుతుగననివాడు గుఱియొప్పజెప్పునా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు కుక్క తోకఁబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడిన మాట కొరకు హరిచంద్రుడు ఆలిని అమ్మి, ఆచారము విడనాడి కాటి కాపరియై, పుత్రశోకము అనుభవించి కష్టనష్టాల పాలైనాడు. కాని సత్యానికి ప్రతీకగా నిలిచాడు. కావున నిజం చెప్పెవాళ్ళు మొదలు ఎన్ని కష్టాలు పాలైనా చివరకు సుఖపడతారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలినమ్మి భువిని నాచారహీనుడై ప్రాలు మాలె నొక్క ప్రతిన కొఱకు ఆడి తప్పకుండ కాడుకాచినవాడు వాడె పరమ గురుడు వసుధ వేమ.
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: భార్య మాటవిని అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని వేరుపడే నరుడు మహా మూర్ఖుడు. అలా చేస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు మద్దతునిచ్చేది మన తోబుట్టువులే.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి వేఱుపడుచునుండు వెఱ్ఱిజనుడు కుక్కతోకబట్టి గోదావరీదును విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్థసంపదలనిచ్చి వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో. కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా. కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా నీవు ఎల్లజీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆ యా జన్మలందు ప్రారబ్ధమును నిర్ణయించి దానితోపాటు వారిని జన్మింపజేయుదువు. అట్టి ప్రారబ్ధఫలములోని అంశముగా నీవు నాకు సంసారబంధము అంటగట్టితివి. అందలి అంశముగా ఆలు, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకొనినవి. అందులకు సంబంధించిన పనులతోనే నాకు సమయము గడచుచున్నది. మరి ఏసమయమున ఏవిధముగ నిన్ను ధ్యానించగలను? మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసునందు దుష్టమోహమున్నది. అందుచే కలుగు క్షుద్రచింతలను మానిపి ఎట్లు నన్ననుగ్రహింతువో!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆవు పాలను పిదికి, వేడి చేసి, తోడు వేస్తె ఎలాగైతె వెన్న, పెరుగు, మజ్జిగ దొరుకుతాయొ అలానే ఆత్మను శొధిస్తే కొత్త సంగతులు అవగతమవుతాయి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆవుచన్ను పిదికి ఆ పాలు కాచిన పేరి, పెరుగు చల్ల పేర్లు కలుగు తవిలిలోన గలదు నవనీత మిట్లురా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశ పాపజాతి యన్నింటికంటెను ఆశచేత యతులు మోసపోరె చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం.
ఇచ్చిన అర్ధం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా?
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా పోతన పద్యాలు శైలిలో పద్యం రాయండి: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం.
ఇచ్చిన భావము వచ్చే పోతన పద్యాలు శైలి పద్యం: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?
ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.
ఇచ్చిన అర్ధము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము.
ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా?
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును.
ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు?
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే!
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.
ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు.
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల?
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా కుమారీ శతకం శైలిలో పద్యం రాయండి: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.
ఇచ్చిన భావం వచ్చే కుమారీ శతకం శైలి పద్యం: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా?
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.
ఇచ్చిన అర్ధం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
7
['tel']