inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.
ఇచ్చిన భావము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కుమార శతకం శైలిలో పద్యం రాయండి: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.
ఇచ్చిన భావము వచ్చే కుమార శతకం శైలి పద్యం: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా?
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.
ఇచ్చిన భావం వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా.
ఇచ్చిన అర్ధం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు.
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు
ఇచ్చిన అర్ధం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా
11
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా?
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా కృష్ణ శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం
ఇచ్చిన భావము వచ్చే కృష్ణ శతకం శైలి పద్యం: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
12
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే!
ఇచ్చిన భావము వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి?
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే!
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.
12
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇచ్చిన అర్ధము వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.
ఇచ్చిన అర్ధం వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి
ఇచ్చిన అర్ధము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్.
ఇచ్చిన అర్ధము వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా దాశరథి శతకం శైలిలో పద్యం రాయండి: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా?
ఇచ్చిన తాత్పర్యము వచ్చే దాశరథి శతకం శైలి పద్యం: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు..
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా సుమతీ శతకం శైలిలో పద్యం రాయండి: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.
ఇచ్చిన భావం వచ్చే సుమతీ శతకం శైలి పద్యం: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.
8
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన భావము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన.
ఇచ్చిన భావము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ
9
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా?
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!
10
['tel']
క్రింద ఇచ్చిన అర్ధము వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో?
ఇచ్చిన అర్ధము వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!
12
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే!
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భాస్కర శతకం శైలిలో పద్యం రాయండి: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు.
ఇచ్చిన భావం వచ్చే భాస్కర శతకం శైలి పద్యం: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్
7
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.
ఇచ్చిన భావం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!
8
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం.
ఇచ్చిన తాత్పర్యం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!
7
['tel']
క్రింద ఇచ్చిన తాత్పర్యము వచ్చే లాగా నరసింహ శతకం శైలిలో పద్యం రాయండి: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.
ఇచ్చిన తాత్పర్యము వచ్చే నరసింహ శతకం శైలి పద్యం: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
10
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా భర్తృహరి సుభాషితాలు శైలిలో పద్యం రాయండి: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు.
ఇచ్చిన భావం వచ్చే భర్తృహరి సుభాషితాలు శైలి పద్యం: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు
8
['tel']
క్రింద ఇచ్చిన భావం వచ్చే లాగా శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలిలో పద్యం రాయండి: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము.
ఇచ్చిన భావం వచ్చే శ్రీ కాళహస్తీశ్వర శతకం శైలి పద్యం: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
8
['tel']
క్రింద ఇచ్చిన అర్ధం వచ్చే లాగా వేమన శతకం శైలిలో పద్యం రాయండి: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?.
ఇచ్చిన అర్ధం వచ్చే వేమన శతకం శైలి పద్యం: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!
11
['tel']